DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జైలు నుంచి విడుదలైన వారికి ఉపాధి కల్పన 

*రాష్ట్రంలో 21చోట్ల పెట్రోల్‌ బంకుల ఏర్పాటు*

*జైళ్లశాఖ డీఐజీ ఎం.ఆర్‌.భాస్కర్‌ వెల్లడి.*

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 19, 2020 (డి ఎన్ ఎస్ ):*జైలు నుంచి విడుదలైన వారికి ఉపాధి చూపేందుకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 21 పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేస్తున్నామని

జైళ్లశాఖ డీఐజీ ఎం.ఆర్‌.భాస్కర్‌ తెలిపారు. అచ్చంపేటలోని పాతజైలు ప్రాంగణంలో జైళ్లశాఖ ఆధ్వర్యంలో హెచ్‌పీసీఎల్‌ భాగస్వామ్యంతో నిర్మించిన పెట్రోల్‌ బంకును ఆయన ప్రారంభించారు. విడుదలైన ఖైదీలు మళ్లీ నేరాలబాట పట్టకుండా, సమాజంలో గౌరవంగా జీవించాలనే పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేశామన్నారు. ఏర్పాటు చేసిన అన్ని

చోట్లా విజయంవతంగా కొనసాగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేటలో బంకులు ఉన్నాయని, త్వరలోనే కల్వకుర్తిలో ప్రారంభిస్తామని చెప్పారు. ఖైదీలకు పునరాసం కల్పించటం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని కొనియాడారు. ఉపాధి పొందే విడుదలైన ఖైదీలకు హైదరాబాద్‌లో రూ.

15వేలు, మిగతా చోట్లా రూ. 12వేల చొప్పున నెల వేతనం ఇస్తున్నామని తెలిపారు. వారికి ఉదయం అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. వినియోగదారులకు నాణ్యమైన చమురు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని హెచ్‌పీసీఎల్‌ కంపెనీ ప్రతినిధులు, జైళ్లశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ జైళ్లశాఖ పర్యవేక్షకుడు సంతోష్‌ రాయ్‌,

అచ్చంపేట డీఎసీపీ నర్సింహులు, జైలర్‌ తిరుమల్‌రెడ్డి, సీఐ రామకృష్ణ, ఎస్సైలు ప్రదీప్‌కుమార్‌, రమేశ్‌ అజ్మీర, సేల్స్‌ అధికారి సాయి తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam