DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నభూతో నభవిష్యత్ . . శ్రీరాముని ఏకోత్తర సహస్ర కలశ స్నపనం 

*విశ్వ శాంతి కోసం అద్భుతమైన వేడుక, : స్థలశాయి, భద్రాచలం*

*వైభవం గా సాగుతున్న చిన్న జీయర్ తిరునక్షత్ర వేడుకలు* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, నవంబర్ 18, 2020  (డి ఎన్ ఎస్):* ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పరమహంస పరివ్రాజకులు, అపర భగవద్రామానుజులు త్రిదండి చిన్న

జీయర్ స్వామి ఆశ్రమం లో శ్రీరామచంద్రునికి ఏకోత్తర సహస్ర (1001) కలశ స్నపన తిరుమంజన సేవ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో జరిగింది. దీపావళి పర్వదినోత్సవం రోజు చిన్న జీయర్ స్వామి తిరునక్షత్రం ( జన్మ దినోత్సవం) సందర్బంగా ప్రతి ఏటా వారి ఆరాధ్య పెరుమాళ్ శ్రీ సీతారామచంద్ర స్వామికి వెయ్యి ఒక్క కలశాలతో, వేదవిద్యార్థులు వేదపఠనం

చేస్తుండగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది శంషాబాద్ లోని  జీయర్ ఆశ్రమం లో బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలను చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షించగా, వారి శిష్యులు త్రిదండి అహోబిల జీయర్ స్వామి, త్రిదండి దేవనాధ జీయర్ స్వాములు నిర్వహించారు. దేశంలోని వివిధ పుణ్య నదీ జలాలు, తీర్ధాలను వెయ్యికి

పైగా కళాశాలతో నింపి, విశేష ఆరాధనలు చేసి, స్వామికి అభిషేకం నిర్వహించారు. 

విశ్వ శాంతి కోసం అద్భుతమైన వేడుక ఈ ఏకోత్తర సహస్ర స్నాపన కలశాభిషేకం జరుగుతోందని, భద్రాచల క్షేత్రం ఆధ్యాత్మిక పండితులు, శ్రీరామాలయ స్నానాచార్యులు , : స్థలశాయి వివరించారు. ఈ వేడుకకు పూర్వరంగాన్ని అయన వివరించారు. 

1997 లో

సీతానగరం (గుంటూరు జిల్లా) లో జీయర్ స్వామి తిరునక్షత్ర వేడుకలు జరుగుతున్న సందర్బంలో ఆరాధ్య పెరుమాళ్ళను కొందరు దొంగతనం జరిగిన ఘటన సందర్బంలో జీయర్ స్వామి మూడు రోజుల పాటు సంపూర్ణ ఉపవాసం ( కనీసం మంచి తీర్థం కూడా తీసుకోకుండా ) నిర్వహించినట్టు తెలిపారు. స్థానిక పొలిసు అధికారి కోటేశ్వర రావు జరిగిన ఘటన తెలుసుకుని, ఈ

పెరుమాళ్ళను తిరిగి ఆశ్రమానికి తీసుకు వచ్చే వరకూ తాము కూడా నిద్ర, ఆహారాలు మానివేస్తామని, దీక్ష పూనడం వారి భక్తి శ్రద్ధలకు నిదర్శనం అన్నారు. నాటి నుంచి నేటి వరకూ కోటేశ్వర రావు చేతుల మీదుగా ప్రతి కలిశను అందుకుని స్వామి అభిషేకం నిర్వహించడం జరుగుతోందన్నారు. 

ప్రస్తుతం కోవిడ్ నిబంధనల నేపథ్యంలో కేవలం ఆశ్రమ

విద్యార్థులు, బృందం, స్థానిక భక్తులు మాత్రమే ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam