DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విస్తృత స్థాయిలో సచివాలయ సేవలు: తూగో కలెక్టర్ 

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 22, 2020 (డి ఎన్ ఎస్ ):* ప్రజలు నమ్మలేని స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాల సేవలు ప్రజలకు చేరువు అవుతున్నాయని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి అన్నారు. జిల్లాలోని రాజానగరం మండల కేంద్రమైన రాజానగరంలోని తహాసీల్దార్‌ కార్యాలయంలో మండల

లెవిల్‌ విఆర్‌ఒల శిక్షణా కార్యక్రమంలో రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న విఆర్‌ఒలంతా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దృష్టి సారించాలని అన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ విఆర్‌ఒలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభం కాలేదని, మన జిల్లాలో

ముఖ్యంగా రాజమహేంద్రవరం డివిజన్‌లో శిక్షణ పూర్తి చేసుకోవడం అభినందనీయమని అన్నారు. ఇందుకు ప్రత్యేక దృష్టి సారించిన సబ్‌ కలెక్టర్‌ను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని అన్నారు. ముఖ్యంగా రైతు కార్డులు,

ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు, ఫించన్లు వంటి సేవలు గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలు నిర్ణీత సమయంలో అందుకోగల్గుతున్నారని అన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో కొత్తగా నియమితులైన విఆర్‌ఒలకు శిక్షణ ఇవ్వలేకపోయామని, అయితే రాజమహేంద్రవరం డివిజన్‌లో నూతనంగా నియమితులైన విఆర్‌ఒలకు శిక్షణ పూర్తి చేయడం జరిగిందన్నారు. శిక్షణా

ప్రక్రియ రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ప్రారంభం కాలేదని, మన జిల్లాలోనే ప్రారంభం అవుతుందన్నారు. కొవిడ్‌ ఒక ఫీక్‌ లెవిల్‌కు వెళ్ళిన తరువాత విపరీతంగా పెరిగిందని, ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రతీ రోజు ఈ నెల పదో తేదీ నాటికి ఫీక్‌ టైంలో ఉన్నామని, ప్రస్తుతానికి 16 శాతం తగ్గిందన్నారు. ప్రతీ

రోజు 1.5 శాతం తగ్గుతుందని అన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ రిక్వేర్‌మెంట్‌ అవసరం లేకుండా పోయిందని, ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్‌ సెంటర్లను రద్దు చేస్తున్నామని తెలిపారు. మందుల కొరత అనేది సమస్య లేదని, హోమ్ ఐసోలేషన్‌ ఉన్న వారి కోసమే లక్ష కిట్లు సిద్ధం చేసి ఉంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌

జి.బాలసుభ్రహ్మణ్యం, ఎంపీడీఒ ఎన్‌వివిఎస్‌ మూర్తి, సిడిపిఒ నాగమణి, తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam