DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్ని అటవీ సర్కిళ్లలో అమరవీరుల స్మృతివనాలు 

*పీసీసీఎఫ్, అటవీ దళాధిపతి ఎన్ ప్రతీప్ కుమార్*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 10, 2020  (డి ఎన్ ఎస్):* రాష్ట్రంలోని అన్ని అటవీ సర్కిల్ కేంద్రాల్లోనూ వచ్చే సెప్టెంబర్ లోగా అటవీ అమరవీరుల స్మృతి వనాలు, స్మారక చిహ్నాలను నెలకొల్పుతామని అటవీ శాఖ ప్రధాన ముఖ్య అటవీ

సంరక్షణాధికారి, అటవీ దళాధిపతి ఎన్ ప్రతీప్ కుమార్ చెప్పారు. మంగళవారం సాయంత్రం స్థానిక దివాన్ చెరువు గ్రామ పరిధిలోని నగరవనంలో జరిగిన అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమండ్రి సర్కిల్ అద్వర్యంలో నగరవనంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్మృతివనాన్ని, స్మారక చిహ్నాన్ని అటవీ దళాధిపతి

ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని శ్లాఘించారు. సదా వాటిని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రలోభాలకు తలొగ్గి ఉంటే వారు మరణాన్ని తప్పించుకోగలిగి ఉండేవారని .. కానీ అలా చేయకుండా విధినిర్వహణ కోసం ప్రాణాలు అర్పించారంటే వారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలన్నారు. అటవీ

శాఖలో అట్టడుగు స్థాయి ఉద్యోగాలు చేసేవారు కూడా నీతి నిజాయితీల కోసం ప్రాణాలు పణంగా పెట్టారని తెలిపారు. చిన్న ఉద్యోగులే ఆలా నీటికి నిలబడినప్పుడు మనం ఎందుకు నిజాయితీగా ఉండలేమని ప్రతి అధికారీ ప్రశ్నించుకోవాలన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అటవీ శాఖలో 95  శాతం మంది అధికారులు నిజాయితీగా, నిబద్ధతతో పని

చేస్తున్నారన్నారు. 
తొలుత అటవీ దళాధిపతికి ఫారెస్ట్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 1939 నుంచి ఇప్పటివరకూ విధి నిర్వహణలో అసువులు బాసిన 22  మంది అటవీ అమరవీరుల స్మృతికి అధికారులు, సిబ్బంది ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ప్రతీప్ కుమార్ తో పాటు అదనపు పీసీసీఎఫ్ ఏకే ఝా, అటవీ అకాడమీ డైరెక్టర్ జె

ఎస్ ఎన్ మూర్తి, రాజమండ్రి సర్కిల్ సీఎఫ్ ఎన్ నాగేశ్వరరావు, ఎపిఎఫ్ డిసి రీజినల్ మేనేజర్ టి జ్యోతి, ఐ ఎఫ్ ఎస్ ప్రొబెషనర్ చైతన్యకుమార్ రెడ్డి, డీఎఫ్ ఓ లు, ఇతర ఫారెస్ట్ అధికారులు  బి సునీల్ కుమార్ రెడ్డి, యశోదబాయి, సెల్వం, ఎం వి ప్రసాదరావు, శ్రీహరిగోపాల్, భీమయ్య, ఫణికుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అటవీ అమరవీరులపై

నూజిళ్ల శ్రీనివాస్ రాసిన గేయాన్ని, వీడియో సాంగ్ ను ప్రతీప్ కుమార్ ఆవిష్కరించారు. అమరవీరులపై ప్రచురించిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగాలపై విస్తృతంగా ప్రచారం జరగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అమరవీరుడు ఆశీర్వాదం కుమారుడు ధర్మరాజును ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమానికి ట్రైనర్ పరసా రవి

వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam