DNS Media | Latest News, Breaking News And Update In Telugu

TTD పాలక మండలి మెడలు వంచాడు వెంకన్న

పాలక మండలి మెడలు వంచాడు వెంకన్న 

తిరుమల, జులై 17, 2018 (DNS Online ): ఆగస్టు నెలలో నిర్వహించ తలపెట్టిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి దర్శనాన్నీ

సామాన్య భక్తులకు నిలిపి వేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి చేసిన ప్రకటన పై సాక్షత్తు వెంకన్నకు ఒళ్ళు మండినట్టుంది. ఒక్కసారిగా భక్తుల్లో

ఆగ్రహాన్ని రేకెత్తించడం తో పాలక మండలి తోకముడిచి, దర్శనాల రద్దు పై పున: సమీక్షకి దిగింది. పైగా చేసిన తప్పును ఒప్పుకునేందుకు అధికారం, అహంభావం

అడ్డంవచ్చినట్టున్నాయి, దీంతో ముఖ్యమంత్రి కరుణించారు, అందుకే మేము దర్శనాలపై మరో సారి సమావేశం అవుతామని మంగళవారం పాలక మండలి ప్రకటించింది. తిరుమల కొండపై

వేంకటేశ్వరుడు వెలసింది కేవలం భక్తుల కోసమే కానీ, అధికారులు, పాలకమండలి, ప్రభుత్వంలోని పెద్దలు లాంటి భుక్తుల కోసం కాదు అనేది ఈరోజు నిరూపితమైంది. గతం లో

ఎన్నడూ లేనంతగా à°ˆ పాలక మండలి, ఈఓ వచ్చిన తర్వాతే తిరుమల కొండపై ప్రతీ విషయం  à°µà°¿à°µà°¾à°¦à°‚à°—à°¾ మారిపోతున్నాయి. అసలు ఈఓ నియామకం లో ఉత్తరాది వాళ్లకి ఇక్కడ సంప్రదాయం ఎలా

తెలుస్తుంది అని మొదలైంది. ఎదో సద్దుకున్నారు భక్తులు. ఇక తర్వాత వంతు పాలక మండలి నియామకం. ఒక అన్య కుడు ( క్రైస్తవ సానుభూతి పరుడు) ని ఏకంగా పాలక మండలి చైర్మన్ గా

నియమించడం తో ఈ వివాదం ముదిరి పాకాన పడింది. ఇక అసమర్థులుగా భక్తులచే నిరంతరం కొనియాడబడుతున్న వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇంతకంటే గొప్పగా ఉండవు అని సాక్షాత్తు

కొందరు పీఠాధిపతులు ప్రకటించారు అంటే వీళ్ళ గొప్పతనం తెలుస్తోంది. పైగా టిటిడి లో ఏ నిర్ణయం తీసుకోవాలన్న ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పాల్సిందే అంటే వీళ్ళు ,

వీళ్ళ పాలనా సమర్ధత బహిర్గతమవుతోంది. స్వతంత్రగా కనీసం కప్పు కాఫీ కూడా ఆర్డర్ చేసే అవకాశం లేకుండా అన్ని అక్కడ నుంచే జరిగిపోతున్నాయి అని టిటిడి లో ఒక

ఉన్నతాధికారి తెలియచేస్తున్నారంటే టిటిడి లో ఏమి జరుగుతోంది వాళ్ళకే తెలియకుండా పోతోంది. అయితే ఆగస్టు నెలలో వారం రోజుల పాటు స్వామి దర్శనం నిలిపి వేస్తామని

పాలక మండలి ప్రకటించగానే ఆలయంలో త్రవ్వకాలు జరిపినట్టు తెలుస్తోంది అని ఆగమ పండితులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు బలం చేకూరింది. ఇక గతం లో ఆపేసిన

త్రవ్వకాలను ఈ వారం రోజుల పాటు అధికారికంగా కొనసాగిస్తారు అనే ఆరోపణలూ వెలికి చూడడంతో తప్పని సరి పారిస్తుతుల్లో భక్తుల డిమాండ్ల కు పాలక మండలి మీద వంచక

తప్పలేదు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam