DNS Media | Latest News, Breaking News And Update In Telugu

షేర్ మార్కెట్ లో ఎల్ఐసి ని లిస్టింగ్ చేస్తే భారీ నష్టం.

*బీమా సంస్థల ఉద్యోగులు, ఏజెంట్ల సంఘం హెచ్చరిక*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 19, 2020 (డి ఎన్ ఎస్):* షేర్ మార్కెట్లో ఎల్ఐసి ని లిస్టింగ్ లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రతిపాదన  పాలసీదారుల యొక్క ప్రయోజనాలకు హాని చేకూర్చడమేకాక, సంస్థ

ఆర్థికపరంగా కుదేలవుతుందని ఇన్సూరెన్సు కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్, విశాఖపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎన్. రమణాచలం తెలిపారు. శనివారం విశాఖపట్నం లోని జీవన బీమా సంస్థ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్.ఐ.సి.లో ప్రభుత్వ వాటాగా ఉన్న 100%, 5% నుండి 25% ప్రైవేటీకరణ చేయాలని, విధంగా ఉంది. 40 కోట్ల

పాలసీదారు యొక్క నమ్మకాన్ని గెలుచుకున్న ఎల్.ఐ.సి. దేశ, అవసరాలకు, పంచవర్ష ప్రణాళికలకు ఎన్నో లక్షల కోట్లు ఎల్.ఐ.సి. సమకూరుస్తుందన్నారు. 

గత సంవత్సరం 2019-2020 ఆర్ధిక సంవత్సరంలో ఎల్.ఐ.సి. 2698 కోట్లు డివిడెంట్ గవర్నమెంట్ కి ఇచ్చింది. 25.17% పాలసీల వృద్ధి సాధించింది. మొత్తం 2.19 కోట్ల కొత్త పాలసీలను ఇచ్చింది. ప్రభుత్వం

ఇప్పటివరకు పెట్టిన 100 కోట్ల పెట్టుబడికి, ఈరోజు ఎల్.ఐ.సి. ఆస్థులు 32 లక్షల కోట్లు పైచిలుకు, పెట్టుబడులు 29 లక్షల పైచిలుకు ఉన్నాయి. 

తక్షణం ప్రభుత్వం ఈ యోచనను విరమించుకోవాలని ఎల్.ఐ.సి. ఉద్యోగులు, అధికారులు మరియు ఏజెంట్లు అందరూ డిమాండ్ చేసారు. ప్రభుత్వం ఎల్.ఐ.సి. లో ఐ.పి.ఓ. అనే ప్రతిపాదనని విరమించుకోకపోతే, ఎల్.ఐ.సి.

ఉద్యోగులుగా మరింతగా ఆందోళనకు దిగవలసి వస్తుందని చెప్పడం జరిగింది. ప్రభుత్వరంగ సంస్తలను ప్రైవేటుపరం చేయడం, దేశ ఆర్థిక ప్రగతికి గట్టి అవరోధమని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.

ఈ సమావేశంలో  ఎల్.ఐ.సి. విశాఖపట్నం డివిజన్లో పని చేస్తున్న ఇన్సూరెన్స్ ఉద్యోగులు, ఆఫీసర్స్ మరియు ఏజెంట్స్ యూనియన్స్ (ఎల్.ఐ.సి.-1)

ఆఫీసర్స్, ఎన్.ఎఫ్.ఐ.ఎఫ్.డబ్ల్యు. ఐ., సి.ఇ.యు., ఎ.ఓ.ఐ., ఎల్.ఐ.ఎ.ఎఫ్.ఐ యూనియన్స్) ప్రతినిధులు, మీడియా ఇంచార్జి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam