DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ కుటుంబంతో కలిసి గుళ్లకు ఎందుకు వెళ్లడం లేదు?: నాని 

*ప్రధానిపై మంత్రి కొడాలి నాని మరో వివాదాస్పద వ్యాఖ్యలు*

*సన్యాసులు గుళ్లకు రావడం లేదా? వాళ్ళు ఏ కుటుంబంతో వస్తారు?* 
 
కొడాలి నాని ని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చెయ్యాలి: హిందూ సమాజం*

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 23, 2020 (డి ఎన్ ఎస్ ):* ఇటీవల కాలం లో వివాదాస్పద

వ్యాఖ్యలకు నిలయంగాను, మారుపేరుగాను మరీనా మంత్రి కొడాలి నాని భారత ప్రధాని నరేంద్ర మోడీ పైన, సన్యాసులపైనా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. 
తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని, వైఎస్ జగన్ ఇవ్వాలని ఖరాఖండీగా చెప్పి, తిరుమల ఆలయ నిబంధనలకు సవాల్ విసిరినా విషయం

తెలిసిందే. 
బీజేపీ క్రింద స్థాయి నాయకుల వైఖరి వల్ల మోదీ గారిని బజారున పడేస్తున్నారన్నారు. ముందు నరేంద్ర మోడీ ని సతీసమేతంగా ఆలయాలకు రమ్మని చెప్పండన్న సవాల్ విసిరారు. దీనితో పాటు యోగి ఆదిత్యానాద్, ఇతర సన్యాసులు పీఠాధిపతులు గుళ్లకు వెళ్లడం లేదా, వాళ్ళు ఏ కుటుంబంతో వెళ్తున్నారు అని ప్రశ్నించారు. 

తనను

బర్తరఫ్ చేయాలన్న బీజేపీ డిమాండ్‍పై స్పందించిన కొడాలి నాని పదిమందిని వెంటబెట్టుకుని అమిత్‍షాను తొలగించాలంటే తొలగిస్తారా? అని ప్రశ్నించారు. 

కొడాలి నాని తిరుమలలో ప్రధాని మోడీ పైనా, సన్యాసులపైనా చేసిన వ్యాఖ్యలపై  హిందూ సమాజం మరోసారి భగ్గుమంటోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, హిందూ సమాజాన్ని,

సంప్రదాయాలను కించపరుస్తున్న మంత్రి కొడాలి నాని ని తక్షణం మంత్రి పదవీ నుంచి భర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam