DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆధార్ అనధికారిక సవరణలపై నెట్ నిర్వాహకుడు అరెస్ట్ 

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 24, 2020 (డి ఎన్ ఎస్ ):* ప్రభుత్వ వివిధ పథకాలకు వయస్సు అర్హత ప్రకటించడంతో అర్హత లేకపోయినా అక్రమమార్గంలో ఆ పథకాలను పొందడానికి ఆధార్‌కార్డు , పాన్‌కార్డుల పై ఉన్న పుట్టిన తేదీలను మార్పు చేస్తున్న ఒక ఆన్లైన్ కంప్యూటర్ సెంటర్ నిర్వాహకుడి పై రెండో పట్టణ

పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని గురువారం సాయంత్రం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు సంబంధిత వివరాల్లోకి వెళితే  . ఏలూరు పవర్ పేటలో ప్రాంతంలో మదిన  ఆన్లైన్ సర్వీస్ సెంటర్‌ను సిరాజ్ బేగ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు . రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు వయస్సు నిర్ధారించడంతో ఆ పథకాలు పొందడానికి వయస్సును

ఆధార్‌కార్డు , పాన్ కార్డు లలో  మార్పు చేస్తానని పలువురి వద్ద డబ్బులు తీసుకుని మార్పు చేస్తూ అక్రమమార్గంలో ఆధార్‌కార్డు , పాన్‌కార్డులను తయారు చేస్తున్నాడు . ఈ విషయం గత కొన్ని రోజులుగా జరుగుతుంది. అతని వద్ద మార్పులు చేయించుకుని దరఖాస్తులు చేసుకున్న పలువురు ధరఖాస్తులు మండల -పరిషత్ కార్యాలయానికి చేరుకున్నాయి

. వాటిని ఎంపీడీవో బి.రాజ్ మనోజ్ పరిశీలించడంతో అవి నకిలీవిగా గుర్తించారు .ఆయన విజిలెన్స్ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు దీనిపై స్పందించిన  విజిలెన్స్ సీఐ వారి సిబ్బంది కలిసి ఆన్లైన్ సెంటర్‌కు వెళ్ళి అక్కడ పత్రాలను పరిశీలించారు అతను పత్రాలలో నకిలీ పత్రాలు తయారు చేస్తున్నట్లు వారి గురించి రెండో పట్టణ

పోలీసులకు ఫిర్యాదు చేశారు  దానిపై ఏలూరు టూటౌన్ సీఐ బోణం ఆది ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు లో  భాగముగా ఆ సర్వీస్ సెంటర్లో ఉన్న హార్డ్ డిస్క్ నున స్వాధీనం చేసుకుని ఎంత మందికి ఈ విధంగా పుట్టిన తేదీ , పేర్లను మార్పుచేశాడో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని గుర్తిం

చినట్లు . ఈ కేసులో ప్రధాన నిందితుడు సిరాజ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ముద్దాయి నీ  గురువారం సాయంత్రం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా గౌరవ న్యాయమూర్తి గారు ముద్దాయి కి  14 రోజుల రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా సిఐ ఆది ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల కే కాదు, ఏ పథకాలు కైనా నకిలీ పత్రాలను వినియోగించరాదని

వినియోగించి లబ్ధి పొందిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఎవరిని నమ్మి నకిలీ పత్రాలపై తీసుకోవద్దని ఆయన నగర ప్రజలకు సూచించారు ఎవరైనా ఇటువంటి నకిలీ పత్రాలు తయారు చేసి ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని, వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని ఇన్స్పెక్టర్  గారు ఈ సందర్భంగా తెలియ చేసినారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam