DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే సహాయమంత్రి కోవిడ్ కారణంగా అంగడి మృతి 

*సరిగ్గా ఏడాది క్రితం విశాఖ లో పర్యటించారు.*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 23, 2020 (డి ఎన్ ఎస్):* కోవిడ్ మహమ్మారి ఎందరినో బలి తీసుకుంటోంది. భారత కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి ఈ వైరస్ సోకి సురేష్ అంగాడి 
బుధవారం మృతి చెందారు. చాలామందికి ఈ వైరస్ సోకినప్పడికి వ్యాధి

నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు కోలుకుంటున్నారు. అయితే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు సైతం కొంత వరకూ కోలుకోవడం జరుగుతోంది. అయితే ఈ నెల 11న కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ  బుధవారం మరణించినట్టు తెలుస్తోంది. 
సురేష్ అంగడి కర్ణాటకలోని బెళగావి పార్లమెంట్ నియోజకవర్గం నుండి

ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాలుగు సార్లు ఎంపీగా గా గెలిచిన సురేష్ అంగాడి మంచి వక్తగా పేరు సంపాదించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానులని సైతం పొందగలిగారు. 

ఉదయ్ ఎక్స్ ప్రెస్ ప్రారంభంలో. .. 

విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న ఉదయ్ ఎక్స్ ప్రెస్  డబుల్ డెక్కర్ ఏసీ రైలు ను

ప్రారంభించేందుకు సురేష్ అంగడి 27 సెప్టెంబర్ 2019 నాడు విశాఖపట్నం విచ్చేసారు. విశాఖ రైల్వే స్టేషన్ పరిసరాలన్నీ కలియ తిరిగి సిబ్బంది నిర్వహణను మెచ్చుకున్నారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ గా విశాఖపట్నం మొదటి స్థానంలో ఉండడంతో ప్రత్యక్షంగా చూసేందుకే తానూ విశాఖ వచ్చినట్టు సభలో ప్రకటించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam