DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం లో విద్యార్థుల కోసం ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ 

*(DNS report : SV Acharyulu, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, అక్టోబర్ 22, 2020 (డి ఎన్ ఎస్ ):* విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పై అవగాహనా కోసం శ్రీకాకుళం జిల్లా లో పోలీసు ఆయుధాల ప్రదర్శన ( ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ) ను జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ప్రారంభించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమం లో పోలీసులు విధినిర్వహణలో వాడే  ఆయుధాల

గురించి విద్యార్దులు తెలుసుకోవడం ఎంతో అవసరం అని ఎస్పీ అన్నారు.
• ఎచెర్ల లో జిల్లా పోలీసు అర్ముడు రిజర్వు కార్యాలయ ప్రాంగణంలో గల పోలీసు కమ్యూనిటీ హల్లో ఏర్పాటు చేసిన " ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్" ప్రదర్శన ను  విద్యార్దులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా  ఎస్పీ తెలిపారు.
.పోలీసు అమర వీరుల కార్యక్రమంలో

భాగంగాఈ రోజు అనగా 22.10.2020 గురువారం నాడు జిల్లా అర్ముడు రిజర్వు  మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ నందు జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్  గారు మాట్లాడుతూ... పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వారు వినియోగించే ఆయుధాలు , నేరదర్యాప్తు విదానం  తదితర విషయాలను విద్యార్దులకు, ప్రజలకు తెలియజేయడానికి ఈ ఓపెన్ హౌస్

కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ప్రజల యొక్క శ్రేయస్సుకు, దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించూకుంటూ ప్రజలందరికీ అండగా ఉంటామని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాలు అభివృద్ధి చెందుతున్న వలన ప్రజలు కూడా కాలనికి అనుగుణంగా మార్పు చెందాలని తెలిపారు. 
/> ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశిపెట్టినా " AP police Seva App" వల్ల ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలు వినియోగించాలన్నారు.ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. అందువల్లన పోలీసు వారి యొక్క సేవలను స్టేషన్ రాకుండానే ఇళ్ళల్లో నుంచే సేవలను నేరుగా పొందవచ్చునని,అంతేకాకుండా ఆ యాప్ ద్వారా మీరు చేసిన

పిర్యాదు పై సంబంధిత అధికారి తీసుకున్న చర్యలు,కేస్ యొక్క ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చాను, అందువల్ల మీ విలువైన సమయాన్ని వృధా కాదుని, అనవసర వ్యయ ప్రయాసలు వృధా కావుని తెలిపారు.ఈ పోలీసు యాప్ ద్వారా మహిళలు, వృద్ధులు మరియు బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల వారు నేరుగా సేవలును పొందుటకు అవకాశం ఉందని,తద్వారా కేసుని

తప్పుదావా పట్టించడానికి అవకాశం ఉండదని తెలియజేసాను. అనంతరం బాంబుడిస్పోజబుల్ టీం, నేర పరిశోధనలో ఉపయోగించే డాగ్ స్వ్కాడ్ బృందాలు, ఆయుధాల – విడి భాగాల సమాచారం గురించి  ( ఎకె 47 , విల్ పిస్టల్, గ్లో 17, కార్బన్ , సిసి టిన్ ఎస్, లాక్డ్  హౌస్ మానిటరింగ్ , రోడ్డు భద్రత సైన్స్, ఫైర్ డిపార్ట్మెంట్ సాధనలు  తదితర విషయాల గురించి

 స్కూళ్ళ,కళాశాల నుండి విచ్చేసిన విద్యార్దులకు ఎస్పీగారు తెలియజేశారు.అనంతరం ఈ ప్రదర్శన శాలలో వీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఆయుదాలు, మెటల్ డిటిక్టర్,పోలీసు జాగిలాలు, బాడీ వార్న్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు,లైఫ్ జాకెట్లు, బాడీ ప్రొటెక్టర్ జాకెట్ మొదలైనవి  ప్రదర్శనలో ఉంచి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సంరక్షణ

కార్యదర్శులు, శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మరియు విద్యార్థుని, విద్యార్థులుతో పోలీసులు అను నిత్యం విధి నిర్వహణలో ఉపయోగించే వాటి యొక్క ఉపయోగాలను గురించి జిల్లా ఎస్పీ అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అర్ముడు రిజర్వు డిఎస్పీ ఎన్.ఎస్.ఎస్. శేఖర్, ఎస్బి సిఐ శంకరరావు,  ఆర్.ఐ ఉమామహేష్,

ఎచ్చెర్ల ఎస్.ఐ రాజేష్, ఆర్.ఎస్ లు  మరియు అర్ముడు రిజర్వు  సిబ్బంది పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam