DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగనన్న తోడు కాదు - జగనన్న కబ్జా పధకం, మాజీ ఎంపీ మండిపాటు

*కేంద్రప్రభుత్వ పధకానికి రంగులు మార్చి కబ్జా. .*

ప్రచార ఆర్భాటం తో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా 

*వడ్డీతో సహా చెల్లించాల్సిన అప్పుకి ఇంత హంగామానా?*

*టిడిపి మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మండిపాటు.*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 26, 2020

 (డి ఎన్ ఎస్):* చిరు కార్మికుల 'గోడు' పట్టకుండా తలతిక్క విధివిధానాలు జగనన్న తోడు పేరుతో మొదలు పెట్టింది జగనన్న కబ్జా పధకం అని నర్సాపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేయడం తప్ప... పథకం అమలు, లబ్దిదారులకు మేలు చేయడంపై ఏమాత్రం

చిత్తశుద్ధి కనిపించడం లేదన్నారు.

రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించే 'పూచీ' మాత్రం నాది కాదు అంటూ తప్పించుకుంటోంది. వాస్తవానికి బ్యాంకుల నుండి ప్రజలకు ఇచ్చే రుణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వాలన్నారు. కానీ ఇక్కడ హామీ ఇవ్వకుండా రుణాలిచ్చేయండి అంటూ లబ్దిదారులకు సూచించడం ప్రజల్ని

వంచించడమే పైగా, తాము సూచించినవారికి సాయం చేయాల్సిందేనని బ్యాంకులపై ఒత్తిడిచేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి పేరుతో వీధి వ్యాపారులకు ఇచ్చే రూ.10వేల రుణానికి సంబంధించి బ్యాంకు క్లియర్ చేసే ప్రతి దరఖాస్తుకూ కేంద్రం పూచీ ఉంటోందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడం రిజర్వు

బ్యాంకుకు ఫిర్యాదు వెళ్తే జగనన్న తోడుకు రరుణాలిచ్చే అవకాశమే లేదనే వాదన కూడా వినిపిస్తోంది జగనన్న తోడు' పేరుతో హడావుడి చేస్తూ వేల మందికి ఒకేసారి రుణ అర్హత పత్రాలు మంజూరుకు ఏర్పాట్లు చేశారు. ఆ పత్రాలు తీసుకెళ్తే బ్యాంకులు రుణాలిస్తాయని చెప్తున్నారు. కానీ పూచీకత్తు విషయాన్ని మాత్రం కావాలనే

విస్మరిస్తున్నారు.ప్రభుత్వ విధానం చూస్తుంటే రుణాల పేరుతో ఏవో మంజూరు పత్రాలిచ్చి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది మేం మంజూరు చేశాం, బ్యాంకులు ఇవ్వడం లేదన్నారు. 
వాటిని కూడా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని వారి వైఫల్యాన్ని, చిత్తశుద్ధి లేని పనితీరును ప్రతిపక్షంపై

నెట్టేయాలనుకుంటున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి పత్రాలు పొందిన ప్రతి ఒక్కరికీ బ్యాంకు రుణాలివ్వాలంటే దాదాపు పదేళ్లు పడుతుందని పలువురు బ్యాంకర్లు చెబుతున్నారు చిరు వ్యాపారులకు రుణాలిస్తున్నారని ప్రకటిస్తూ వలంటీర్లు అనరులతో సైతం దరఖాస్తులు పెట్టిస్తున్నారు అందులోనూ వైసీపీ కార్యకర్తలే ఎక్కువ

సంఖ్యలో ఉన్నారు కేంద్ర, రాష్ట్ర పథకాలకు ఒకేసారి దరఖాస్తు చేసుకుంటున్న ఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి ఇదే సమయంలో ముందు మంజూరు చేయండి, నగదు లబ్ధిదారుల ఖాతాల్లో ఎప్పుడైనా వేయొచ్చని బ్యాంకులతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటున్నారు.రూపాయి మంజూరు చేయకపోయినా వందల కోట్ల రుణాలు మంజూరు చేశామని లెక్కలు చెప్పుకోవడం కోసం

అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.పథకాల అమలు విషయంలో భారీ ప్రచారాలు చేస్తున్న జగన్ రెడ్డి - తోడు కార్యక్రమానికి ఏడాదిన్నరగా ఎందుకు అమలు చేయకుండా ఎందుకు కాలయాపన చేశారో సమాధానం చెప్పాలి.కేంద్రం ఇస్తున్న నిధులకు అధనంగా రూపాయి కూడా చేర్చకపోగా అంతా తామే చేస్తున్నట్లు వైసీపీ ప్రచారం చేసుకోవడం అత్యతంత

హేయం.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు :
దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇలాంటి పథకం అమలులో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా దాదాపు 10 లక్షల మంది లబ్ది పొందారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకానికి జగన్మోహన్ రెడ్డి తన స్టిక్కర్ అతికించుకుని స్టిక్కర్ సీఎం అనే

వ్యాఖ్యను నిజం చేశారు. చెప్పేదొకటి - చేసేదొకటి అనేలా జగన్ రెడ్డి ప్రతి హామీని తుంగలో తొక్కుతూ ప్రజల్ని వంచిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం గత ఆరేడు నెలలుగా అమలు చేసి ఆర్థిక సాయం అందిస్తున్న పథకాన్ని తాము అమలు
చేస్తున్నట్లుగా జగన్ రెడ్డి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు.రుణాల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక విషయంలోనూ

రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడడం దుర్మార్గం.
రుణాలిస్తామంటున్న ప్రభుత్వం ఆ రుణాలను తిరిగి చెల్లించే విషయంలో ఎందుకు ష్యూరిటీ ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలి.పేదలకు అందించే ప్రభుత్వ పథకాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు వార్తలు ప్రచురించడం, తప్పుడు లెక్కలు చెప్పడం అత్యంత దారుణం.జగన్ రెడ్డి మాటలకు, చేతలకు

సంబంధం ఉండదని తాజా ఘటనలు మరోసారి పునరావృతం చేస్తునాయి.
కేంద్రం పీఎం స్వనిధి పథకాన్ని ప్రకటించడానికి ముందే తోడు కార్యక్రమాన్ని ప్రకటించిన జగన్ రెడ్డి రాష్ర ప్రభుత్వం నుండి రూపాయి కూడా చెల్లించకుండా కేంద్రం ఇచ్చే సొమ్మును మాత్రమే బదిలీ చేస్తున్నారు.జగన్ రెడ్డి మోసపూరిత ప్రకటనలు, అశ్వద్ధామ అథ: అనే రీతిలో పథకాల

అమలు వారి మోసపూరిత విధానాలకు ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
2)తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డీఆర్‌సీ సమావేశంలో మాజీ  హోం మంత్రి,  నిమ్మకాయల చినరాజప్ప, రాజ్యసభ సభ్యుడు, పిల్లి సుభాస్ చంద్రబోస్‌లను దూషించి వారి పట్ల దౌర్జన్యకరంగా వ్యవహారించి అవమానించిన కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి

వారికి తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam