DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తేజస్వీ పాదయాత్రతో ఓయూ లో వేడెక్కిన ఎన్నికల వాతావరణం

*ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ యువత మేధస్సు వెల్లువిరుస్తోంది : తేజస్వి*

*ప్రవేశాన్ని అడ్డుకోడంతో భారీ పాదయాత్రగా ఓయూ లోకి బిజెవైఎం చీఫ్* 

*అడ్డుకున్న పోలీసులు, గేట్లు దూకి లోనికి వెళ్లిన బీజేపీ క్యాడర్*  

*హైదరాబాద్ ఎన్నికలు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ

అధిష్టానం* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, హైదరాబాద్ )*  

*హైదరాబాద్ / విశాఖపట్నం, నవంబర్ 24, 2020  (డి ఎన్ ఎస్):* త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముందస్తుగా యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు బీజేవైఎం జాతీయ

అధ్యక్షుడు, బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య ను రంగంలోకి దించింది. సోమవారం నగరంలో ప్రచారంలో పాల్గొన్న ఆయన మంగళవారం ఉదయం కన్నడ సంఘం ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ మీట్ లో పాల్గొన్నారు. అనంతరం నేరుగా ఒస్మానియా విశ్వ విద్యాలయం లోకి వెళ్లారు.  అగ్రనేతల ప్రచారం తో జోరందుకున్న ఎన్నికల్లో తేజస్వి సూర్య రాకతో మరింత

తారాస్థాయికి చేరుకుంది. 
మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ లో ఒక సభలో పాల్గొనేందుకు బయలుదేరిన తేజస్వి ని అనుమతి లేదంటూ పోలీసులు వర్శిటీ లోని ఎన్ సిసి గేటు వద్దే నిలిపి వేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బీజేవైఎం, బీజేపీ శ్రేణులు గేట్లు దూకి మరి ఓయూ లోకి ప్రవేశించారు. కారులో వెళ్లేందుకు ప్రయత్నించినా దక్షిణ కర్ణాటక

ఎంపీ తేజస్వి సూర్య ను అడ్డుకోవడంతో కారు దిగి, నడుచుకుంటూ వెళ్లారు. దీంతో బీజేవైఎం కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెరిగి సాధారణ కార్ల లో వెళ్ళవలసిన కానవొయ్  భారీ పాదయాత్రగా మారిపోయింది. దీంతో పోలీసులు చేతులేశారు. 

ప్రపంచ వ్యాప్తంగా విద్య పరంగాను, ఉద్యోగ పరంగానూ తెలంగాణ యువత మేధస్సు వెల్లువిరుస్తోందని,

తేజస్వి సూర్య తెలిపారు. ప్రపంచ ఖ్యాతి గాంచి ఐటి సంస్థల్లో, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు వేలాదిగా ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. విద్య పరంగా జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తున్నవారిలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల విద్యార్థులు ముందు ఉన్నారన్నారు. 

ఈ ర్యాలీ లో భారీ శాఖలో బీజేవైఎం కార్యకర్తలు, ఓయూ

విద్యార్థులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam