DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వావిలాల స్పూర్తితో మద్య విమోచన ఉద్యమంలో అడుగులు 

*మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి*

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 17, 2020 (డి ఎన్ ఎస్ ):* స్వాతంత్య్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. స్వాతంత్య్రోద్యమ దేశ

చరిత్రలో ఓ మహోజ్వల ఘట్టం నడిపిన దివంగత వావిలాల గోపాలకృష్ణయ్య 115వ జయంతి వేడకలు  ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రామన్నపేటలోని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా తొలుత దివంగత వావిలాల చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. అనంతరం

లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ సమాజ సేవ కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసే వారు అరుదుగా ఉంటారని.. ఆజన్మాం తం వావిలాల బ్రహ్మచారిగా ఉండి ప్రజా సేవలో తరించారని చెప్పారు. విశ్వవిద్యాలయాల స్థాపన, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం, మద్యపాన నిషేధానికి అనేక ఉద్యమాలు నిర్వహించిన ఘనత వావిలాలకు దక్కుతుందన్నారు. అలాంటి

గొప్ప నాయకుడి జీవిత విశేషాలు భవిష్యత్తు తరాలకు తెలపకపోతే ద్రోహం చేసినట్లు అవుతుందన్నారు. 1990 వ దశకంలో రాష్ర్టంలో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమంలో వావిలాల కీలక భాగస్వామ్యం వహించారని... అప్పట్లో భారత జ్ఞానవిజ్ఞాన సమితికి ఆయన ఉపాధ్యక్షులుగా పనిచేశారని గుర్తుచేశారు. తాను కార్యదర్శిగా, బీపీఆర్ విఠల్ అధ్యక్షునిగా

సమర్ధంగా పనిచేసేందుకు వావిలాల తోడ్పాటును జ్ఞప్తికి తెచ్చుకున్నారు. దేశం కోసం.. సమాజ శ్రేయస్సు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతలని అలాంటి గొప్ప వ్యక్తి, స్వాతంత్య్ర సమర జ్వాల.. మన వావిలాల గోపాలకృష్ణయ్య అని కీర్తించారు. రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పి.రామచంద్రరాజు

మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డగా.. దేశ సేవలో తరించిన ధన్యజీవి వావిలాల అని కొనియాడారు. వ్యక్తిగత, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని,  బ్రిటీష్‌ వారిపై విప్లవ శంఖం పూరించిన సమరయోధుడు వావిలాల గోపాల కృష్ణయ్యగా గుర్తుచేశారు. నేటి విద్యావ్యవస్థలో ఆర్ధికపరంగా పోటీతత్వం పెరిగి స్వార్ధపూరిత వాతావరణంతో విలువలు

కనుమరుగవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఎందరో మహానుభావులు భరతమాత బానిస సంకెళ్లు తెంచేందుకు తమ జీవితాలను త్యాగం చేశారని, అలాంటి వారిలో స్వాతంత్య్ర సమరయోధుడు, సత్తెనపల్లి మాజీ శాసన సభ్యుడు వావిలాల గోపాలకృష్ణయ్య ఒకరని చెప్పారు. ఆయన నిర్మించిన లైబ్రరీ గ్రంథాలను డిజిటలైజేషన్ చేసేందుకు పూనుకోవాలని

పిలుపునిచ్చారు. ఇందుకు తనవంతు సహకారం అందిస్తామన్నారు. ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టారు మాట్లాడుతూ చేతికి సంచి తగిలించుకొని సాదాసీదాగా కనిపించే వావిలాల సాయుధ పోరాటంలో భాగంగా విప్లవ బాట పట్టారని, బ్రిటీషు పాలకుల నిరంకుశత్వ పాలనపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసి వారి గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచారని చెప్పారు. ఆయన

ఆశయం సంపూర్ణంగా సిద్ధించాలంటే, అక్షరాస్యత, మద్యనిషేధం అమలు చేయాలన్నారు. వాలంటీర్ వ్యవస్థను అక్షరాస్యత ఉద్యమానికి సైతం వినియోగిస్తే సత్పలితాలు వస్తాయన్నారు. మాజీ పోలీసు ఉన్నతాధికారి చక్రపాణి మాట్లాడుతూ గుంటూరులో తాను పనిచేసిన కాలంలో వావిలాల ఉద్యమాలు, అనభవాలను ప్రస్తావించారు. సామాజిక విద్యావేత్త ప్రొఫెసర్

నూతలపాటి అరవింద్ మాట్లాడుతూ అక్షరాలతో పాటు బాధ్యతలు నేర్పే విద్యా వ్యవస్థతో వావిలాల ఆశయం నెరవేరుతుందన్నారు. అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ వావిలాల గుంటూరు వాసి కావడం గర్వకారణమన్నారు. కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కె.శివారెడ్డి మాట్లాడుతూ విలువలకు కట్టుబడిన గాంధేయవాదిగా వావిలాలను

అభివర్ణించారు. 

విద్యా ఫౌండేషన్ ప్రసంసా పత్రాలు : 

వావిలాల జయంతి వేడుకల్లో భాగంగా విద్యా పౌండేషన్ ఆధ్వర్యంలో  కోవిడ్ విధుల్లో సమర్ధంగా పనిచేసిన వాలంటీర్లకు ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి చేతులమీదుగా ప్రసంసాపత్రాలందజేశారు. ఈ సందర్భంగా సామాజిక

సేవాకార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న విద్యాపౌండేషన్ అధినేత అనురాధ నాయుడుని లక్ష్మణరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధరంగాల నుంచి నాయకులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam