DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా భద్రతే . . పోలీసు బాధ్యత : శ్రీకాకుళం ఎస్పీ అమిత్ బర్దార్

(DNS రిపోర్ట్ : ఆచార్యులు SV,  బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)  

శ్రీకాకుళం, నవంబర్ 07, 2020  (డిఎన్ఎస్): ప్రజా భద్రతే . . పోలీసు బాధ్యత అని శ్రీకాకుళం ఎస్పీ అమిత్ బర్దార్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలు వలన, భారీ వాహనాలు రవాణా వల్ల గ్రామీణ ప్రాంతాల్లో, ఇతర ముఖ్యమైన రోడ్డు మార్గంలో గుంతలూ అవ్వడం,

రోడ్డు మార్గంలో నీరు నిల్వ ఉండిపోవడం మరియు కల్వర్టులు పాడువ్వడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మరియు ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ముందుస్తు చర్యలులో బాగంగా జిల్లా ఎస్పీ సూచనలు మేరకు జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్ లో పోలీసు అధికారులు,

ఆర్ & బి శాఖ మరియు సంబంధిత ఇతర శాఖల అధికారులు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మార్గంలో ఏర్పడిన గుంతలూ త్వరితగతిన పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా కాశీబుగ్గ టౌన్ పరిధిలో గల మొగిలిపాడు మరియు కోసంగిపురం ముఖ్య కూడలి వద్ద NH 16  హైవే కి కలిసి మార్గంలో

ప్రమాదలు ఎక్కువ జరిగిన ప్రదేశాలును గుర్తించి హైవే అథార్టీ సిబ్బందితో స్పీడ్ బ్రేకర్స్ వేయంచి రోడ్డు ప్రమాదలు నివారణకు ముందస్తు చర్యలను సిఐ చేపట్టారు

ఇచ్చాపురం టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో రక్తకన్న గ్రామం నుంచి మార్కెట్  కి వెళ్ళే రోడ్డు మార్గంలో ఏర్పడినా గుంతలూను గమనించిన ఇచ్చాపురం సర్కిల్

ఇన్స్పెక్టర్ వినోద్ బాబు ఆధ్వర్యంలో  టౌన్ ఎస్.ఐ తన సిబ్బందితో కంకరి మట్టి మరియు కసర పౌడర్ తో ప్రజా రవాణా మార్గంలో ఏర్పడినా గుంతలూ పూడ్చవేసారు.

భామిని మండలం లోని బత్తిలి పోలీసు స్టేషన్ పరిధిలో   కొత్తగూడ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు గాను రోడ్డు మార్గంలో కల్వర్టు పాడువ్వడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బంది

జరిగింది. ఈ సమాచారాన్ని అందుకున్న స్థానిక ఎస్.ఐ  సురేష్ తన పోలీసు స్టేషన్ సిబ్బందితో, స్థానిక  ప్రజలు మరియు స్థానిక కల్వర్టు నిర్వహకులు సహాయంతో యుద్ధ ప్రాతిపదికంగా తాత్కాలికంగా రోడ్డు మార్గంలో మరమ్మతులు చేపట్టి,ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలుకు  రాక పోకలుకు ఇబ్బందులు లేకుండా మరియు ప్రజా రవాణాకు

అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది.

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ లు వారి వారి పరిధిలోని ఆటో, కారు, ఇతర వాహనాలు డ్రైవర్లతో ముఖ్యంగా  ప్రజలలో ట్రాఫిక్ నియమా నిబంధనలు గురించి అవహగనా కార్యక్రమములు నిర్వహించారు.

రోడ్డు ప్రమాదల నివారణకు పాటించి వలిసిన జాగ్రత్తలు, నిబంధనలు విరుద్ధంగా ప్రయాణీకులను ఎక్కించు కూడదని, అతి వేగంతో వాహనాలు నడపరాదుని మరియు మద్యం సేవించి వాహనాలు నడపరాదని,హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించే వాహనాలు నడపాలని  మొదలైన అంశలపైనా వినూత్న రీతిలో ప్రజా సమూహాలు ఉన్న చోట అవగాహనా కార్యక్రమంలు నిర్వహించి,ప్రజలకి

అవగాహన కలిపించారుని జిల్లా ఎస్పీ గారు తెలియజేసారు.
ఓ చిన్న కారణం పెద్ద ప్రమాదం నకు దారి తీయకూడదని ముఖ్య ఉద్దేశ్యం తో  ప్రమాదాలు జరగకుండా చూసేందుకు గాను, రోడ్డు ప్రమాదాలులో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అన్నారు. విధి నిర్వహణలో క్షణం కూడ తీరిక లేకుండా ఉద్యోగంలో

భాగస్వామ్యం అయ్యే  పోలీసులు ఇలాంటి ప్రేత్యేక పరిస్థితుల్లో మీ రక్షణా.. మా బాధ్యత అని సేవా దృక్పథంతో ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఆలోచనతో  ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న కాశీబుగ్గ సిఐ శ్రీనివాస్ రావు, ఇచ్చాపురం సర్కిల్ సిఐ వినోద్ బాబు, టౌన్ ఎస్ఐ సత్యనారాయణ  బత్తిలి ఎస్.ఐ సురేష్ మరియు వారి వారి సిబ్బందికి

 జిల్లా ఎస్పీ ప్రత్యేక అభినందినలు తెలిపారు. అదేవిధంగా ప్రతి పోలీసు అధికారి మరియు సిబ్బంది వారి పరిధిలో  ఇలాంటి సేవ కార్యక్రమంలో పాల్గొనలని జిల్లా ఎస్పీ గారు తెలియజేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam