DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు దిశా స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా  కూనపరెడ్డి

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 09, 2020 (డి ఎన్ ఎస్ ):* 1991 బ్యాచ్ కు చెందిన డిఎస్పి కూనపరెడ్డి వెంకట సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దిశ పోలీస్ స్టేషన్ కు ఎస్.హెచ్. ఓ గా భాద్యతలు చేపట్టారు.  ఈయన గతంలో తూర్పు గోదావరి జిల్లాలో ఎస్సై, సీఐ గా అనపర్తి, పెద్దాపురం, జగ్గంపేట లలో పనిచేసి 2014 లో

డిఎస్పి గా పదోన్నతి పొందారు. రాజమహేంద్రవరం స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తూ రెగ్యులర్ ప్రొమోషన్ పొంది బదిలీపై దిశ పిఎస్ కు  బదిలీ పై వచ్చారు. 
ఈ సందర్భముగా డిఎస్పి మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయెస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో  మహిళల

యొక్క రక్షణ కొరకు దిశ పోలీస్ స్టేషన్ లు 13 జిల్లాల్లో ఏర్పాటు చేసారన్నారు. మహిళలకు రక్షణ కొరకు దిశ యాప్ ను  ఏర్పాటు చేసినట్లు, ఆపద సమయంలో ఉన్న మహిళలు మరియు బాలికలు ఈ దిశ యాప్ ద్వారా వారు ఆపదలో ఉన్న విషయాలను తెలియజేసిన ఎడల వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారాన్ని అందించే సౌలభ్యాన్ని కల్పించినట్లు తెలిపారు. దిశా

యాప్ లో సంచారము ఇచ్చిన వెంటనే కంట్రోల్ నాకు సమాచారం అందుతుందని కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసు వారు మహిళలకు బాలికలకు రక్షణ కల్పించే ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు మహిళలకు మరింత రక్షణ కల్పించే ఉద్దేశంతో దిశా చట్టాన్ని అలాగే దిశ పోలీస్ స్టేషన్ల ను 2019 లో

ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర డిజిపి, పశ్చిమ గోదావరి  జిల్లా ఎస్పి కె నారాయణ్ నాయక్ ల సూచనల మేరకు మహిళల సమస్యలను పరిష్కరించేందుకు కృతనిశ్చయం తో ఉన్నానని, కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుందని నమ్ముతూ బాలల మరియు మహిళల రక్షణకు ముందువరసలో నిలబడతానని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam