DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మత విద్వేషాలు రెచ్చగొడితే ఉపేక్షించం:ఎస్పీ అమిత్ బర్దర్

*(DNS report : SV Acharyulu, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, సెప్టెంబర్ 28, 2020 (డి ఎన్ ఎస్ ):* జిల్లాలో గల పలు దేవాలయాలు, ప్రార్ధన మందిరాల పరిరక్షణలో బాగంగా ఎటువంటి అవాంతరాలు, దుర్ఘటనలు  జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో

నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఎస్.ఐ, సిఐ, డిఎస్పీలు మత పెద్దలు తో మత శాంతి కమిటీలను ఏర్పాటు చేసి మత పార్ధన మందిరాలు పరిరక్షణలొ బాగంగా  సిసి కెమెరాలను ఏర్పాట్లు చేసికొని, దేవాలయలు రక్షణా కొరకు పటిష్టమైన భద్రతాపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. 
ఇందులో భాగంగా కొంతమంది అసాంఘిక

శక్తులు  మతసామరస్యానికి భంగము కలిగించే విధంగా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై  చెడ్డ పేరు తెచ్చేవిధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తు ప్రజా శాంతికి భంగం కలిగిస్తున్నారని,అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఇప్పటికే ఎచ్చెర్ల స్టేషన్ పరిధిలో సోషల్ మీడియాలో విగ్రహాల ధ్వంసం  విషయంపై అసత్య

ప్రచారం చేసినందుకు గాను కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా, అటువంటి చర్యలకు పాల్పడిన వారిని  గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని మరియు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామ స్థాయి మండల స్థాయిలొ ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్

కానిస్టేబుల్, గ్రామ వాలెంటర్ల్లు, మహిళా సంరక్షణ కార్యదర్శులు మరియు గ్రామంలో యువత తో గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసి దేవాలయాల పరిరక్షణ పై పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై లు, కానిస్టేబుల్ గ్రామ మరియు వార్డులలో ప్రతి రోజు సందర్శించి  మత శాంతి కమిటీ సభ్యులు తో

చర్చించి వారి సమస్యలు పరిష్కారం కొరకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.సోషల్ మీడియాలో ఒక మతానికి సంబంధించిన అసత్య ప్రచారాలను పరిశీలించనదే ఇతరులకు పంపరాదని ప్రజలకు సూచించారు.అలాంటి సమాచారాన్ని నిజ నిర్ధారణ చేయనిదే షేర్ చేయకూడదని తెలియజేసారు. ఇప్పటికే జిల్లాలో 594 ప్రార్థన మందిరలు గుర్తించి  రక్షణ చర్యలో భాగంగా

సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందని ఎస్పీ  తెలియజేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam