DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహామహోపాధ్యాయుని వీణ. .మ్రోగింది ప్రతీ హృదయంలోన..

*ఇంటర్వ్యూ కోసం వెళితే..ఇంటి విషయాలు. .ఆనాటి. మధురక్షణాలు.* 

*మహోన్నతనునితో గంట సమయం : DNS బృందం. . .*   

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 25, 2020 (డి ఎన్ ఎస్):* సినీ సంగీత సామ్రాజ్యంలో అలుపెరుగని సంగీత చక్రవర్తి మీటిన వీణ. . . ప్రతి హృదయంలోనూ అజరామరంగా నిలిచిపోయింది. ఆ

మహామహోపాధ్యాయుని కలిసిన క్షణం ఒక్కసారి. . .  విశాఖ వేదికగా జరిగిన నంది నాటకోత్సవాల పురస్కారాల వేడుకలకు విశాఖ వచ్చిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం తో. . గడిపిన మధుర క్షణాలు. .. మాకోసం గంట ఆలస్యంగా. . .కార్యక్రమానికి. . .

వ్యక్తిగతంగా. . .ఆత్మీయ క్షణాలు : . . .

ప్రపంచ ప్రఖ్యాత సంగీత కళానిధిని

కలిసేందుకు మా బృందం హోటల్ గ్రీన్ పార్కు కు వెళ్లి రిసెప్షన్ నుంచి ఎస్పీ బసకు ఫోన్ చేస్తే. . .నేరుగా ఆయనే రిసీవ్ చేసుకుని, శ్రమ అనుకోకుండా సాయంత్రం 4 గంటలకు కలుద్దామా అని రిక్వెస్ట్ చేయడంతోనే. . ఆయన వ్యక్తిత్వం ప్రస్ఫుటం అయ్యింది. సమయం సరిగ్గా 4 గంటలకు మేము తిరిగి హోటల్ కు చేరుకోగానే. . గది తలుపు తీసి నేరుగా వారే స్వాగతం

పలకడంతో మరోసారి షాక్. 
  సుమారు ఒక గంట సమయం మరో ప్రపంచంలోకి వెళ్లిన సందర్భం నేటికీ కళ్ళముందు కనపడుతోంది. ఇంటర్వ్యూ సంగతి తర్వాత కాసేపు ప్రక్కనపెట్టి, సాధారణ విషయాలు మాట్లాడుకుందాం అంటూ. . . ఎన్నో అంశాలు, దేశ విదేశాల్లో ఉంటె సంప్రదాయాలు, తెలుగు, విదేశీ భాషల్లో ఉండే వైవిద్యం ఒక్కొక్క విషయం తెలియచేస్తూ ఉంటె. .

కార్యక్రమానికి టైం అయ్యిందంటూ . . కార్యదర్శి చెప్పగానే. . కలవడానికి బంధువులు వచ్చారు. . . ఒక గంట లేటు గా వస్తామని చెప్పమనడం మరింత ఆనందం కల్గించింది. కుటుంబ విషయాలు, ఆధ్యాత్మిక అంశాలు, సంప్రదాయ విలువలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఒక సెలెబ్రిటీ ని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్లిన మాకు ఒక కుటుంబ బంధువుని కలిసి వచ్చామన్న ఆనందం

నేటికీ మిగిల్చేసారు. విద్యార్థులు విద్య పట్ల ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యవద్దని, ఇతర అంశాల్లో ప్రావీణ్యం తో పాటు విద్య కూడా ప్రస్తుత సమాజంలో చాలా అవసరం అని ఎంతో విలువైన సందేశాన్ని ఇచ్చారు. ఆఖరులో ఆయన ఇంజనీరింగ్ విద్య మధ్యలో బ్రేక్ రావడం పట్ల కొంత భాద ఉండేది అని అయితే, తన కెరీర్ లో విరామం లేకపోవడం కూడా ఒక కారణం

కావచ్చన్నారు. 
అసాధారణ వ్యక్తి అయినా. . అత్యంత సామాన్యునిగానే. . అందరితో కలిసి ఉండడం DNS బృందం ప్రత్యక్షం గా అనుభవించింది. 

ఒక మహామహోపాధ్యాయులైన సంగీత సరస్వతి మానవ రూపం ధరించి వస్తే. .  కళ్ళముందు కనిపించే రూపమే ఎస్ పి బి. 

సంగీత కళానిధి కి సాదర ప్రణామం : . . బీజేపీ నేత కెవివివి 

40 వేలకు

పైగా పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగీత మహోన్నతుని విద్వత్ కు, సమాజం పట్ల నెరవేర్చిన ధర్మానికి సాదర ప్రణామం చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కెవివివి సత్యనారాయణ తెలియచేసారు. కళ్ళు మూసుకుంటే చెవులకు వీనుల విందు చేసే మధుర స్వరం చిరస్మరణీయం అన్నారు. వేలాది మంది వర్ధమాన తరానికి

మార్గదర్శకునిగా రాజబాట వేయడం అద్వితీయం అన్నారు. 

స్వామికి లెక్కలు అప్పగించేందుకేనా:  పి. రాజా, Addl Gen Secy, ఏపిజెయు 

తనకు అప్పగించిన భాద్యతలను నెరవేర్చి, లెక్కలు అప్పగించేందుకేనా సంగీత మహోన్నతుని మహాభినిష్క్రమణం జరిగిందా అనే సందేహం కలుగుతోందని, ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ అదనపు ప్రధాన

కార్యదర్శి పెంటపాటి రాజా అభిప్రాయపడ్డారు. వేలాది మందికి మార్గదర్శకం చేసి, లక్షలాది మంది అభిమానులని సంపాదించుకుని మానవత్వాన్ని సార్ధకత్వం చేకూర్చిన మహనీయులు ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam