DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*నగర కమిటీలు లేని బీజేపీ ఆంధ్ర లో బ్రతికి గట్టెక్కేనా?*

ఏపీ బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుల చిటికెన వ్రేళ్ళ మీదే నడుస్తోంది

ఏడాది గడుస్తున్నా ఏకాకులే. . . కమిటీలే లేవు..నైరాశ్యంలో క్యాడర్.

అనుమతి లేని నాయకులూ నోరెత్తితే వేటే. . .

ఏపీ లో బీజేపీ పార్టీకి భవితవ్యం ఎండమావేనా?  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

 

*విశాఖపట్నం, నవంబర్ 15, 2020  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ భవితవ్యం ఎండమావిగానే కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీ కి నూతనోత్తేజం వస్తున్నా. . ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం బొత్తిగా క్యాడర్ కూడా కనపడడం లేదు. ఇదే అభిప్రాయం పార్టీ అధిష్టానం నుంచి కూడా వ్యక్తమవుతోంది. గత ఏడాది  ( 2019 ) డిసెంబర్ లో

రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటరీ అధ్యక్షుల నియామకం జరిగింది. అయితే 2020 డిసెంబర్ వస్తున్నా నేటికీ స్థానిక కమిటీల నియామకం జరగక పోవడం గమనార్హం. 
ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ మొత్తం పార్లమెంట్ అధ్యక్షుల చిటికెన వేళ్లమీదే నడుస్తోంది అనేలా ఉంది. రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా . . . కేవలం పార్లమెంట్ అధ్యక్షుల

నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. వీళ్ళలో చాలామంది కి పార్టీ వ్యవహారాల పై అంతగా ఆసక్తి ఉన్నట్టుగా కనపడడం లేదు. గత ఏడాదిగా రాష్ట్రంలో బీజేపీ తరపున చేసిన ఉద్యమాలే లేవు. అన్ని తూతూ మంత్రంగా చేసేవే తప్ప, పెద్దగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టిన దాఖలాలే లేవు. 

అనుమతి లేని నాయకులూ నోరెత్తితే వేటే. .

.

పైగా రాష్ట్రవ్యాప్తంగా క్యాడర్ లో నైరాశ్యం నెలకొంది. సామజిక సమస్యల పై అవగాహనా ఉన్నవారికి సైతం ఎటువంటి పదవులు లేకపోవడంతో, ప్రభుత్వాన్ని నిలదీయలేని స్థితి. 

కేవలం రాష్ట్ర కమిటీ పదాధికారులు మాత్రమే టీవీల ముందు గానీ, మీడియా ముందుగానే మాట్లాడాలి అంటూ నిషేధం విధించడం తో రాష్ట్ర వ్యాప్తంగా

బీజేపీ క్యాడర్, నాయకుల నోళ్లు మూతపడ్డాయి. అనుమతి లేని వాళ్ళు ఎవరు మీడియా ముందు నోరెత్తినా తక్షణం వాళ్లపై బహిష్కరణ వేటు వెయ్యాలని పార్టీ అధిష్టానం తీర్మానించింది. 

రాష్ట్ర బీజేపీ కమిటీ ఏ విధమైన ప్రణాళికతో వెళ్తోందో ఎవరికీ తెలియని స్థితి. అయితే ఉద్యమాలు లేవు, ఉన్న ఉద్యమాల్లో కూడా నాయకులూ, క్యాడర్

పాల్గొనే పరిస్థితి లేకపోవడం తో పూర్తి గా బేలపోయింది. 

బొత్తిగా జనం లేకపోయినా గతంలో బీజేపీ తరపున కనీసం ఆ నలుగురు రోడ్డెక్కి నిరసన చెయ్యగలిగేవారు. ఇప్పుడు అధిష్టానం తీసుకున్న నిర్ణయం తో ఈ నలుగురు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు.

రాష్ట్రంలో  గుళ్లపై దాడులు జరిగినా, బలవంతపు మతమార్పిడి జరుగుతున్నా

నోరెత్తలేని పరిస్థితి పార్టీ నాయకులది. 

కనీసం పార్లమెంటరీ కమిటీ లకు సభ్యులను కూడా నియమించక పోవడంతో. . .  ఈ స్థితిలో పార్టీ వెంట విషయం పరిజ్ఞానం ఉన్న నాయకులూ, క్యాడర్ ఎన్ని రోజులు ఉంటారు అనేది అనుమానంగానే ఉంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam