DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతిని జాగృతి చేసి, ఐక్యత పెంచేందుకే జాతీయ భాష

*ఒకే జాతి - ఒక భాష అందుకే దక్షిణాది పై అధిక శ్రద్ధ*  

*ఉత్తరాదైనా, దక్షినాదైనా యాసలు వేరైనా భాష ఒక్కటే. . . .*

*తమిళ నాట హిందీ నేటికీ జన విరోధిగానే. . .ప్రాచుర్యం. . .*

*సెప్టెంబర్ 14,  వాడవాడలా హిందీ దివస్ పై DNS ప్రత్యేక కథనం* 

*(DNS report : Sairam CVS, బ్యూరో, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం,

సెప్టెంబర్ 14, 2020 (డి ఎన్ ఎస్):* ఆధునిక భారతావని లో సెప్టెంబర్ 14, కు అత్యంత ప్రాధాన్యత ఉంది. యావత్ భారతావనిని భాష ద్వారా ఏకం చేసిన రోజు.   

విభిన్న ప్రాంతాలు, వివిధ భాషలు కల్గిన అఖండ భారతావనిని ఏకం చేసి, జనాన్ని జాగృతి పరిచి, ఐక్యత పెంచేందుకు అత్యంత ఆవశ్యకమైనది భాష.  
దీనికై దశాబ్దాల తరబడి ఎన్నో చర్చలు,

సమావేశాలు జరిపి తీసుకున్న నిర్ణయం, చట్ట సభ సాక్షిగా ఆమోదించడబడిన చట్టం. దేశం లో అధిక శాతం ప్రజలు మాట్లాడే భాషను ఇతర ప్రాంతాల్లో సైతం అలవాటు చేసి అమలు చేసేందుకు నాటి పెద్దలు ఆమోదించిన భాష హిందీ. ఉత్తరాది లో అధిక ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం లో ఉన్న భాష గా హిందీ కి గుర్తింపు ఉన్నప్పటికీ ప్రతి

ప్రాంతంలోనూ ఒక్కో యాస విస్తృతంగా అమలు లో ఉంది. అయితే దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా ప్రాంతాల్లో హిందీ కి ఏమాత్రం గుర్తింపు లేదు. పైగా ఈ భాష వీరికి పూర్తిగా కొత్త. 

ప్రధానంగా భారత దేశ స్వాతంత్ర పోరాట సమయంలో జాతిని జాగృతి చేసి, ఐక్యత పెంచేందుకు వినియోగించబడిన భాష హిందీ.

ఉద్యమ స్పూర్తితో హిందీ వాదులు దక్షిణాదిలో సంచరించిన సమయాల్లో వారి ప్రసంగం జనానికి తెలియాలి అంటే దుబాసీ ల అవసరం ఎంతో ఉండేది. దీంతో ఉద్యమ పోరాటం లో ఉన్నవారికి ముందుగా హిందీ భాషను నేర్పించి, వారి ద్వారా జనబాహుళ్యం లోకి తీసుకు వెళ్లడం జరిగింది. తద్వారా సామాన్య ప్రజలకు హిందీ ని పరిచయం చేయడం సులభం

అయ్యింది. 

తమిళనాట నేటికీ వ్యతిరేకత. .. 

మాతృ భాషపై అధిక వ్యామోహం కల్గిన తమిళ రాష్ట్రంలో మొదటి నుంచి హిందీ భాషను అంగీకరించలేదు. ఒకానొక సమయంలో ఉత్తరాది వారిని ఈ రాష్ట్రంలో ప్రవేశించనిచేవారు కాదు అంటే అతిశయోక్తి కాదు. అయితే స్వాతంత్ర స్ఫూర్తి ని చాట్ సమయంలో మోహన్ దాస్ కరం చాంద్ గాంధీ ఈ ప్రాంతం

వారికి హిందీ ని మరింత దగ్గర చేసేందుకు ఒక ప్రచార సభను సైతం చిన్న పట్నం ( మద్రాసు ) నగరం లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ను నెలకొల్పారు. ఈ కేంద్రం ద్వారా యావత్ దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా రాష్ట్రాల్లో విద్యావంతులకు హిందీ పై అవగాహనా పెంచి, వారిని సుశిక్షుతులుగా తయారు చేస్తున్నారు.

నేటికీ వేలాది గా ప్రచారకులు గ్రామా స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకూ హిందీ వ్యాప్తికి కృషి చేస్తున్నారు. ఒకానొక సమయంలో హిందీ అంటే దూరం వెళ్లే గ్రామీణులు సైతం నేడు ప్రసార మాధ్యమాల్లో వచ్చే హిందీ భాష కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా వీక్షించగలుగుతున్నారు అంటే ఇదంతా ప్రచారకులు విజయమే. అయితే తమిళనాట నేటికీ అధికారిక

గుర్తింపు సాధించలేకపోయింది. 

ప్రభుత్వ కార్యాలయాల్లో. . 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి రోజూ హిందీ వ్యాప్తి కై కార్యాచరణ చేపడుతున్నారు. రోజుకో హిందీ పదం నేర్చుకుందాం అనే శీర్షికను నిర్వహిస్తున్నారు. 


కామారెడ్డి కి చెందిన హిందీ భాష ప్రచారక్ నిరంజన్ ఖడంగా

మాటల్లోనే. . . 

 ప్రపంచ భాషలలో చైనీస్‌ తరువాత అత్యంత ప్రాచుర్యం ఉన్న భాషగా హిందీ గుర్తింపు పొందింది. జాతీయ సమైక్యత, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఈ భాష తోడ్పడుతోంది.  

‘హిందీ భాష హమారి జాన్‌ హై, హమారి పహ్‌చాన్‌ హై’ అంటూ దేశ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో గాంధీ హిందీ భాష ఔన్నత్యాన్ని చాటారు.

దేశ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ఈ భాషను విస్తృతంగా వాడుకున్నారు. దేశంలో అత్యధికులు మాట్లాడేది హిందీ భాష. ఇది దేశ ప్రజల మధ్య సంధాన భాషగా ఉపయోగపడుతోంది. దేశ జాతీయ భాషగా రాజ్యాంగం హిందీని గుర్తించిన సెప్టెంబర్‌ 14ను దేశంలో హిందీ దివస్‌గా జరుపుకుంటున్నారు. 

దేశంలోని 10 రాష్ట్రాల్లో హిందీ అధికార

భాష. 

దేశ అధికార భాషగా హిందీ ఉంటుందని రాజ్యాంగంలోని 17వ భాగంలో 343 ఆర్టికల్‌లో పేర్కొన్నారు. అదే ఆర్టికల్‌లో రాజ్యంగం అమలులోనికి రాగానే 15 సంవత్సరాల వరకు అన్ని రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఆంగ్ల భాష ప్రయోగం కూడా చేయవచ్చని పేర్కొన్నారు. 1965కు ఆ నిబంధన పూర్తి కావాలి. కానీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. పాలకులు

ఆంగ్లభాషనే ఇంకా వ్యవహారంలో ఉంచి హిందీ భాషకు ద్రోహం చేస్తున్నారని హిందీ భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

హిందీ భాష లిపి దేవనాగరి లిపి. 

హిందీ భాషకు పశ్చిమ హిందీ, పూర్వీహిందీ, ఖడీబోలీ, రాజస్థానీ, పహడీ, బీహారీ లాంటివి ఉపభాషలు.
హిందీ భాషలో సూరదాసు సూర్యుడిగా, తులసీదాసు చంద్రుడిగా

గుర్తింపు పొందారు. వీరు రాసిన సూర్‌సాగర్, రామచరితమానస్‌లు జీవగ్రంథాలుగా పేరుపొందాయి.

మీరాబాయి కృష్ణుని భక్తిలో లీనమై రాసిన భజన పాటలు పదావళిలో ఉన్నాయి. భక్తి ఉద్యమ కాలంలో సమాజానికి దిశా నిర్దేశం చేసిన రచనల్లో మీరాబాయి రచనలు ప్రముఖంగా నిలిచాయి.

సమాజంలోని దురాచారాలను తొలగించడానికి

కబీర్‌దాస్‌ అనే హిందీ ప్రజాకవి చాలా తోడ్పడ్డారు. అనైతిక దృశ్యం ఏది కనిపించినా తన రచనలు, దోహాలలో ఎత్తి చూపారు. ఆయన కవిగానే కాకుండా సంఘ సంస్కర్తగా పేరుపొందారు. బీజక్‌ ఇతని ప్రధాన గ్రంథం. 
‘సాఖీ, సబద్, రమైనీ’ దీనిలోని భాగాలు, 

స్వాతంత్య్రోద్యమంలో హిందీ భాష కీలకపాత్ర పోశించింది. దేశ ప్రజలందరినీ ఏకం

చేసి వారి భావాలను పంచుకోవడానికి దోహడపడింది. భారతీయులంతా ఒక్కటే అనే ఐక్యతాభావాన్ని పెంపొందించింది.

ప్రపంచంలో 150 కంటే ఎక్కువ యూనివర్సిటీలు హిందీకి సంబంధించిన కోర్సులను నిర్వహిస్తున్నాయి. హిందీకి దేశంలోనే కాక, విదేశాల్లోనూ క్రేజ్‌ ఉంది.

భారత మాజీ ప్రధాని అటల్‌బీహారీ వాజ్‌పేయి హిందీ భాషలో

ఐక్య రాజ్యసమితిలో మాట్లాడి హిందీ భాషా మాధుర్యాలను ప్రపంచానికి తెలియజేశారు.
 
జాతీయ భాషను నిర్లక్ష్యం చేస్తున్నారు: గఫూర్‌శిక్షక్, 

దేశీయ భాషలపై ప్రభుత్వాలు నిర్లక్ష్య విధానాలను అనుసరిస్తున్నాయని హిందీ శిక్షక్‌ సమితి వ్యవస్థాపక గౌరవాధ్యక్షులు  గఫూర్‌శిక్షక్ ఆవేదన వ్యక్తం చేసారు. జాతీయ

భాషగా గుర్తింపు, గౌరవం ఉన్నప్పటికీ అమలులోకి రాకుండా, ఆంగ్లభాషను వాడుతూ హిందీకి సరైన గౌరవం ఇవ్వడం లేదు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలను ఏకం చేయడంలో ఉపయోగపడిన హిందీని కాపాడుకోవడమే కాదు.. తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam