DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీస్ లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: హోమ్ మంత్రి

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 25, 2020 (డిఎన్ఎస్):*  పోలీస్ లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని రాష్ట్ర హోంశాఖామాత్యులు మేకతోటి సుచరిత సూచించారు. పోలీస్ శాఖలోఉద్యోగం చేయాలన్న లక్ష్యంతో దీక్ష, పట్టుదలతో శిక్షణ కాలం పూర్తి చేసుకున్న 273 మంది ప్రొబేషనరీ ఎస్సైలకు రాష్ట్ర

హోంశాఖామాత్యులు మేకతోటి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు. రికి సేవ లందించడంలో ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో, మహిళల రక్షణ అంశంలో ఒక అడుగు ముందుండాలన్నారు. కష్టం వచ్చిందని పోలీస్ స్టేషన్ గడప తొక్కే ప్రతీ మహిళకు న్యాయం జరగాలన్నారు. అప్పుడే మరింత రాష్ట్రం సురక్షితంగా ఉంటుందన్నారు.

నేరాలను అరికట్టేందుకు యువత

ఆలోచనలు, సృజనాత్మకత జోడింపుతో ఆధునిక టెక్నాలజీ ని వినియోగించుకోవాలన్నారు.  పోలీసు వృత్తిని ఉద్యోగంలా భావించకుండా, ప్రజలకు సేవ చేయడానికి దేవుడు ఇచ్చిన  గొప్పఅవకాశంగా భావించాలన్నారు.
పారదర్శకం గా అవినీతి రహితంగా సేవలు అందించండన్నారు.

ఫ్రెండ్లీ పోలీస్ గా వ్యవహరించండి : .  .

1861 ఐపీసీ ఆక్ట్

ప్రకారం. సంవత్సరం లో ప్రారంభమైన పోలీస్ శాఖ సమకాలీన మార్పులకు అనుగుణంగా ప్రజలకు సేవచేయడంలో ముందుందన్నారు.  పోలీస్ శాఖలో అన్ని స్థాయిల్లో యువ రక్తాన్ని  నింపుతున్నారు. ఈ ఏడాది  5  మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్రానికి కేటాయింపు జరిగిందన్నారు. 25 డిఎస్పీలు శిక్షణ పూర్తి చేసుకున్నారన్నారు. 
 273 ఎస్సై లు

క్షేత్ర స్థాయిలో సేవల కు సిద్ధంగా ఉన్నారన్నారు. 1591 మంది constables శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరారు.   గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త నీటితో నింపుతున్నాం. గ్రామస్థాయి లో  ప్రతి ఇంటికి పోలీస్ సేవలు అందించడం  ప్రభుత్వం లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వములో ప్రతి గ్రామానికి మహిళా పోలీస్ సంరక్షణ అధికారులను

నియమించామన్నారు. దేశంలోనే తొలిసారిగా ap పోలీస్ సేవా యాప్ ను  అన్ని పోలీస్ స్టేషన్లకు అనుసంధానిస్తూ, 87 రకాల సేవలు  అందించడం జరుగుతోందన్నారు.

మహిళలకు రక్షణ కోసం ప్రవేశపెట్టిన   దిశ యాప్ను  11 లక్షలమంది డౌన్ లోడ్ చేసుకున్నారని, అమరావతి, తిరుపతి, వైజాగ్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం

అన్నారు.  భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతాం అని, స్పందన కార్యక్రమంలో 87 వేల పైగా సమస్యలు రాగా 80 శాతం పరిష్కరించాం అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam