DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజకీయ ప్రక్షాళన చెయ్యడానికే జనసేన వచ్చింది : శివ శంకర్.

విశాఖపట్నం, జులై 18 , 2018 (DNS Online ): అస్తవ్యస్తమైన రాజకీయాలను ప్రక్షాళన చెయ్యడానికే జనసేన ఆవిర్భవించిందని, జనసేన పార్టీ  à°‰à°¤à±à°¤à°°à°¾à°‚ధ్ర జిల్లాల సమవ్యయకర్త శివశంకర్

ప్రకటించారు. బుధవారం పెందుర్తి నియోజకవర్గంలో చేపట్టిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేవలం ఎన్నికల

సమయంలో మాత్రమే ప్రజలకు కనిపించేవాడు రాజకీయ నేతలుగా ఇప్పటివరకూ చెలామణి అవుతూ, ప్రజల సొమ్ముతో తన పలుకుబడిని పెంచుకుంటూ, భూ దందాలకు, దోపిడీలకు పాల్పడుతున్న

నీచమైన విధానాన్ని ప్రక్షాళన చేసేందుకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారన్నారు. స్థానిక పెందుర్తి శాసన సభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి కి భూదాహం

పట్టుకుందని, అది ప్రస్తుతం తారాస్థాయి కి చేరుకుందని మండిపడ్డారు. ఇతన్ని మించిపోయి ఇతని కొడుకు సైతం భూ దందా భూతాన్ని ఝుళిపిస్తున్నదన్నారు. వీళ్ళ ఆగడాలకు

అడ్డుకట్ట వేసే రోజు అతి త్వరలోనే ఉందని, అధికారం లోకి వచ్చిన వెంటనే పేదల నుంచి లాక్కున్న ప్రతీ సెంటు భూమిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. 
/> పెందుర్తి మండలం ముదపాక గ్రామంలో పేదలకు చెందిన భూములను స్తానిక శాసన సభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి, సహచర తెలుగుదేశం పార్టీ  à°¨à°¾à°¯à°•à±à°²à± కలిసి స్వాహా

చెయ్యాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై బాధితులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలిసి తమ ఆవేదనను మొరపెట్టుకున్నారని తెలిపారు. దీంతో బాధితులు

విజ్ఞప్తి మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముదపాక లో పర్యటించడం జరిగింది అన్నారు. జనసేనాని పర్యటన తో ఈ భూములు తమకు కాకుండా పోతాయన్న ఆక్రోశంతో తెలుగు దేశం

పార్టీ నాయకులు భాదితులపై పెందుర్తి పోలీస్ స్టేషను లో తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఈ దుశ్చర్యని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది

అన్నారు. బాధిత రైతులు, వారి కుటుంబాల వెంట జనసేన పార్టీ à°…à°‚à°¡à°—à°¾ ఉంటుంది హామీ ఇచ్చారు. 
పెందుర్తిలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద జరిగిన జనసేన సభ్యత్వ నమోదు

కార్యక్రమం లో జనసేన నాయకులు వేగి దివాకర్,మండవ రవికుమార్,గుంటూరు నరసింహమూర్తి, మోటురూ సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

 

@ copy rights reserved

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam