DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ శివతేజుడు చిరంజీవే: విజెఎఫ్ అధ్యక్షులు  గంట్ల శ్రీనుబాబు

*విశిష్టంగా పైల శివతేజ జన్మదిన వేడుకలు*

*(DNS రిపోర్ట్ :  సత్య గణేష్ BVS , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, నవంబర్ 18, 2020  (డి ఎన్ ఎస్):* పైల శివతేజ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవల నేపథ్యంతో శివతేజ చిరంజీవిగా అందరి హృదయాల్లో నిలిచిపోయాడని, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,  వైజాగ్

జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు.  పైల శివతేజ 27వ జన్మదినాన్ని పురస్కరించుకుని, బుధవారం విశాఖ నగరంలో పలు కార్యక్రమాలను పైల శివతేజ పౌండేషన్  వ్యవస్థాపకులు, సీనియర్ పాత్రికేయులు పైల దివాకరరావు వైభవంగా నిర్వహించారు. 

గత కొన్నాళ్లుగా విద్య పరంగాను, సామాజిక పరంగానూ ఈ ఫౌండేషన్

చేపట్టిన కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. బుధవారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లో పలువురు అన్నార్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. ప్రేమ సమాజంలో వృద్ధులకు, మహిళలకు , చిన్నారులకు  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 

విశాఖ వన్ టౌన్ లోని వివేకానంద అనాధ వృద్దాశ్రమంలో జరిగిన వేడుకల్లో జాతీయ

జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,  వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు దీపారాధన చేసి, పెద్దలందరి సమక్షంలో  కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఆశ్రమం లోని వారికి దుప్పట్లు, వస్త్రాలు, మిఠాయిలు, పళ్ళు, పంపిణీ చేసి, అనంతరం అన్న ప్రసాదాన్ని అందించారు. 

ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం జాతీయ

కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ పైల శివతేజ పౌండేషన్ సేవలనుకొనియాడారు. ప్రతి ఏటా శివతేజ జన్మదినోత్సవాన్ని అందరికి ఆదర్శంగా వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 

అనంతరం శివ తేజ ఫౌండేషన్ ప్రతినిధి, పాత్రికేయులు దివాకర్ మాట్లాడుతూ రోడ్డు ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని, మరింత

జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తమ కుమారుడి పేరిట పాత్రికేయ కుటుంబాల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర సాంకేతిక విద్య అభ్యసించే వారికి ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నట్టు తెలిపారు. గత ఏడు సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అందులో భాగంగా పై కార్యక్రమాలు నిర్వహించినట్లు  తెలిపారు.
ఈ కార్య క్రమంలో

శివ తేజ కుటుంబ సభ్యులు రమణి, సామాజిక కార్యకర్త పీతల మూర్తి యాదవ్, శివతేజ మిత్రులు వినోద్, పృథ్వీ, నిఖిల్, సునీల్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam