DNS Media | Latest News, Breaking News And Update In Telugu

27 అంశాలతో సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ భేటీ

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 27, 2020  (డి ఎన్ ఎస్):* నివార్ తీవ్ర తుపాన్ వల్ల జరిగిన నష్టం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం ఏ మేరకు జరిగిందో రాష్ట్ర ప్రభుత్వ కేబినేట్ లో చర్చ జరిగింది. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చర్చకు వచ్చిన

అంశాలు. 

30.20 లక్షల మందికి 22.57 డి పట్టాలతో కలిపి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి ఆమోదం తెలపనున్న కేబినేట్..

డిసెంబర్ 25న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి..

28.30లక్షల ఇళ్లు నిర్మాణానికి ప్రొపోజల్స్ పై కేబినేట్ లో చర్చ..

వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ లే అవుట్ లకు ఆమోదముద్ర పడే

అవకాశం..

వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్షణ పధకం (రీ సర్వే ప్రాజెక్ట్ ) కు ఆమెద ముద్ర వేయనున్న కేబినేట్..డిసెంబర్ 21న ప్రారంభం కానున్న కార్యక్రమం..

ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరర్ ల్యాండ్ ఆర్డినెన్స్ 2020 సవరణ బిల్లుకు ఆమోదం తెలపనున్న కేబినేట్.. 

ఏపి రెసిడెన్సియల్ డిగ్రీ కాలేజ్ ప్లే

గ్రౌండ్, స్టాఫ్ క్వార్టర్స్, కాలేజి బిల్డింగ్ ల నిర్మాణానికి మాచర్లలో భూములు కేటాయింపు..

99 సంవత్సరాలు లీజ్ కు కేటాయించనున్న కేబినేట్..

ఖరీఫ్ 2019 ఉచిత పంటల భీమా సదుపాయం కల్పనకు కేబినేట్ ఆమోదముద్ర వేసే అవకాశం..

గొర్రెలు, మేకల పంపిణి స్కీం కు ఆమోదముద్ర వేయనున్న కేబినేట్..

డిసెంబర్ 8న

ప్రారంభించునున్న ముఖ్యమంత్రి..

ఏపి స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్ ఫర్ ఎనాట్ మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యానిమల్ పీడ్ బిల్ 2020 కు ఆమోదముంద్ర తెలిపే అవకాశం..

అనంతపురం జిల్లా పెనుగొండలో గొర్రెల పెంపకం శిక్షణ సెంటర్ ఏర్పాటుకు 2కోట్ల 50లక్షలు కేటాయిస్తూ కేబినేట్ లో ఆమోదం తెలిపే అవకాశం..

ఆంధ్రప్రదేశ్

మత్య్స విశ్వవిద్యాలయం చట్టం 2020 కు ఆమోదముంద్ర వేసే అవకాశం..

రాష్ట్రంలోని డ్యామ్ రిహాబిలిటేషన్, ప్రాజెక్ట్ ఇంప్రూవ్ మెంట్ కు ఫేజ్-2 ఫేజ్-3 కింద 776.50 కోట్లకు ర్యాటిఫికేషన్ ఇవ్వనున్న కేబినేట్.. 

టూరిజం డిపార్ట్ మెంట్ కు, వివిధ ప్రాజెక్ట్ ల అభివృద్ది కోసం 142 కోట్ల రూపాయలను అప్పు తెచ్చుకునేందుకు కేబినేట్

లో ఆమోదం తెలిపే అవకాశం..

ఏపిలో మున్సిపల్ చట్టంలో మార్పులు, చేర్పులు చేస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ కు ఆమోదముద్ర వేయనున్న ఏపి కేబినేట్..

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam