DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంకితభావంతో ప్రజలకు,సేవ చెయ్యాలి: ఎస్పీ అమిత్ బర్దర్ 

*(DNS report : Acharyulu SV, బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, September 14, 2020 (DNS):* పోలీసు వ్యవస్థ ద్వారా ప్రజలకు అత్యంత చేరువలో సేవలందించే అవకాశం భగవంతుడు మనకు ప్రసాదించారని, ఆ అవకాశంను మీరు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పోలీసుశాఖలో సివిల్ కానిస్టేబుళ్ళుగా

పని చేసేందుకు ఎంపికై , తొమ్మిది మాసాల శిక్షణ పూర్తి చేసుకొని వచ్చిన 36 మంది కానిస్టేబుళ్ళుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం తండేవలసలో జరిగిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ - శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చిన నూతన పోలీసు కానిస్టేబుళ్ళకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు

తెలిపారు. 

ప్రజల సమస్యలు అర్థం చేసుకొనే బాధ్యత ముందుగా కానిస్టేబుళ్ళకు ఉంటుందని, ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటిని అధికారుల దృష్టికి తీసుకవెళ్ళి, వాటిని తక్షణ సహాయం అందించేందుకు అంకితభావంతో పని చేయాలన్నారు. పోలీసుశాఖలో ప్రవేశించిన కానిస్టేబుళ్ళు రాజ్యాంగ బద్దంగా, నిష్పక్షపాతంగా, కుల, మతాలకు, రాగ,

ద్వేషాలకు అతీతంగా, నిబద్ధతత, అంకిత భావంతో ప్రజలకు సేవలందించాలన్నారు. మీరుందరూ క్రమశిక్షణతో పాటు మానసికంగా, శారీరికంగా దృఢసంకలాపంతో శాంతి భద్రతల పరిరక్షణలోను, బందోబస్తు విధులును సక్రమంగా నిర్వహిస్తూ వ్యక్తిగత రక్షణతో  ప్రజల హక్కులను, ధన, మాన ప్రాణాలకు రక్షించే విధంగా అంకిత భావంతో విధులు నిర్వర్తించి జిల్లా

పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రస్తుతం కోవిడ్ 19 వైరస్ విస్తృతమవుతున్న నేపథ్యంతో వైరస్ ను నియంత్రించేందుకు పోలీసుశాఖ అహర్నిశలు కృషి చేస్తుందని, మీరుంత యువ కానిస్టేబుల్ కాబట్టి సిబ్బంది ఎవ్వరుకి వైరస్ సోకకుండా స్వీయ నియత్రణ పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొంటూ పటిష్టంగా విధులు నిర్వర్తించాలన్నారు .

ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ విధులలో అప్రమత్తంగా వుండాలని నూతనంగా  వచ్చిన పోలీసు కానిస్టేబుళ్ళుకు జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేసారు.ఈ కార్యక్రమంలో డి.పి.టి.సి డిఎస్పీ ఎన్ఎస్ఎస్. శేఖర్, సిఐ వీరకుమారు, ఆర్ఐ ప్రదీప్ లు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam