DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎయు పరువు తీస్తున్న గైడ్ లు, ఆడకత్తెర లో పోకచెక్కలా విద్యార్థులు

అక్రమాలకూ అడ్డుకట్ట లేదా?

విశాఖపట్నం, జులై 16, 2018 (DNS Online) : అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో జరుగుతున్న వివిధ విభాగాల తీరు దీని తొంభై ఏళ్ళ

పరువును బంగాళాఖాతం లో కలిపేస్తోంది. ప్రధానంగా స్నాతకోత్తర పట్టా / పరిశోధనలు కు ఇచ్చే పిహెచ్ డి పట్టాల విలువ పూర్తిగా మంట కలిపేస్తున్నారు. గతంలో ఎయు లో పట్టా

తీసుకోవాలంటే పూర్వజన్మ సుకృతం గా భావించేవారు. అయితే ప్రస్తుతం అధ్యాపకులు వెలగబెడుతున్న తీరుకు ఖర్మ కాలితే ఎయు లో పట్టా తీసుకోవాలి అని

అనిపించేస్తున్నారు. దేవాలయం లా ఉన్న ఏ యూ ను గంగ పాలు చెయ్యడంలో ఎవరి పాత్ర ఎంతుందో ప్రస్ఫుటంగా ప్రకటింప చేయడానికి పోటీ కూడా పడుతున్నారంటే ప్రస్తుతం ఏ స్థాయి

కి చేరుకుందో ఊహించవచ్చు.

అయిన వారికి అడ్డదారిలోనే..

పీహెచ్ డి లో ప్రవేశం పొందాలి అంటే గతం లో నానా ప్రయాస పడాల్సి వచ్చేది. ఇప్పుడు పలుకుబడి, టీచర్లకు

సన్నిహితంగా చనువు ఉంటే చాలు, ప్రవేశం ఏమి ఖర్మ, ఏకంగా పట్టా యే వచ్చేస్తుంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. నామ మాత్రంగా పరీక్షకు హాజరైతే చాలు, ఇక సీటు వచ్చినట్టే

మరి. పార్ట్ టైం పిహెచ్ డి లకు లోటే లేదు. అయితే కొందరు దీన్ని అలుసుగా తీసుకుని చేస్తున్న వ్యవహారం చాలా సార్లు వివాదంగా మారుతున్నా పట్టింపే ఉండడం లేదన్నది

వాస్తవం.

గవర్నర్ కి ఫిర్యాదు వరకూ...

ఎయు లో జరుగుతున్నా కొన్ని ఘటనల పై సాక్షాత్తు గవర్నర్ కే ఫిర్యాదు వెళ్లిన ఘటనలూ ఏయూ లోనే ఉన్నాయి. కామర్స్ విభాగం లో

జరిగిన ఘటనలపై గవర్నర్ ఒక కమిటీని సైతం వేసిన ఘటనలు మరిచిపోక ముందే పిహెచ్ డి విద్యార్థుల విషయం లో వెలుగు చూస్తున్న చీకటి కోణాలపై మహిళా కమిషన్ కూడా దృష్టి

సారించవలసిన పరిస్థితి కి చేరిపోయింది.

విభాగాధిపతి పదవే పోయింది. ...

ఒక పిహెచ్ డి విద్యార్థిని వ్యవహారం లో Doctoral Committee Member కు సమాచారం కూడా ఇవ్వకుండా వైవా

నిర్వహించి, తూతూ మంత్రం గా ముగించి మమ అనిపించడంతో విభాగం లో అధ్యాపకుల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకున్న ఘటన గత వారం రోజుల క్రితమే జరగడం గమనార్హం. తానూ కో

గైడ్ గా ఉన్న విద్యార్థిని కి సంబంధించిన వైవా తనకు తెలియకుండానే నిర్వహించడం పై అకడమిక్ అఫైర్స్ డీన్ కు, రిజిస్ట్రార్ కు, వీసీ కి ఫిర్యాదు చెయ్యడం వరకూ

వెళ్లిన ఘటనలూ చూసాం. దీంతో ఇద్దరు అధ్యాపకుల మధ్య ఏర్పడిన వాగ్వాదాల నేపథ్యంలో విభాధిపతిగా ఉన్న అధ్యాపకులు తన హెడ్ పదవికి రాజీనామా చెయ్యడంతో, ఫిర్యాది సైతం

తానూ అధిపతిగా ఉన్న మరో విభాగానికి రాజీనామా చెయ్యడానికి సిద్ధపడడం తో ఉన్నతాధికారులు చేసిన రాజీ విధానం లో ఒక ప్రధాన విభాగాధిపతి తన పదవికి రాజీనామా

చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఏయు చరిత్రలో ఒక కీలక ఘటన గా మారిందనడం అతిశయోక్తి కాదు.

పిహెచ్ డి పట్టాలు ఇచ్చే వేదికకు విలువ లేదు....

అత్యంత

వైభవంగా పిహెచ్ డి పట్టాలు ప్రదానం చేసే స్నాతకోత్సవ ఉత్సవ రంగాన్ని మద్యపాన దుకాణాల వేలంపాటకు అనుమతించడం తోనే ఎయు పట్ల ప్రజల్లో విశ్వాసం తగ్గిన మాట అక్షర

సత్యం. ఒక విద్యాలయం లో మద్యం దుకాణాల వేలంకు స్థానం కల్పించడం లో అధికారులకు ఉన్న శ్రద్ధ విద్య పట్ల, విద్యార్థుల పట్ల, విద్యాలయం గౌరవాన్ని కాపాడడం పట్ల లేడు

అన్నది వాస్తవం గా కనపడుతోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam