DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగస్టు 3 నుంచి షీ కర లైఫ్ స్టైల్ ప్రదర్శన 2018

ఆగస్టు 3 నుంచి  à°·à±€ à°•à°° లైఫ్ స్టైల్ ప్రదర్శన 2018  
విశాఖపట్నం, జులై 18 , 2018 (DNS Online ): ఆగస్టు 3 నుంచి మూడు రోజుల పాటు విశాఖ సాగర తీరంలో అత్యద్భుతమైన మహిళా సాధికారిత వస్తు

ప్రదర్శన ను  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°Ÿà± కోవే ( కాన్ఫిడెరేషన్ ఆఫ్ విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ )- ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు అట్లూరి సుభాషిణి తెలిపారు. బుధవారం నగరంలోని

సంస్థ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ మహిళలు వ్యాపార రంగం లోకి ప్రవేశించి, తమ మేధాశక్తి ఉపయోగించి మరెందరికో ఉపాధి

కల్పించాలనే సంకల్పంతో మహిళా సాధికారిత ను పెంపొందిస్తున్నట్టు తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యవం లో ఎందరో మహిళకు వ్యాపార రంగాల్లో ప్రవేశించేలా ఆసక్తిని

కల్గించి, వారికి తగు మార్గనిర్దేశం చేస్తున్నట్టు తెలిపారు. చిన్న స్థాయి పెట్టుబడుల నుంచి భారీ వ్యాపార సంస్థల నిర్వహణ వరకూ చేపట్టవలసిన కార్యాచరణ, ప్రభుత్వ

రంగ సంస్థలతో సంప్రదింపులు, బ్యాంకు రుణాలలో సహకారం తదితర ప్రధాన అంశాలలో మహిళలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పడి వరకు తమ సంస్థ ఆధ్వర్యవం లో శిక్షణ పొందిన

మహిళలు చేపట్టిన కార్యాచరణ, వస్తు ఉత్పత్తులను ఈ వస్తు ప్రదర్శనలో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఆగస్టు 3 నుంచి మూడు రోజుల పాటు విశాఖ సాగర తీరం లోని వై ఎం సి ఏ

ప్రాంగణంలోని సింఫనీ మందిరంలో ఈ ప్రదర్శన సాగుతుందని తెలియచేసారు. ఈ ప్రదర్శనలో సుమారు 100 కు పైగా సంస్థలు వివిధ తరహాల ఉత్పత్తులతో కూడిన తమ వస్తు ప్రదర్శనను

చేపట్టనున్నట్టు తెలిపారు. మహిళను ప్రోత్సహించే విధంగా అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిందిగా కోరారు. ఈ

విలేకరుల సమావేశంలో విశాఖపట్నం కోవే అధ్యక్షురాలు గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా తమ సంస్థ మహిళకు పారిశ్రామిక అభివృద్ధి లో సహకారాన్ని

అందిస్తోందన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో గ్రామీణ ప్రాంతాల నుంచే కాక, మెట్రో నగరాల నుంచి కూడా మహిళలు పాల్గొంటున్నారని

తెలిపారు. ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించాలనుకునే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు 9703492872 నెంబర్లో సంప్రదించాలని కోరారు. సమావేశం లో కోవే విశాఖ కమిటీ

ప్రతినిధులు, వస్తు ప్రదర్శన కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

@ copy rights reserved

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam