DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*రాజమహేంద్రి నగర టీడీపీ లో నువ్వా నేనా సై. . .*

*ఆదిరెడ్డి కి అడ్డుకట్ట వేసేందుకు బుచ్చయ్య రెడీ..*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 10, 2020  (డి ఎన్ ఎస్):* రాజమహేంద్ర వరం నగర తెలుగుదేశం పార్టీలో ఢీ అంటే ఢీ కి రంగం సిద్ధమైపోయింది. గత 35 ఏళ్లుగా రాజకీయ చక్రం త్రిప్పుతున్న రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన రాజకీయ

వారసునిగా తమ్ముని కుమారుడు డాక్టర్ రవి రామ్ కిరణ్ ను ప్రకటించారు. మంగళవారం జరిగిన ఈ హఠాత్పరిణామం లో ప్రత్యర్థి వర్గమైన ఆదిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టేందుకేనన్నది బహిరంగ రహస్యమే. వైద్యునిగా సేవలు అందిస్తున్న రవిరామ్ కిరణ్ ప్రస్తుతం టిడిపి డాక్టర్ సెల్ ద్వారా సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. అయితే బుచ్చయ్య

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గా ఉన్నప్పడికి, కిరణ్ రాజమండ్రి నగర పరిధిలోనే చక్రం త్రిప్పుతారని ప్రకటించారు. ఇది టిడిపి ని మరింత బలోపేతం చేసేందుకే అని చెప్తున్నప్పటికీ, ఆదిరెడ్డి కుటుంబానికి చెక్ అనేది అందరికి తెలిసిందే. రెండు వర్గాల ఆధిపత్య పోరులో 2019 ఎన్నికల్లో ఆదిరెడ్డి కుటుంబం రాజమండ్రి నగర ఎమ్మెల్యే టికెట్

పొందగలిగింది. అయితే బుచ్చయ్య కు ఇది మింగుడు పడడం లేదు.  దీనికి బదులుగా తన వారసుణ్ణి రంగంలోకి దించినట్టు ప్రచారం జరుగుతోంది. టిడిపి కి ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే సమస్యలు కంటే. . అంతర్గత పోరే దెబ్బతీసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని, పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam