DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసులు ప్రజల పట్ల గౌరవంగా వ్యవహరించాలి 

*నూతన ఎసై లకు ఏలూరు డిఐజి మోహన్ రావు హితవు.* 

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 26, 2020 (డి ఎన్ ఎస్ ):* అనంతపురం ట్రైనింగ్ కాలేజీ లో తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకుని 50 మంది ట్రైనింగ్ ఎస్ఐ లు, అర్.ఎస్. ఐ లు ఏలూరు డిఐజి కెవి మోహన్ రావు కు శనివారం రిపోర్ట్ చేసారు. వీరిలో 31 మంది

ట్రైనింగ్ ఎస్ఐ లు 19 మంది అర్.ఎస్. ఐ లు ( ఒక మహిళా అర్.ఎస్. ఐ)  విజయవాడ సిటీ, కృష్ణాజిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ మరియు తూర్పు గోదావరి జిల్లాలకు కేటాయించారు. వీరితో ఏలూరు రేంజ్ డీఐజీ కె.వి. మోహన్ రావు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ్ నాయక్, సమావేశం ఏర్పాటు చేసారు. డిఐజి మాట్లాడుతూ పోలీసులు

ఉన్నది ప్రజల యొక్క ధన మాన ప్రాణ రక్షణ కొరకు అని ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. ప్రజల్లో పోలీసుల పట్ల విశ్వాసం పెంపొందించండి అని డి. ఐ.జి గారు తెలియపరచి నారు. ప్రతి ఒక్కరు  మహిళలు, చిన్నారులు, సామాన్య ప్రజలకు భరోసాగా నిలవండి అవినీతిరహిత పోలీసింగ్ ఉండాలి అని.ఏ ఒక్కరు చిన్న తప్పు చేసినా వ్యవస్థపై ప్రభావం

చూపుతుందని గుర్తుంచుకోవాలన్నారు. 

పోలీసు స్టేషన్లకు వచ్చే బాధిత వ్యక్తులతో మర్యాదగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డిజిపి డి.గౌతం సవాంగ్ ల ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కష్టించి పని చేయాలని తెలిపారు. 

ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని ఉమెన్, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇయర్ గా

ప్రకటించిందని. ఇదే స్ఫూర్తితో పారదర్శకంగా, నిజాయితీతో కూడిన సేవలు అందించి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ్ నాయక్ మాట్లాడుతూ చట్టాల పట్ల అవగాహన పెంచుకుని ప్రజలకు నిష్పక్షపాతంగా న్యాయాన్ని అమలు చేయాలని, భయ పక్షపాత లు లేకుండగా విధులు నిర్వహించాలని

తెలియజేసినారు

ఈ కార్యక్రమంలో అనంతపురం ట్రైనింగ్ సెంటర్ నందు శిక్షణ పూర్తి చేసుకుని విజయవాడ సిటీ, కృష్ణాజిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ మరియు తూర్పు గోదావరి జిల్లా లకు నియమింపబడిన ఎస్ఐ లు మరియు అర్.ఎస్. ఐ లు హాజరైనారు
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam