DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్ని చోట్లా నో మాస్క్‌...నో ఎంట్రీ బోర్డు పెట్టాల్సిందే

*వర్తక సంఘాలకు రాజమండ్రి నగర కమిషనర్‌ సూచన*

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 21, 2020 (డి ఎన్ ఎస్ ):* కొవిడ్‌-19 నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నిబంధనల్లో భాగంగా నగరమంతా నో మాస్క్‌...నో ఎంట్రీ బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం నగర

పాలక సంస్థ కమిషనర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ స్పష్టం చేశారు. కమిషనర్‌ మినీ కాన్ఫెరెన్స్‌ హాల్లో రాజమహేంద్రవరం నగరానికి చెందిన చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, సినిమా థియేటర్ల యాజమాన్యం, ¬టల్స్‌ యాజమాన్య, బట్టల వర్త యాజమాన్య ప్రతినిధులతో కమిషనర్‌ బుధవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌

అభిషిక్త్‌ కిషోర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ -19 నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 529 ద్వారా కొన్ని మార్గదర్శకాలను విడుదల  చేసిందని తెలిపారు. ప్రభుత్వ జీవోలోని మార్గదర్శకాలపై పది రోజులపాటు నగరంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం తీసుకున్న చర్యలతోపాటు,

ప్రజల సహకారంతో కొవిడ్‌-19 వైరస్‌ నుంచి బయటపడ్డామని, అయితే శీతాకాలం నేపథ్యంలో రెండో దఫా కొవిడ్‌ -19 వైరస్‌ వ్యాపించే అవకాశాలు ఉన్నాయన్నా ఉద్ధేశ్యంతో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. నగరంలోని ప్రతీ షాపు వద్ద తప్పనిసరిగా నో మాస్క్‌...నో ఎంట్రీ బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించేలా

వ్యాపారస్తులంతా సహకరించాలని సూచించారు. షాపులోకి వచ్చిన తరువాత ప్రతీ ఒక్క వినియోగదారుడు భౌతిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత వ్యాపార సంస్థపై ఉందన్నారు. అలాగే సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతోనే నిర్వాహణ చేయాలని, అలాగే థియేటర్లలో శానిటైజేషన్‌, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

సారించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని పక్షంలో మరోసారి వైరస్‌ భారినపడే ప్రమాదం లేకపోలేదని అన్నారు. ఇప్పటికీ చిత్తూరు జిల్లా తరువాత తూర్పు గోదావరి జిల్లా రెండో స్థానంలో కొనసాగుతుందని గమనించాలని అన్నారు. అన్ని వ్యాపార రంగాలకు సంబంధించిన అసోసియేషన్లు, ప్రజలు పూర్తిగా సహకరించడం ద్వారానే ఈ వైరస్‌ను

నివారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పది రోజులపాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని, అనంతరం నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది నిబంధనలకు సంబంధించి అమలు తీరుపై క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారని అన్నారు. తమ క్షేత్ర స్థాయి పరిశీలనలో నిబంధనలను పాటించని వారిపై అపరాద రుసుంను వేస్తామని, అవసరమైతే నిబంధనలు పాటించన

వ్యాపార సంస్థలను సీజ్‌ చేసే అవకాశాలు లేకపోలేదని అన్నారు. కావున వ్యాపార సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను పాటించి అధికారులకు సహకరించడం ద్వారా కరోన వైరస్‌ నివారణకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా అసోసియేషన్లకు చెందిన ప్రతినిధులు రోడ్లు, డ్రైనేజీల వల్ల పడుతున్న ఇబ్బందులు, యూజర్‌ ఛార్జీల అంశాన్ని

కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కమిషనర్‌ మాట్లాడుతూ వర్షాల వల్ల రోడ్లు పనులు చేపట్టలేకపోతున్నామని, ఇప్పటికే రోడ్ల మరమ్మత్తులతోపాటు, నగరంలోని ప్రధాన కూడళ్ళను అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను కూడా మంజూరు చేయడం జరిగిందని, మార్చి నాటికి ఇందుకు సంబంధించిన పనులను పూర్తి  చేసేలా

చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక యూజర్‌ ఛార్జీల అనేవి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే వసూలు చేయడం జరుగుతుందని, కేంద్రం నుంచి నగర అభివృద్ధికి అవసరమైన నిధుల కోసమేనని అర్థం చేసుకోవాలన్నారు. వాస్తవంగా నగరంలో పారిశుద్ధ్య విభాగానికి నెలకు సుమారు రెండున్నర కోట్లు ఖర్చు చేస్తున్నామని, యూజర్‌

ఛార్జీల వల్ల వచ్చేది కేవలం రెండు లేదా మూడు లక్షలకు మించదని అన్నారు. యూజర్‌ ఛార్జీల వసూలు ద్వారా అమృత పథకానికి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ పథకానికి ఎంపికైతే కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. రోడ్లపై చెత్త కన్పించకుండా సహకరించాలని, ఎవ్వరి దుకాణాల్లో వారే చెత్తను ఉంచుకుని చెత్త తరలించే

వాహనాలు వచ్చినప్పుడు వారికి అందించేలా సహకరించాలని సూచించారు. రాబోయే కాలంలో బహిరంగ డస్ట్‌ బిన్స్‌ను క్రమంగా తొలగించే ప్రక్రియకు వ్యాపారస్తులు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్‌ ఎన్‌వివి సత్యనారాయణ, ఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎ.వినూత్న, రాజమండ్రి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు

లక్ష్మీ నారాయణ జవ్వార్‌, ¬టల్‌ యాజమాన్య అసోసియేషన్‌ నుంచి శ్రీ కన్యా సూర్యనారాయణ రాజు, సినిమా థియేటర్ల యాజమాన్య అసోసియేషన్‌ నుంచి సూర్య సీతారామరాజు, క్లాత్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ నుంచి కంకటాల దుర్గాప్రసాద్‌, కళానికేతన్‌ హరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam