DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టీఆరెస్ ను గెలిపించేందుకు ఎస్ఈసీ బరితెగించారు: . .. 

*అర్ధరాత్రి తెలంగాణ ఈసీ ఆకస్మిక సర్క్యూలర్ జారీ. .*

*తెలంగాణ ఎన్నికల కమిషనర్ పై బీజేపీ మండిపాటు*

*స్వస్తిక్ తో పాటు, ఏ మార్కు పెట్టినా లెక్కిస్తారా?*

*17 ఏళ్ళ కుర్రాడికి పోలింగ్ అధికారిగా పోస్టింగా?*

*అర్ధరాత్రి 12  గంటల ప్రెస్ మీట్ లో బండి సంజయ్ సంచలన ప్రకటన.*

*(DNS

రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 03, 2020  (డి ఎన్ ఎస్):*  తెలంగాణ ఎన్నికల కమిషనర్ అధికార పార్టీని గెలిపించుకునేందుకు బరితెగించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల (తెల్లవారితే శుక్రవారం) కు జూమ్

ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారధి వైఖరి పై మండిపడ్డారు. 
మరో 10 గంటల్లో ఎన్నికల కౌంటింగ్ మొదలవుతుందనగా  అర్ధరాత్రి ఆకస్మిక ప్రత్యేక సర్క్యూలర్ విడుదల చేసి, ఎన్నికల బ్యాలెట్ లో స్వస్తిక్ గుర్తు తో పాటు మారె ఇతర గుర్తులు పెట్టినా లెక్కింపులు జరపాలని ఆదేశాలు జారీ

చేశారన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో జరిగిన సమావేశం లో కేవలం స్వస్తిక్ మార్కు ను మాత్రమే అంగీకరించి, రాత్రికి రాత్రి అధికార పార్టీకి అనుకూలంగా ఆదేశాలు జారీచేశారన్నారు. పెన్ను తో గుర్తులు వేసినా చెల్లుతుందన్నారు. 
ఎన్నికల నిర్వహణ లో అన్ని తప్పులు తడకలు గానే జరిగిందని, కనీసం ఓటు హక్కు వయసు కూడా లేని 17 ఏళ్ళ

కుర్రాడికి పోలింగ్ అధికారిగా పోస్టింగ్ ఇవ్వడాన్ని పట్టుకోవడం జరిగిందన్నారు. 
కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసే సమయం కూడా లేకుండా, అర్ధరాత్రి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసిందన్నారు. ఎన్నికల పోలింగ్ ఎంత జరిగింది అనే విషయాన్ని కూడా అర్ధరాత్రి వరకూ ప్రకటించాక పోడాన్ని ప్రశ్నించారు. ఎన్నికల తేదీ డిసెంబర్ 1 న

సాయంత్రం 5 వరకూ అతి తక్కువ పోలింగ్ (30 శతం కంటే తక్కువ)  జరిగిందని, అయితే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోగా భారీ పోలింగ్ శాతం ఎలా జరిగిందన్నారు. 

ఎన్నికల కమిషనర్ పార్ధసారధి, అధికారులు, అధికార పార్టీకి దాసోహమైపోయి, ఉద్యోగ ధర్మానికి ద్రోహం చేశారన్నారు. దీనిపై తాము న్యాయస్థానం లో పోరాడతామన్నారు. చట్ట ప్రకారం

ఎన్నికల విధానాన్ని విచారణ జరపాలని డిమాండ్ చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam