DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మరో దాష్టీకానికి సిద్ధపడిన ఏపీ (అ) ధర్మాదాయ శాఖ సిద్ధం

తెలంగాణలో 208 ఎకరాల మంత్రాలయం భూములు వేలానికి రెడీ

భక్తులు ఇచ్చిన విరాళాలు అమ్ముకునే హక్కు ఎక్కడిది?

మఠం స్వాధీనం చేసుకున్నది ఆస్తులు అమ్ముకోడానికేనా? 

డిసెంబర్ 7 న జరిగే వేలాన్ని ఆపాల్సిందే. . .ధార్మిక సంఘాలు

ఏపీ బీజేపీ రాష్త్ర కమిటీ సభ్యులు డా. కెవివి సత్యనారాయణ

మండిపాటు 

విశాఖపట్నం నవంబర్ 26 2020 (డి ఎన్ ఎస్ ): కేవలం హిందూ ధర్మానికి సంబంధించిన సంస్థలు ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నది అనడానికి మరొక ప్రత్యక్ష నిదర్శనం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ఆస్తుల అమ్మకం అని ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్త్ర కమిటీ సభ్యులు డా. కెవివి సత్యనారాయణ

మండిపడ్డారు. వందల ఏళ్ళ చరిత్ర కల్గిన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నిర్వహణ కోసం ఎందరో భక్తులు, దాతలు భూరి విరాళాలను ఇచ్చారన్నారు. వాటితోనే మఠం నిర్వహణ జరుగుతుందన్నారు. హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థలను దోచుకోవడమే పని గా పెట్టుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖా కొంచెం ఆదాయం వచ్చే ఆలయాలు, మతాలను స్వాధీనం చేసుకుని,

ఆస్తులు ఆమ్ముకుంటోందన్నారు. అదే విధంగా కర్నూలు జిల్లా మంత్రాలయం లోని ప్రసిద్ధ శ్రీ రాఘవేంద్ర స్వామి మతాన్ని కూడా గతం లో స్వాధీనం చేసుకుందన్నారు. దీని నిర్వహణ భారంగా ఉండనే నెపంతో ఆలయానికి దాతలు ఇచ్చిన భూములను వేళవేసేందుకు అధికారిక ప్రకటన విడుదల చేసిందన్నారు. దీనిలో భాగంగానే తెలంగాణాలోని 208 ఎకరాల వ్యవసాయ భూములను,

అమ్మెందుకు టెండర్లు పిలిచిందన్నారు. డిసెంబర్ 7 ,8 తేదీల్లో జరిగే ఈ వేలాన్ని తక్షణం నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేసారు. 

తెలంగాణలో ఉన్నజో. గద్వాల్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ భూములను డిసెంబరు ఏడో తారీఖు నుంచి వేలం వేసేందుకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది దీనిపై హిందూ సమాజం భగ్గుమంటోంది హిందూ

దేవాలయాలపై దాడులు జరిగితే ప్రభుత్వం ఆస్తులు మాత్రం తగుదునమ్మా అని ముందుకు వచ్చిందని మండిపడుతున్నాయి.

చేతగానప్పుడు ఎందుకు స్వాధీనం చేసుకున్నారు?. .. 

మఠానికి పెద్దగా ఆదాయం లేదని, పైగా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నా ఆస్తులను కాపాడలేమని, అందువల్ల వీటిని అమ్మేస్తున్నట్టు దేవాదాయ శాఖా చెప్పడం సిగ్గు

చేటని సత్యనారాయణ మండిపడ్డారు. సంస్థను నిర్వహించడం చేతగానప్పుడు మంత్రాలయం మఠాన్ని ఎందుకు స్వాధీనం చేసుకున్నారని ప్రశ్నించారు. 

ఆలయాలకు సంస్థ ఆస్తులకు ఏమాత్రం రక్షణ కనిపించ లేకుండా పూర్తి నిర్లక్ష్యం వహించిన దేవాదాయశాఖ నేడు వేలకోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను అమ్ముకునేందుకు బహిరంగ ప్రకటన విడుదల

చేసిందని హిందూ ధార్మిక సంఘాలు సైతం మండిపడుతున్నాయి. 
 కేవలం హైదరాబాద్ ప్రాంతంలోనే ఉండడంతో మెట్రో నగరంలో సాధారణ భూమి విలువలు అధికంగా ఉండడంతో వీటి విలువ భారీగానే ఉంది ప్రస్తుతం హైదరాబాద్ నగర స్థానిక ఎన్నికలు జరుగుతున్న డంతో దీనిపై ఎవరు దృష్టి సారించాలని నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ ఈ బహిరంగ

వేలం కి తెరలేపింది అయితే ధార్మిక సంఘాలు హిందూ భక్త సమాజం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. మఠ నిర్వహణ కోసం అం   భక్తులు ఇచ్చిన ఆస్తులను ప్రభుత్వం ఎలా అందుకుంటుందని మండిపడుతున్నారు వీటిని కేవలం అనుభవించడానికి తప్పా అమ్ముకోవడానికి అవకాశం లేదని హెచ్చరిస్తున్నారు దాతలు ఇచ్చిన ఆస్తులను ఆలయ పరిధిలోని పరిమితుల్లోనే

ఉంచాలి తప్ప అమ్ము కూడా ఏంటనే ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్న డంతో హిందూ సమాజం ప్రజలు అందరూ ఆ హడావిడిలో ఉంటారనే ఉద్దేశంతో ఎవరో దీన్ని ప్రశ్నించారని దృఢ సంకల్పంతో హడావిడిగా ఈ ప్రకటన విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి శాఖలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను ఏమని పైగా దాని

నిర్వహణకు అధికంగా ఖర్చు అవుతుందని ప్రకటిస్తోంది అంత పగ నిర్వహించ లేనప్పుడు హిందూ సంస్థలను దేవాదాయ శాఖ ఎందుకు స్వాధీనం చేసుకుంటుందని ప్రశ్నిస్తున్నాయి. కేవలం హిందూ ధార్మిక సంఘాలను మాత్రమే దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుని ఆస్తులు అమ్ముకుని ప్రభుత్వ కార్యాచరణకు నిధులు సమకూర్చుకోవడం క్షమించరాని నేరం

మండిపడుతున్నాయి దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు ప్రజా ప్రతినిధులు కేవలం తమ పరిధిలో ఉండాలని ధార్మిక విషయాల్లో మితిమీరిన జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి కేవలం హిందూ సంస్థలు మాత్రమే కనబడుతున్నాయి ఇతర మతాల సంస్థలకు లక్షల కోట్లు ఆస్తులు ఉన్నా,

వాటి జోలికి వెళ్ళే సాహసం చెయ్యడం లేదన్నారు.
ఇది పూర్తిగా హిందూ ధర్మం పట్ల జరుగుతున్న భారీ కుట్ర అని మండిపడుతున్నాయి.

డిసెంబర్ 7 న వేలం వేయనున్నఆస్తుల వివరాలివే: . .

1  అల్వాల్ పాడు గ్రామం, థరూర్ మండలం, జో. గద్వాల్ జిల్లా ( తెలంగాణ) లో  1 .15 ఎకరాలు (మెట్ట), 
2  అల్వాల్ పాడు గ్రామం, థరూర్ మండలం, జో.

గద్వాల్ జిల్లా ( తెలంగాణ) లో  1 .12 ఎకరాలు (మెట్ట), 
3  అడవిరావుల చెరువు గ్రామం, మట్ట కల్ మండలం, జో. గద్వాల్ జిల్లా ( తెలంగాణ) లో  4 .09 ఎకరాలు (మెట్ట), 
4  అయిజ గ్రామం, అయిజ మండలం, జో. గద్వాల్ జిల్లా ( తెలంగాణ) లో  22.05 ఎకరాలు (మెట్ట), 
5  అయిజ గ్రామం, అయిజ మండలం, జో. గద్వాల్ జిల్లా ( తెలంగాణ) లో  28.18 ఎకరాలు (మెట్ట), 
6

 పైపాడు గ్రామం, వడ్డేపల్లి మండలం, జో. గద్వాల్ జిల్లా ( తెలంగాణ) లో  20.22 ఎకరాలు (మెట్ట), 
7  ఏ. బూడిద పాడు గ్రామం, ఉండవల్లి మండలం, జో. గద్వాల్ జిల్లా ( తెలంగాణ) లో  10.13 ఎకరాలు (మెట్ట), 
8 తనగల గ్రామం, వడ్డేపల్లి మండలం, జో. గద్వాల్ జిల్లా ( తెలంగాణ) లో  18.05 ఎకరాలు (మెట్ట), 
9 తనగల గ్రామం, వడ్డేపల్లి మండలం, జో. గద్వాల్ జిల్లా (

తెలంగాణ) లో  24.29 ఎకరాలు (మెట్ట), 
10 జూలకల్ గ్రామం, వడ్డేపల్లి మండలం, జో. గద్వాల్ జిల్లా ( తెలంగాణ) లో  23.17 ఎకరాలు (మెట్ట), 
11 రామాపురం గ్రామం, వడ్డేపల్లి మండలం, జో. గద్వాల్ జిల్లా ( తెలంగాణ) లో  11.25 ఎకరాలు (మెట్ట), 
12 రామాపురం గ్రామం, వడ్డేపల్లి మండలం, జో. గద్వాల్ జిల్లా ( తెలంగాణ) లో  12.10 ఎకరాలు (మెట్ట),
13 రామాపురం గ్రామం,

వడ్డేపల్లి మండలం, జో. గద్వాల్ జిల్లా ( తెలంగాణ) లో  2.14 ఎకరాలు (మెట్ట),
14 తుమ్మెల్ల గ్రామం, రాజోలి మండలం, జో. గద్వాల్ జిల్లా ( తెలంగాణ) లో  06.11 ఎకరాలు (మెట్ట),
15 తుమ్మెల్ల గ్రామం, రాజోలి మండలం, జో. గద్వాల్ జిల్లా ( తెలంగాణ) లో  12.22 ఎకరాలు (మెట్ట),

మొత్తం 208 .51 ఎకరాలు వ్యవసాయ భూమి వేలంలో ప్రకటించబడింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam