DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హైదరాబాద్‌ లో విస్తృత వర్షం. . . వీధులన్నీ జలమయం

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 14, 2020 (డి ఎన్ ఎస్ ):* 

హైదరాబాద్‌: కుంభవృష్టి వర్షంతో హైదరాబాద్‌ అతలాకుతలం అయ్యింది. చెరువులు, కుంటలు పొంగి నీటి ప్రవాహం ఎక్కువగా రావడంతో వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. నగరంలోని దాదాపు 1500 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు

చేరడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు కోతకుగురవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లపు ప్రాంతాల్లో ఇళ్ల ముందు నిలిపి ఉంచిన కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. సహాయ

చర్యల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.  

♦ హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై ఇనామ్‌గూడ వద్ద వరదనీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

♦ గగన్‌పహాడ్‌ వద్ద హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ

రహదారి కోతకు గురైంది. సమీపంలో ఉన్న అప్పాచెరువు కట్టతెగి జాతీయ రహదారిపైకి వరదనీరు చేరడంతో రహదారి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

♦ హైదరాబాద్‌-వరంగల్‌ రహదారిపై ఉప్పల్‌ సమీపంలో నల్లచెరువు కట్ట తెగడంతో రహదారి కోతకు గురైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు

పడుతున్నారు. ఈ మార్గంలో రవాణా స్తంభించింది.

♦ ఎంజీబీఎస్‌ పరిసర ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అంతరాయమేర్పడింది. గాంధీ భవన్‌ ముందు ఉన్న బస్టాప్‌ కూప్పకూలింది. రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

♦  సోమాజీగూడ యశోద ఆసుపత్రిలోకి భారీగా వరద నీరు చేరడంతో

రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన రహదారులన్నీ జలమయవడంతో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. దీంతో మెట్రో స్టేషన్లన్నీ కిటకిటలాడాయి.

♦ వరద సహాయక చర్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌

జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న అధికారులు, మేయర్‌, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.

♦ భారీగా వరదనీరు చేరడంతో జూపార్క్‌కు అధికారులు సెలవు ప్రకటించారు. శిల్పా రామంలో భారీ

వృక్షాలు నేలకూలడంతో శిల్పారామం మూసివేస్తున్నట్లు తెలిపారు.

♦ భారీ వర్షం కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. హుస్సేన్‌సాగర్ నుంచి వరద నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ

చేశారు.

♦  పాతబస్తీలో వర్షం బీభత్సం సృష్టించింది. పలు కాలనీల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలక్‌నుమా బార్కాస్‌లో వరద ఉద్ధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. తాడు సాయంతో అతన్ని కాపాడేందుకు స్థానికులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. స్థానికులు అందించిన తాడును కొట్టుకుపోతున్న వ్యక్తి వరద

తీవ్రతకు పట్టుకోలేకపోయాడు. దీంతో అందరూ చూస్తుండగానే వరద ప్రవాహంలో కొట్టుకెళ్లాడు. గల్లంతైన వ్యక్తికోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam