DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*ఏపీలో రానున్నది బీజేపీ- జనసేన ప్రభుత్వమే:* 

*కర్ణాటక కు ధీటుగా ఆంధ్ర లో బీజేపీ ని నిలబెడతాం*

*మాజీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు వెల్లడి.* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 06, 2020 (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రానున్న ఎన్నికల్లో ఏర్పాటు కానున్నది భారతీయ జనతా పార్టీ- జనసేన పార్టీ ల కూటమేనని రాష్ట్ర బీజేపీ

ఉపాధ్యక్షులు, మాజీ MLA శ్రీ P విష్ణుకుమార్ రాజు జోస్యం పలికారు. మంగళవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ బీజేపీ దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో అధికారం లో ఉందని, దానికి ధీటుగా ఆంధ్ర లో పార్టీని అభివృద్ధి పరుస్తామన్నారు. 
ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పాలనా పై ప్రజలు

విశ్వాసాన్ని కోల్పోయారని, ఒక్క చాన్సు అంటే ప్రజలు అధికారం ఇచ్చారని, నేడు ఎంత నీచస్థితికి పాలనా దిగిపోయిందో చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజలకు బీజేపీ ఒక్కటే ఆపద్బాంధు అన్నారు. 

2015 జూన్ లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మోడీ ప్రవేశ పెట్టి, లక్షల మందికి సొంత ఇంటి కలను అందించే ప్రయత్నం చేస్తే, వాటిని

రద్దు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే నన్నారు. మోడీ పిలుపు మేరకు లక్షలాది ప్రజలు భారీ అప్పులు చేసి మరీ పథకంలో చేరితే, ఐదేళ్ల తర్వాత వాటిని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు జివిఎంసి కమిషనర్ ప్రకటించడం బాధాకరం అన్నారు. ప్రభుత్వం ఆదేశం లేకుండా కమిషనర్ ఇలాంటి ప్రకటన చేసే అవకాశం లేదన్నారు. దీనికై డబ్బులు చెల్లించిన

ప్రతి ఒక్కరికి డబల్ సొమ్ము చెల్లించాలన్నారు. వాళ్లందరికీ బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే. . బయట భారీ వడ్డీలకు అప్పు తెచ్చి మరీ కట్టారన్నారు. 

ఈ పథకంలో అర్హులైన లబ్ధిదారుల నుండి డిడిలు కట్టించుకొని రెండున్నర సంవత్సరాల తరువాత రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం దారుణాతిదారుణమని

అన్నారు. ఈ పథకంలో డిడిలు కట్టిన లబ్దిదారులందరు కూడా అప్పులు చేసి డిడిలు కట్టారని, రెండున్నర సంవత్సరాల తరువాత ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, డబ్బులు కట్టిన వారందరికీ తక్షణమే ఇళ్లను కేటాయించాలని కోరారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam