DNS Media | Latest News, Breaking News And Update In Telugu

40 ఏళ్ళల్లో ఇలాంటి ఫేక్ సీఎం లను చూడలేదు: చంద్రబాబు 

*అసెంబ్లీ లాబీ లో బైఠాయింపు, టిడిపి సభ్యులు సస్పెన్షన్*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 30, 2020  (డి ఎన్ ఎస్):* 40 రాజకీయ జీవితంలో ఎంతో మంది సీఎంలను చూశానని కాని ఇలాంటి ఫేక్ సీఎంను ఇప్పుడే చూస్తున్నానని టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు అగ్గిమీగా గుగ్గిలం అయ్యారు. ఒక దశలో అసెంబ్లీ లాబీ లో స్వయంగా బైఠాయింపు చేసారు. దీంతో స్పీకర్ టిడిపి సభ్యులను ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేసారు. సభ నాయకుడే గాడి తప్పితే. . సభ్యులు ఇంకెలా ఉంటారన్నారు. అసెంబ్లీ సమావేశాలకు సీఎం ఆలస్యంగా రావడంతో, ఆయన రాకుంటే సమావేశాలను ప్రారంభించరా

అని ప్రశ్నించారు. ఏడాదిన్నరలో 20 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని అంచనా  వేశామని.. ప్రభుత్వం సమాధానం చెప్పకుండా గాలి కబుర్లు చెబుతోందని ఎద్దేవా చేశారు. సాక్షి టీవీ ఒక్కటి పెట్టుకొని మీరు ప్రచారం చేసుకుంటారా? ప్రజలకు నిజాలను చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అడిగారు. మీడియాను భయబ్రాంతులకు గురిచేస్తారా?

ఇదేం ప్రజాస్వామ్యం అని చంద్రబాబు అన్నారు. కోర్టులు చెప్పినా లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  

చంద్రబాబు సహా తెదేపా సభ్యుల సస్పెన్షన్ : . 

సభనుంచి ఒక రోజు సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులు వీరే. . .

*చంద్రబాబునాయుడు
*అచ్చెన్నాయుడు
*గోరంట్ల బుచ్చయ్య చౌదరి
*పయ్యావుల

కేశవ్
*నిమ్మల రామానాయుడు
*ఏలూరిసాంబశివరావు
*బెందాళం అశోక్
*జోగేశ్వరరావు
*అనగాని సత్యప్రసాద్
*మంతెన రామరాజు
*బాల వీరాంజనేయస్వామి
*వెలగపూడి రామకృష్ణబాబు
*ఆదిరెడ్డి భవానీ

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam