DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ ఏఎన్‌ఎంలు

*కోటిన్నర కుటుంబాలకు పూర్తి హెల్త్‌ స్క్రీనింగ్‌*

*ఇప్పడికే వాలంటీర్లకు ద్వారా ప్రతి ఇంటికీ సమాచారం. .*

*ప్రజల రక్షణే కర్తవ్యం: ఆరోగ్య శాఖా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి* 

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 28, 2020 (డి ఎన్ ఎస్ ):* ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రజల

ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.  
రాష్ట్రవ్యాప్తంగా  పౌరుల ఆరోగ్య వివరాలను సేకరించి ఇంటి వద్దే ఉచితంగా వైద్యం అందించే సదుపాయం దేశంలో తొలిసారిగా ఏపీలో నేడు మొదలయ్యిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య ప్రత్యేక  కార్యదర్శి డా.కె.ఎస్

జవహర్ రెడ్డి ఈ ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు.
 రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది ఏఎన్‌ఎంలు  నేటి నుంచి 1.48 కోట్ల కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారి  ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి సుమారు 5.34 కోట్ల మంది ప్రజల వివరాలను నమోదు చేయనున్నారు. 
     ప్రమాదకరంగా పరిగణించే ఏడు రకాల జబ్బులను గుర్తించడంతోపాటు వైద్య సదుపాయం

అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా డేటాను నమోదు చేస్తారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆరోగ్య రంగాన్ని సంస్కరించి ప్రజల ఆరోగ్య వివరాలన్నీ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరచాలని ఇప్పటికే

నిర్ణయించడం జరిగింది.  
   నెలలో పూర్తయ్యేలా ఈ  ప్రణాళికను రూపొందించడం ద్వారా  ఒక్కో ఏఎన్‌ఎంకు 500 నుంచి 800 ఇళ్ల వరకు కేటాయించటము జరిగింది. వారు రోజుకు 25 నుంచి 30 ఇళ్లలో స్క్రీనింగ్‌ చేపట్టి నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంది.ఈ ఏఎన్‌ఎంలకు 40వేల మంది ఆశా కార్యకర్తలు సాయం అందిస్తారని తెలిపారు.

స్క్రీనింగ్‌ ద్వారా సేకరించే ఆరోగ్య వివరాలు ఎన్‌సీడీ అండ్‌ ఏఎంబీ యాప్‌లో నమోదవుతాయి. అక్కడ నుంచి సెంట్రల్‌ పోర్టల్‌కు అనుసంధానం అవుతాయి. 
   స్క్రీనింగ్‌ పరీక్షల కోసం ప్రజలను విభాగాలుగా విభజించిన ఈ పధకంలో ఆరేళ్ల లోపు 
చిన్నారులు, 6 – 20 ఏళ్ల లోపువారు, 20 – 60 ఏళ్ల వయసు లోపు వారు, 60 ఏళ్లు దాటిన వారు

అనే నాల్గు విభాగాలుగా వర్గీకరించటము జరిగిందన్నారు.
ఆరోగ్య వివరాల సేకరణకు 9 నుంచి 53 ప్రశ్నలు రూపొందించగా,రెండో దశలో ట్రీట్‌మెంట్‌ ,తొలుత 5.34 కోట్ల ప్రజల ఆరోగ్యాన్ని స్క్రీనింగ్‌చేసి ఎవరికి ఎలాంటి జబ్బులు, లక్షణాలున్నాయో గుర్తిస్తారు. ఎలాంటి చికిత్స అవసరమో సూచిస్తారు. పెద్ద జబ్బులైతే నేరుగా ఆరోగ్యశ్రీ

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పంపిస్తారు. ఏఎన్‌ఎంలు సేకరించే హెల్త్‌ డేటాను ఆరోగ్యశ్రీ కార్డుల్లో నిక్షిప్తం చేసి పౌరుల ఆరోగ్య వివరాలను భద్రపరుస్తారు. సత్వరమే మెరుగైన వైద్యం అందేలా ఇది ఉపకరిస్తుంది   
    ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి ప్రధానంగా ఏడు రకాల జబ్బులను గుర్తించి పరీక్షలు నిర్వహించి వైద్య

సదుపాయం అందేలా చర్యలు చేపడతారు. 

వీటిలో మధుమేహం, హైపర్‌ టెన్షన్‌  లెప్రసీ (కుష్టువ్యాధి) లక్షణాలు,  క్షయ ప్రాథమిక లక్షణాలు  నోరు, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్లు లాంటివి చిన్నారులు, మహిళల్లో రక్తహీనత, చిన్నారుల్లో వినికిడి లోపం, ఇతరత్రా పుట్టుకతో వచ్చే జబ్బులను గుర్తించి చికిత్స అందేలా చర్యలు

తీసుకోవటం జరుగుతుందని జవహర్ రెడ్డి తెలిపారు.

సామాన్యులకు మరింత చేరువలో వైద్యం: . ..  

‘చాలామందికి జీవనశైలి జబ్బులు ఉన్నట్లు కూడా తెలియదు. అలాంటి వారందరి కోసం ఇంటివద్దకే వెళ్లి పరీక్షలు నిర్వహించి వైద్యం అందించే కార్యక్రమం దేశంలో మొదటి సారి మన రాష్ట్రంలోనే మొదలవు తోంది. ఇది సామాన్యులకు

వైద్యాన్ని మరింత చేరువ చేస్తుందని డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, ఆ ప్రకటనలో వివరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam