DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హమ్మయ్య. . తిరుమల వెంకన్న వయసు ఎంతో తెలిసిపోయింది.

తిరుమల వెంకన్నని సీనియర్ సిటిజన్ గా టిటిడి డిసైడ్ చేసిందా?

గుడిలోపలే బ్రహ్మోత్సవ వాహన వేడుకలు, ఇంటికే పరిమితి

మహాద్వారం లోపలే వాహన వేడుకలు, అంతా ఏకాంతమే. .

భక్తులు లేకున్నా . . మాడా వీధుల్లో వేడుకలు లేవు.

(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం) 

*విశాఖపట్నం,

సెప్టెంబర్ 21, 2020 (డి ఎన్ ఎస్):* హమ్మయ్య. . తిరుమల వెంకన్న వయసు ఎంతో తెలిసిపోయింది. ఆయనొక వృద్ధుడు అని తెలిసిపోయింది. ఇదే విషయం తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు, ఆలయ అధికారులు, అర్చకులు డిసైడ్ చేసేసారు. 

కోట్లాది మంది హిందూ భక్తుల ఇలవేల్పు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు, తిరుమల శ్రీనివాసుని తిరుమల తిరుపతి ట్రస్ట్

బోర్డు సీనియర్ సిటిజన్ గా డిసైడ్ చేసిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. 

శ్రీనివాసుని వయసు ఎంతో తెలుసుకోవడం బ్రహ్మాది దేవతలకే సాధ్యం కాలేదు. అయితే టిటిడి వాళ్ళు ఇట్టే కనిపెట్టేసారు. 

భారత కేంద్ర ప్రభుత్వం కరోనా కష్టకాలం లో ఇచ్చిన నిబంధనల ప్రకారం 60 ఏళ్ళు వయసు దాటినా వృద్దులు ఇంటి నుంచి బయటకు

రాకూడదు. 

ఇదే నిబంధనను తిరుమల ట్రస్ట్ బోర్డు, అధికారులు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వరునికి చాలా పటిష్టంగా అమలు చేస్తున్నారు. 

ప్రస్తుతం జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం జరగవలసిన వాహన సేవలను సైతం తిరుమల మహాద్వారం నుంచి బయటకు తీసుకు రావడం లేదు.

అత్యంత ఏకాంతం లోనే జరుపుతున్నాం అంటూ ప్రకటించిన టిటిడి, స్వామిని అంతరాలయం నుంచి ధ్వజస్తంభం వరకూ తీసుకువచ్చి, అక్కడే, ఆరాధనలు చేసి, అక్కడి నుంచి లోపలి తీసుకు వెళ్తున్నారు. ఇప్పడికే మూడు రోజుల పాటు వాహన సేవలు గడిచిపోయాయి. 

కోవిడ్ కారణంగా భక్తులకు అనుమతి లేదు అని ప్రకటించారు. భక్తులు లేకపోతె తిరుమల నాలుగు

మాడా వీధులన్నీ ఖాళీగానే ఉంటాయి. ఎవరూ లేనప్పుడు స్వామి వాహనాలను వీధుల్లో తిప్పడానికి వీళ్ళకి వచ్చిన ఇబ్బందేంటో తెలియని స్థితి. పైగా ఇంతవరకూ స్వామి వారి వాహనాలను మాడా వీధుల్లో తిరువీధి వేడుక చెయ్యకుండా ఉత్సవాలు జరపడం ఇదే ప్రధమం. ప్రస్తుత పాలనలో అన్నీ విచిత్రలే జరుగుతున్నాయి. 

కోవిడ్ నిబంధనల పేరుతొ

స్వామిని వీళ్ళు మహాద్వారం లోపలే ఉంచడం చూస్తే. . . శ్రీనివాసుని వీళ్ళు సీనియర్ సిటిజన్ గా పరిగణించి ఇంట్లోనే కూర్చోబెట్టారు అనిపిస్తోంది. 

అయితే ఈ కార్యక్రమాలు పర్యవేక్షయించే వారు మాత్రం 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉండడం గమనార్హం. వీళ్ళకి కరోనా నిబంధనలు వర్తించడం లేదు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam