DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డిఎస్పీ లతో ఏలూరు డిఐజి మోహన్ రావు వీడియో లో భేటీ

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 22, 2020 (డి ఎన్ ఎస్ ):* ఏలూరు రేంజ్ డిఐజి కె.వి.మోహన్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా డిస్పిలతో వీడియో ద్వారా భేటీ అయ్యారు. డి ఎస్పీలు  ఏలీయా సాగర్, సి.సి.యస్ వి. భీమా రావు,  రాజమహింద్ర వరము డిఎస్పీ ఏ.టి.వి

రవి కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా    జంగారెడ్డిగూడెం డిఎస్పీ ఎం.స్నేహిత  లతో పలు కేసులపై చర్చించారు. 
ఈ జిల్లాల పరిధిలో ఇప్పటివరకు నమోదు అయిన మరియు విచారణలో ఉన్న కేసులను గురించి, సదరు కేసులలో దర్యాప్తు గురించి, దర్యాప్తు సమయంలో అధికారులు కేసు లను ఏ విధముగా దర్యాప్తు  చేసినారు వాటి యొక్క వివరముు లను వీడియో

కాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకొని వివరాలను పరిశీలించి నారు. సదరు కేసులలో ముద్దాయిల యొక్క అరెస్ట్ లను గురించి, దర్యాప్తు  అనంతరం చార్జిషీట్ లను కోర్టు లో ఫైల్ చేసే విషయాలపైన అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఇంకా  దర్యాప్తు లో ఉన్న కేసులలో త్వరితగతిన దర్యాప్తును పూర్తి చేయుట కొరకు

తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు అధికారులకు  ఇచ్చారు. కేసులలో కోర్టులో విచారణలో ఉన్నటువంటి కేసులలో ముద్దాయిలు యొక్క హాజరు సక్రమంగా జరుగుతుంది లేనిది అనే విషయం పైన అధికారుల వద్ద నుండి వివరములు డిఐజి అడిగి తెలుసుకున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam