DNS Media | Latest News, Breaking News And Update In Telugu

21 నుంచి స్కూళ్ళు,  ఇష్టమైతేనే బడి. . లేదంటే ఇంట్లోనే

 *కరోనా దృష్ట్యా కేంద్రం మార్గదర్శకాలు విడుదల* 

*(DNS report : Acharyulu SV, బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, September 16, 2020 (DNS):*  అన్‌లాక్‌ 4.0లో భాగంగా ఈ నెల 21 నుంచి 9 నుంచి 12 తరగతుల వరకు క్లాసుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

వాటి ప్రకారమే నడుచుకోవాలని స్పష్టంచేసింది.  మార్గదర్శకాల్లో ప్రధానంగా విద్యార్థులకు ఇష్టమైతేనే బడికి వెళ్లే వెసులుబాటు కల్పించింది. లేదంటే ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌ క్లాసులు వినే ఆప్షన్‌ ఇచ్చింది.  ఈ మేరకు తల్లిదండ్రులు/సంరక్షకుల నుంచి రాతపూర్వక లేఖను విద్యార్థులు సమర్పించాలని

పేర్కొన్నది.

*కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలు : . . . *

కంటైన్మెంట్‌ జోన్లకు బయట ఉన్న స్కూళ్లనే తెరువాలి. కంటైన్మెంట్‌ జోన్లలోని విద్యార్థులు,టీచర్లు, ఉద్యోగులు బడికి రావద్దు.

తరగతి గదితోపాటు అందరూ వినియోగించే అన్ని ప్రాంతాలను విధిగా శానిటైజ్‌ చేయించాలి.

ఒకవేళ స్కూల్‌ను

క్వారంటైన్‌ సెంటర్‌గా వాడితే పరిసరాలన్నింటినీ వందశాతం శానిటైజ్‌ చేయాలి. 

పాఠశాలకు రావడం, వర్చువల్‌ క్లాసులకు వెళ్లడం..వంటివి ఎంచుకునే స్వేచ్ఛను విద్యార్థులకే వదిలేయాలి. 

చేతులు కడుక్కోవడానికి వీలుగా సబ్బులు, శానిటైజర్లను విద్యార్థులు, సిబ్బందికి అందుబాటులో

ఉంచాలి.

స్టాఫ్‌గది, కార్యాలయం,మెస్‌, గ్రంథాలయం, కేఫటేరియాల్లో భౌతికదూరం పాటించేలా చూడాలి.

విద్యార్థి,టీచర్‌ మధ్య ఇంటరాక్షన్‌ కోసం ఆరుబయట,లేదంటే చెట్లకింద ఏర్పాట్లు చేయాలి.  

తరగతి గది ఉష్ణోగ్రతలు 24 -30 సెల్సియస్‌ డిగ్రీలుగా, తేమ 40 -70 శాతంగా ఉండాలి.

గదుల్లో గాలి ధారాలంగా

రావాలి. స్వచ్ఛగాలిని పీల్చుకునేందుకు వీలుగా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి.

విద్యార్థులు ఉపయోగించే, లాకర్లు,అల్మారాలను రోజుకొకసారి శానిటైజేషన్‌ చేయాలి. ఈతకొలనులను తెరువద్దు.

యాక్టివిటీస్‌ సమయంలో : . . . . నోటుపుస్తకాలు, పెన్నులు,పెన్సిళ్లు, వాటర్‌బాటిళ్లను ఒకరినొకరు మార్చుకోవడాన్ని

అనుమతించరాదు.

ప్రయోగశాలల్లోకి తక్కువ మందిని అనుమతించాలి. సెషన్లుగా విభజించి విద్యార్థులను తీసుకెళ్లాలి. 

ప్రయోగశాలల్లోని పరికరాలను వాడకముందు, వాడిన తర్వాత ఎప్పటికప్పుడు శానిటైజ్‌చేయాలి. 

టైమ్‌స్లాట్స్‌గా, విద్యార్థులను బృందాలుగా విభజించి కృత్యాలు నిర్వహించాలి. అనంతరం

శానిటైజ్‌ చేయాలి.

ఇతర జాగ్రత్తలు: . . . బస్సుల్లో విద్యార్థులను తరలించేటప్పుడు భౌతికదూరం పాటించాలి

తరగతులు, ప్రయోగశాలల్లో విద్యార్థులు తాకే ప్రాంతాలన్నింటిని ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయాలి. 

పాఠశాల ప్రారంభానికి ముందు,ముగిసిన తర్వాత రెండుసార్లు

శానిటైజ్‌చేయాలి.

కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లను 70 శాతం ఆల్కహాల్‌ గల వైపర్లతో క్రిమికీటకనాశనం చేయాలి.

తాగునీరు, హ్యాండ్‌వాష్‌స్టేషన్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లును పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు వాడిన మాస్క్‌లు ప్రత్యేక డబ్బాల్లో

వేయాలి. మూడురోజుల కోసారి పడేయాలి.

విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో క్లీనింగ్‌ యాక్టివిటీస్‌ కోసం వాడరాదు.

పాఠశాల ప్రాంగణంలో, ఆరుబయట, రోడ్లమీద గుమిగూడొద్దు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు అనారోగ్యానికి గురైన వారిని పాఠశాలకు రావొద్దని ఆదేశించాలి. 

టీచర్లు, స్కూల్‌

కౌన్సిలర్లు,స్కూల్‌ హెల్త్‌వర్కర్లు విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపే ప్రయత్నం చేయాలి.

విద్యార్థులు, టీచర్లల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారిని ఇతరుల నుంచి వేరుచేయాలి (ఐసోలేషన్‌)

అనార్యోగానికి గురైనవారికి ఒకవేళ పాజిటివ్‌వస్తే వెంటనే వారు తిరిగిన ప్రదేశాలను శానిటైజేషన్‌

చేయాలి.

పాఠశాలలు తెరిచిన తర్వాత : . . . . విద్యార్థులు, అధ్యాపకుల మధ్య కనీసం 6 ఫీట్ల భౌతికదూరం ఉండాలి. అందరికీ ఫేస్‌షీట్స్‌, మాస్క్‌లు తప్పనిసరి.

ఆల్కహాల్‌ బేస్డ్‌ శానిటైజర్‌తో తరచూ చేతులు కడుక్కోవాలి. తుమ్మినా, దగ్గినా మోచేతిని, చేతిరుమాలును అడ్డుపెట్టుకోవాలి. 

పాఠశాల ప్రాంగణంలో

ఉమ్మడం నిషేధం. అందరూ ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడాలి.

ఉదయం, సాయంకాల ప్రార్థనలు, ఆటలు, ఈవెంట్స్‌ను తక్కువ మంది విద్యార్థులతోనే నిర్వహించాలి. 

అత్యవసర సమయాల్లో సంప్రదించడానికి రాష్ట్ర, స్థానిక ఆరోగ్యసిబ్బంది హెల్ప్‌లైన్‌ నెంబర్లను ప్రదర్శించాలి. 

హైరిస్క్‌

ఉన్నవారు.. అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనాపై ఉద్యోగులు, విద్యార్థుల్లో అవగాహన పెంచాలి

అందుబాటులో ఉంచాల్సినవి : . . . 

పర్సనల్‌ ప్రొటెక్షన్‌ కిట్లు, ఫేస్‌కవర్లు, మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్లను పెద్దఎత్తున నిల్వ ఉంచుకోవాలి.

థర్మల్‌గన్స్‌, ఆల్కహాల్‌వైపర్లు, సబ్బులు, పల్స్‌

ఆక్సీమీటర్లు, ఐఈసీలను సైతం అంబాటులో ఉంచుకోవాలి.

వాడిన పీపీఈ కిట్లు, చెత్తను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం తరలించాలి.

వ్యర్థాల సేకరణ, నిర్వహణపై పారిశుధ్య కార్మికులకు (హౌస్‌కీపింగ్‌) శిక్షణనివ్వశిక్షణనివ్వలి
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam