DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వెల్లంపల్లి ఇంటిముందు జనసేన ధర్నా, భారీ అరెస్టులు 

*దేవాలయాలపై దాడులపై శాంతియుత నిరసనకు పిలుపు*

*పోతిన  మహేష్ సహా 41 మంది జనసేన నేతలపై కేసులు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం/ విజయవాడ , సెప్టెంబర్ 19, 2020 (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు, విజయవాడ కనకదుర్గమ్మ వారి ఉత్సవ రథం వెండి సింహాల

మాయం నేపధ్యంలో విజయవాడ లో  దేవాదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద శాంతియుత నిరసనకు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పిలుపు ఇచ్చారు. శనివారం ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి

చేరుకున్నారు. 
శాంతియుతంగా నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అంతే సంఖ్యలో పోలీసులు జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని శ్రీ పోతిన మహేష్ సహా పార్టీ నేతల్ని గృహ నిర్భంధం చేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. శాంతియుత నిరసన అడ్డుకోవడం అన్యాయం అంటూ జనసేన నేతలు పోలీసులతో వాగ్వాదానికి

దిగారు. 
దీంతో  పోతిన మహేష్, అజయ్ వర్మ ఠాకూర్, ఆకుల కిరణ్ కుమార్, బొలిశెట్టి వంశీ,  వెన్నా శివశంకర్, వీరమహిళలు రావి సౌజన్య, విజయలక్ష్మి, షేక్ షహీనా, భవానీ సహా 41 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 

వీరందరినీ సింగ్ నగర్, న్యూ రాజరాజేశ్వరీపేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. సెక్షన్ 143, 188, రెడ్ విత్ 149

సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు బయలుదేరిన జనసేన నేతల అరెస్ట్ పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవాలయాలు, దేవతా విగ్రహాలు, రథాలపై దాడులు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవాల్సిన ప్రభుత్వం... ఈ దాడులను నిరసిస్తూ ఉన్న జనసేన నాయకులను నిర్బంధించడం అప్రజాస్వామికం. ఈ దాడులతో

పాటు దేవాదాయ శాఖలో అక్రమాల గురించి సమగ్ర విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని జనసేన నాయకులు స్పష్టం చేస్తున్నారు. విజయవాడ అ దుర్గమ్మ వారి వెండి రథం సింహాలు ఏ విధంగా మాయమయ్యాయో దేవాదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam