DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నకిలీ పాత్రికేయుల ప్రక్షాళన పై ఏపీజేయు హర్షం.

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 14, 2020 (డి ఎన్ ఎస్ ):*  జర్నలిస్టుల ముసుగులో జర్నలిజానికి మచ్చతెచ్చే నకిలీలను వేరి పారేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందుకే అక్రిడేషన్ల జారీ ప్రక్రియ ఆలస్యం అవుతోందని విశాఖపట్నంలో మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ

అధ్యక్షులు దేవిరెడ్డి శ్రీనాధ్ ప్రకటించటాన్ని అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (న్యూ ఢిల్లీ) జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు,ఏపీజేయు వ్యవస్థాపక కార్యదర్శి సీహెచ్.పూర్ణచంద్ర రావు,మరియు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీజేయూ) అధ్యక్షులు జాలే వాసుదేవ నాయుడు లు ఇక్కడ విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో

స్వాగతించారు. ఇది అన్ని రాష్ట్రాలకి మార్గదర్శకం కాగలదన్నారు.

 తమ యూనియన్ తొలినుండి అధికారులు జారీచేసే అక్రిడేషన్ల కమిటీలో జర్నలిస్టు సంఘాలకు సభ్యత్వం కల్పించటం వలనే జి.ఓ నిబంధనలు నిర్ల్యక్షం చేయబడి కొందరు క్రిమినల్స్ సైతం జర్నలిజం ముసుగులోకి   వచ్చి ఈరంగానికి మచ్చ తెస్తున్నారని, ఎట్టకేలకు ఈ

విషయం గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం,సమాచార శాఖా మంత్రి పేర్ని నానిగారు, కమిషనర్ టి వి కె రెడ్డిగారు,ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ గారు సంయుక్తంగా  అలాంటివారిని వేరివేసే చర్యలు చేపట్టడం పట్ల వారు ఆ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

    పత్రికలు చానెళ్లు కొన్ని ఏదొక పార్టీకి అనుబంధంగా

పనిచేస్తున్నాయి,అలాగే వాటికి అనుకూలంగా వుండే వారిని లేక ఉండేందుకు అంగీకరించిన వారినే విలేకర్లుగా నియమించుకుంటాయని వేరే చెప్పాల్సిన పని లేదు.ఈ నియామకంలో భాగంగా చేరిన ఎవరైనా నేర చరిత్ర వున్నవారి వివరాలు ఇంటిలిజెన్స్,స్పెషల్ బ్రాంచ్ ద్వారా సేకరించి మాత్రమే అక్రిడేషన్లు జారీచెయ్యలని వారు ప్రభుత్వానికి

విజ్ఞప్తి చేశారు.

    అసలు పత్రికలు ఎన్నడూ కనపడని వారు అక్రిడేషన్లేకాదు,ఆఖరికి  కమిటీలోకి కూడా నియమించబడుతున్నారని ఇది ఎలా సాధ్యం అని  సందేహం వ్యక్తం చేశారు.

     తమ ఏపీజేయు తొలినుండి  ప్రభుత్వం జారీచేసే అక్రిడేషన్ల కమిటీలో యూనియన్లను నియమించవద్దని కోరుతోందని, అయితే

కొన్ని రోజులుగా ఎంతో చరిత్ర ఉన్న ఒక యూనియన్ తమ యూనియన్ని గుర్తించలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర పదజాలం తో ప్రకటనలు చేసి జి.ఓ 98 రద్దుచేయాలని కోరుతూ ఉద్యమాలు చెయ్యటం,కొందరు నాయకులు ముఖ్యమంత్రి గారికి పరిశీలించమని కోరడం జరిగిందని,ఆయన పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు వార్తల్లో వచ్చిందని, నిజంగానే

చరిత్రవున్న ఆ యూనియన్ కి  ఈ విషయం సానుభూతితో పరిశీలించాలని ఒక సోదర యూనియన్ పక్షాన తమ యూనియన్ కూడా  మా సోదర యూనియన్ ని గుర్తించేందుకు అవసరమైన అవకాశాలు సానుభూతితో పరిశీలించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

   ఈనెల మొదటి నుండి అక్రిడేషన్లు రెన్యూవల్ చెయ్యకపోవటం తో విషయం తెలిసిన కొందరు

నకిలీలు ఈ రంగంపై నిరాసక్తి కనబర్చుతున్నట్లు తెలుస్తోందని,డిసెంబర్ వరకు ఇదే పొజిషన్ ఉంటే. నకిలీలు స్వచ్చందంగా తప్పుకునే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఇక వేరే వడబోత పోయాల్సిన అవసరం ఉండకపోవచ్చని పూర్ణచంద్ర రావు,వాసుదేవ నాయుడు  అభిప్రాయం వ్యక్తం చేశారు.

  అలాగే నిజమైన జర్నలిస్టులకు ముఖ్యమంత్రి వై ఎస్

జగన్మోహన్ రెడ్డి మేలు చెయ్యాలని ఉన్నట్లు కూడా ప్రెస్ అకాడమీ అధ్యక్షులు దేవిరెడ్డి శ్రీనాధ్ ఆ మీట్ ది ప్రెస్ లో వెల్లడించడం,అలాగే కోవిడ్   భారిన పడి మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు 5 లక్షలు పరిహారం కోరినట్టు,ఆమేరకు మంజూరైనట్లు కూడా మంగళవారం విశాఖలోనే ఆయన పాత్రికేయుల సమావేశంలో పేర్కొనటం పట్ల పూర్ణచంద్ర

రావు,వాసుదేవ నాయుడులు కృతజ్ఞతలు తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam