DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దోపిడీ శాఖకు మారు పేరుగా ఏపీ దేవాదాయ శాఖ మారిపోయింది

*దోపిడీ దారుల కబంద హస్తాల్లో ఏపీ దేవాదాయ శాఖ భూములు* 

*ఒక్క నూజివీడు రఘునాధ గుడి లోనే 3600 ఎకరాలు కబ్జా. .*   

*మాజీ ఐఏఎస్ ఆవేదనతో వెలుగు లోకి ఎన్నో వాస్తవాలు* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 16, 2020  (డి ఎన్ ఎస్):* రాజకీయ, ప్రభుత్వ పాలకుల కబంద హస్తాల

పాల పడి ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ పూర్తిగా దేవాదాయ దోపిడీ శాఖగా మారిపోయింది అనే విషయాన్నీ విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి తెలియచేస్తున్నారు. కోట్లాది రూపాయలు విలువల చేసే లక్షలాది ప్రభుత్వ, దేవాదాయశాఖా భూములు ఆక్రమణ దారుల చేతుల్లో చిక్కుకుని వాటిని వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తి కంటే కూడా ఎక్కువగా అనుభవిస్తున్నారని

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదవీ విరమణ చేసిన ప్రముఖ ఐ ఏ ఎస్ అధికారి ఒకరు తెలిపారు.

   కొందరు అవినీతి అధికారులు,మరికొందరు రాజకీయ వేత్తల పలుకుబడితో భూ కబ్జా దారులు దర్జాగా, దౌర్జన్యంగా అక్రమించుకున్నారని వెల్లడించారు.ఇందుకు గ్రామకంఠాలు,బాలల క్రీడా వికాసం కోసం కేటాయించిన పార్కులు,అగ్నిప్రమాదాలు జరిగితే

నీటి నిల్వ అవసరానికి తవ్విన చెరువులు, (ఈ రెండు చోట్లా ఎంత భారీ కట్టడాలున్నా కూల్చేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది)  ఆఖరికి సముద్రపు అలలనుండి కాపాడే మడ అడవి భూములు  , ఇతర అవసరాలకు రిజర్వ్ లో ఉంచిన స్థలాలు దర్జాగా ఆక్రమించుకుని అనుభవించడం,అమ్ముకోవడం కూడా జరిగిందన్నారు.

ఇలాంటి దుశ్చర్యని చూస్తూ

కూడా పైనుండి అండదండలు ఉండటంతో కబ్జాదారులు మరింత విజృంభించారన్నారు.

ఇలాంటి అక్రమాలు అడ్డుకోవడం సాధ్యం కాదని ,పాలకులు అడ్డుకోమంటే ఎవరైనా విధి నిర్వహణ చేస్తారని,వారే చూసీ చూడ నట్లు పోమంటే ఏ అధికారి కూడా నిలవరించేందుకు ముందుకు రాలేరన్నారు.

    ఈ ఆక్రమణకు గురైన లేదా లీజుల పేరుతో తీసుకున్న

భూములు ఈ వ్యవస్థలో తిరిగి స్వాధీనం చేసుకోవటం అసాధ్యం అనుకున్న తనలాంటి అధికారులకు  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆక్రమణలు తొలగించి,అడ్డగోలు లీజులను రద్దుచేసి స్వాధీనం చేసుకోవటంతో చిత్తశుద్ధితో పాలన చేస్తే ప్రభుత్వం చేతులు చాలా పొడవు అనే విషయం రుజువు చేశారని హర్షం వ్యక్తం చేశారు.

తనలాంటి అధికారికి ఇలాంటి ప్రభుత్వంలో పని చేయకుండా రిటైర్ అయినందుకు కొంత విచారం ఉందన్నారు పేరు చెప్పటానికి ఇష్టపడని ఆ రిటైర్డ్ ఐ ఏ ఎస్ అధికారి.

   కోనేరు రంగారావు కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబానికి రెండెకరాల,ఇళ్ల స్థలం ఇవ్వగలిగే భూములు ఉన్నాయని నివేదిక

ఇచ్చారు.మరి అన్ని లక్షల భూములు ఏమైనాయో ఒక్కసారి దర్యాప్తు చేయించాలన్నారు.

ఇక లీజులని కూడా వేలాది తీర ప్రాంతం భూములు పొంది నిబంధనలు వీసమెత్తు కూడా అమలు చేయకుండా ఉన్నప్పటికీ, దేవాలయ భూములు కారుచౌకగా లీజుల పేరుతో వంశపారంపర్యంగా లీజుకూడా చెల్లించకుండా కొందరు దర్జాగా అనుభవిస్తున్నారని, ఒక్క కృష్ణా జిల్లా

లో నూజివీడు డివిజన్ గొల్లనపల్లి లోని శ్రీ రఘునాధస్వామి వారి ఆలయానికి చెందిన షుమారు 3వేల 600 ఎకరాల భూములు కొందరి చేతుల్లో చిక్కుపోయినట్లు 2006-2007 సంవత్సరంలో   ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ నాయకత్వంలో ప్రభుత్వం  ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ కనుక్కొంది. అయితే అక్రమణదారులు ఉన్నత న్యాయ స్థానాన్ని

ఆశ్రయించగా న్యాయస్థానం వాటిలో వేసే ఆయా పంటలను  నామమాత్రపు కౌలుగా నిర్ణయించినట్లు తెలిపారు.అయితే చిన్నా చితకా ఆలయానికి కౌలు ఇస్తున్నప్పటికీ, పలువురు బడా బాబులు ఆ నామ మాత్రపు కౌలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవని తెలుస్తోంది.అలాగే నూజివీడు డివిజన్లలోని మైలవరం ప్రాంతంలో షుమారు 25 వేల అటవీ భూముల కూడా ఆక్రమణలు

జరిగినట్లు ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ కనుక్కుని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.ఆగిరిపల్లి లోని శ్రీ శోభనాచలపతి  స్వామి వారి ఆలయానికి చెందిన షుమారు 15 ఎకరాలు ఊరిలోని స్థలాన్ని ఆక్రమించి ఆ ఆలయ మెట్ల మార్గానికి రెండువైపులా  పక్కా ఇళ్లు  నిర్మించుకున్నట్లు కూడా ఆ కమిటీ కనుక్కోంది. అయినా ఏమీ పురోగతి

లేదు.ఎవరి అక్రమించుకుంది వారిచేతుల్లోనే బిగిసిపోయిందని తెలుస్తోంది.

ఇక కొన్ని మత సంస్థలకి నామ మాత్రపు ధరకు ప్రభుత్వ భూములు  కేటాయించి, ఆ ప్రభుత్వ భూముల్లో వాణిద్య సముదాయాలు నిర్మించకూడదని నిభనలున్నాయి. అలాంటిది అన్ని నిబంధనలు తుంగలో తొక్కి వాణిద్య సముదాయాలు నిర్మించినప్పటికీ అడ్డు తగిలే

పరిపాలనా వ్యవస్థ ఉదాసీనత వలనే నిజాయితీ గలిగిన ఉద్యోగులు,అధికారుల చేతులు ముడుచుకు కోర్చోవాల్సి వస్తున్నదని వాపోయారు.

రౌతు తీరుని బట్టి గుర్రం పరిగెడుతుందని,ఆ రౌతే కళ్లెం వెనక్కి లాగితే ఇక ఎవరు మాత్రం ఏమిచెయ్య గలరని ప్రశ్నించారు.

ఏమైనా ఇప్పటికి సరైన రీతిలో స్పందించే నాయకుడు వై ఎస్ జగన్ మోహన్

రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఆయన నేతృత్వంలో అడ్డగోలు ఆక్రమణలు,లీజుల భూములను  తిరిగి స్వాధీనం చేసుకుండటం శుభ సూచకమని ఇలాంటి మహా యజ్ఞానికి  ప్రజల మద్దుతు  ఉండాలని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములు ఎక్కడ ఎన్ని సెంట్లు,అంగుళాలు ఎకరాల్లో ఉండాలో అనే విషయం ప్రపంచంలోనే ఎక్కడా

లేని రీతిలో ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పూర్తి సమాచారం పొంది, తిరిగి స్వాధీనం చేసుకుంటే భావి తరాలకు ఉపయోగపడే ప్రభుత్వ భూములు ఉండి, డబ్బులు చెల్లించి ప్రయివేటు భూములు కొనాల్సిన స్థితి ఉండదని సీనియర్ ప్రభుత్వ అధికారులు,ముఖ్యంగా రెవిన్యూ అధికారులు ఆశిస్తున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam