DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైద్యో నారాయణో హరి: కి అక్షర రూపం డాక్టర్ రాజబాబు.

*(DNS రిపోర్ట్ :  సత్య గణేష్ BVS , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, నవంబర్ 16, 2020  (డి ఎన్ ఎస్):* ఆక్యుపంచర్. . . వైవిధ్యమైన వైద్య ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా ఎన్నో రుగ్మతలకు పరిష్కారం లభిస్తుంది. ఈ రంగంలో సేవలు అందిస్తున్న పలువురు వైద్యులకు తగిన సమ్మానం చేయడం సంప్రదాయంగా వస్తోంది.  

  

విశాఖ లోని ఆరోగ్య దాయిని హెల్త్ కేర్ సెంటర్ ద్వారా ప్రాక్టీస్ చేస్తున్న డా. రాజబాబు, స్వతగా అల్లోపతి డాక్టర్ అయి ఉండి అనారోగ్య బాధితులకు మెరుగైన సేవలందించే ఉద్దేశముతో ప్రాచీన భారతీయ వైద్య విధానాలతో అనారోగ్య సమస్యలు,రుగ్మతలను,నయం చేసే ఆక్యుపంచర్ , ఎలాక్ట్రోహోమియోపతి,ఆయుర్వేద రంగాల్ని ఎంచుకొని

వాటిలో గత పది సంవత్సరాలనుండి ఇంగ్లీష్ మందులకు,ఆపరేషన్లకు లొంగని మొండి జబ్బులైన ( బి.పి,షుగరు, కిడ్ని,లివర్,పక్షవాతం,కాన్సర్ సొరియసిస్ ) లను సైతం తను ఎంచుకున్న ఆకుపంక్చర్, ఎలాక్ట్రోహోమియో మరియు ఆయుర్వేదం తో కొన్ని వేల మందికి ఆరోగ్యాన్ని అందిస్తూ 15 నవంబర్ 2019 లో అత్యుత్తమ ఆక్యుపంక్చర్ వైద్యుని అవార్డ్ మినిస్ట్రీ ఆఫ్

యూత్ ఎఫైర్స్ గవర్నమెంట్ అఫ్ ఇండియా పురష్కారాన్ని రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.యస్ నాగిరెడ్డి గారి చేతులు మీదుగా విజయవాడకు చెందిన ఇండియన్ ఓం సంస్థ ద్వారా అందుకున్నారు.                                                                       
అంతే కాకుండా తన వైద్యసేవలను

కోవిడ్19 చే బాధపడే అనారోగ్యవంతులకు కూడా వినియోగించి మెరుగైన వైద్యాన్ని అందించినందులకు 29.06.2020 న కోవిడ్ ఐకాన్ 2020 అవార్డ్ ను వరల్డ్ against కరప్షన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ వారి ద్వారా పొందారు.                

తన వైద్య సేవలను గుర్తించి ఈనెల నవంబర్ 15- 2020 న వరల్డ్ ఆకుపంక్చర్ డే ని పురస్కరించుకొని వైద్య రత్న

అవార్డ్ ని డా.మనోజ్ ఆనంద్ ఐ. ఏ. స్. పి.ఏ గారి చేతులమీదుగా ఇండియన్ ఓం హెల్త్ రీసెర్చ్ విజయవాడ వారి ఆధ్వర్యంలో జరిగింది, ఇందులో విశాఖపట్నం విశ్రాంతి మెరైన్ ఐ జి A. S. KHAN గారు, ఆగ్యత్యార్ మొదలైన వారు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam