DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంత్రి జయరాంపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన టీడీపీ 

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 22, 2020 (డి ఎన్ ఎస్ ):* ఈఎస్‌ఐ స్కామ్‌లో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ అలాగే అతడి తనయుడు గుమ్మనూరు ఈశ్వర్‌ ప్రమేయం ఉందని వారిపై తగు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ నేతలు స్థానిక మోరంపూడి సమీపంలోని

ఏబీసీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎంప్లాయీస్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌లో జరిగిన కుంభకోణాన్ని ఫిర్యాదులో వివరించారు. అధికార వై.ఎస్‌.ఆర్‌.సి.పి రాజకీయకక్ష సాధింపుతో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడిపై ఉద్దేశపూర్వకంగా ఈఎస్‌ఐ స్కామ్‌లోకి లాగారని, నిజానికి,

ఆంధ్రప్రదేశ్‌ లేబర్‌, ఎంప్లాయ్‌మెంట్‌, ట్రైనింగ్‌ అండ్‌ ఫ్యాక్టరీస్‌ శాఖా మంత్రి గుమ్మనూరు జయరామ్‌, ఆయన తనయుడు ఈశ్వర్‌లు ఈ కుంభకోణంలో పాత్రదారులని పేర్కొన్నారు. ఈ.ఎస్‌.ఐ కుంభకోణంలో 14వ నింధితుడైన విజయవాడలో తిరుమల మెడికల్‌ ఏజెన్సీ నడుపుతున్న తెలుకపల్లి భరణి కుమారుడైన తెలుకపల్లి కార్తిక్‌

డిసెంబర్‌, 12. 2019 న మంత్రి కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్‌ కు పుట్టిన రోజు కానుకగా కోటి రూపాయలు విలువ చేసే మెర్సిడెస్‌ బెంజ్‌ కారును బహూకరించాలని ఫిర్యాదులో వివరించారు. ఈ తరుణంలో యాంటీ కరెప్షన్‌ బ్యూరో (ఏసీబీ) జూన్‌ 10, 2020 న తెలుకపల్లి కార్తిక్‌ పై ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయడం జరిగిందని, నిందితుడైన తెలుకపల్లి కార్తిక్‌

తనపై నమోదు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌ ను రద్దు చేయమని విన్నవిస్తూ హైకోర్టును జూన్‌ 10, 2020 న ఆశ్రయించడం జరిగిందని, కార్తిక్‌ తనకు తానుగా ఈ.ఎస్‌.ఐ డైరక్టర్‌ను కలిసి తప్పుడు కొటేషన్స్‌ సమర్పించడన్న విషయం నిర్ధారించబడిందని, దీన్నిబట్టి, తెలుకపల్లి భరణి కుమారుడైన తెలుకపల్లి కార్తిక్‌ మంత్రి గుమ్మనూరు జయరామ్‌, ఆయన

తనయుడు గుమ్మనూరు ఈశ్వర్‌లకు బినామీగా వ్వవహరించారని స్పష్టంగా తెలుస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ.ఎస్‌.ఐ కుంభకోణం ద్వారా బినామీ అయిన తెలుకపల్లి కార్తిక్‌, మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన తనయుడు గుమ్మనూరు ఈశ్వర్‌లు లబ్దిపొందారని వివరించారు. అధికార వై.ఎస్‌.ఆర్‌.సి.పి రాజకీయ కక్షసాధింపులో భాగంగా మంత్రి

గుమ్మనూరు జయరాం ఈ.ఎస్‌.ఐ లో మోసపూరిత నగదు లావాదేవీలకు పాల్పడటమే కాకుండా మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడిని ఉద్దేశపూర్వకంగా స్కామ్‌లో ఇరికించారని పేర్కొన్నారు. కావున, ప్రజా ధనాన్ని కాజేయాలని ప్రయత్నించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిన మంత్రి గుమ్మనూరు జయరామ్‌, ఆయన తనయుడు ఈశ్వర్‌

 లపై ఏసీబీ కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరరావు, ఉమా మార్కండేయస్వామి ఆలయం ఛైర్మన్‌ మజ్జి రాంబాబు, మాజీ కార్పొరేటర్‌ కడలి రామకృష్ణ, నగర తెలుగు యువత అధ్యక్షులు నక్కా దేవీవరప్రసాద్‌, 11వ డివిజన్‌ టీడీపీ

ప్రెసిడెంట్‌ కంటిపూడి రాజేంద్రప్రసాద్‌, హితకారిణి సమాజం డైరెక్టర్‌ కడితి జోగారావు, ఊర్లంక లోకేష్,  నాగబాబు, తేజా ఏసీబీకి ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam