DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పై సీఎం జగన్‌ సమీక్ష

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 07, 2020  (డి ఎన్ ఎస్):*  డిసెంబర్‌ 25 నుంచి జనవరి 7 వరకూ కొనసాగనున్న కార్యక్రమం చెయ్యాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. సోమవారం ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

జరిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు.  
మొత్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు: . . 
3,65,987 ఇళ్లస్థలాలపై కోర్టు కేసులు ఉన్నాయని, ఇళ్ల స్థలాల కోసం 68,361 ఎకరాల సేకరణ జరిగిందన్నారు. సమీక్షలో చోటు చేసుకున్న అంశాలు

ఇవే. . 

రూ.23,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాల పంపిణీ : . .
కోర్టు కేసులు కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేక పోతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి, కేసులు పరిష్కారం కాగానే పట్టా ఇస్తామంటూ లేఖ ఇవ్వాలని నిర్ణయం
వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక
పట్టాలు ఇచ్చిన ప్రాంతాల్లో

డిసెంబర్‌ 25నే 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం
175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 8,914 ఇళ్లు చొప్పున పనులు ప్రారంభం
8,838 కొత్త లే అవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణం 
రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం
టిడ్కో ఇళ్లలో 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లపై సీఎం ప్రకటించిన తాజా రాయితీల ప్రకారం అదనంగా రూ.482 కోట్ల ఖర్చును భరించనున్న

ప్రభుత్వం
300 చదరపు అడుగుల ఫ్లాట్‌లను కేవలం రూ.1 రూపాయికే ఇవ్వనున్న ప్రభుత్వం 

కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని, న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. 
లబ్ధిదారులు ఎలా కావాలంటే.. అలా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. 
1. లబ్ధిదారులు ఇళ్లు కట్టించి

ఇవ్వమంటే.. ఇళ్లు కట్టించి ఇస్తాం.
2. మెటీరియల్‌ ఇవ్వండి, లేబర్‌ కాంపొనెంట్‌కు సంబంధించి డబ్బు ఇవ్వండి అంటే అది చేస్తాం.
3. లేదు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తాం, ఇళ్లు లబ్ధిదారుడు కట్టుకోవచ్చు.
ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందు కెళ్లాలన్న చెప్పారు.
ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన

తర్వాత శరవేగంతో పనులు సాగాలన్నారు.
దీని కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలన్నారు.
ఇళ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యమని స్పష్టం చేసారూ. 

ప్రతి లేఅవుట్‌ను ఒక యూనిట్‌గా తీసుకోవాలని  అధికారులకు సీఎం సూచన 
ఆ లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సెంట్రింగ్‌ వంటి పనులకు అవసరమైన

సామాగ్రిని అక్కడే సిద్ధం చేసుకోండి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది, ఇళ్లనిర్మాణం చురుగ్గా ముందుకు సాగుతుందన్నారు.

ఇటీవల వర్షాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా లే అవుట్లలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన విధంగా డ్రైయిన్లు నిర్మాణం, ఇతరత్రా చర్యలు తీసుకోవాలన్నారు.లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ

అసౌకర్యం లేకుండా, సమస్యలు లేకుండా చూడాలన్నారు. ప్రతి లే అవుట్‌పైనా సమగ్ర పరిశీలన, అధ్యయనం చేయాలని సీఎం ఆదేశం. మనం కట్టేవి ఇళ్లు కావు, ఊళ్లన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి: సీఎం
ఏ పని చేసినా కాలనీల అందాన్ని పెంచేలా చూడాలన్నారు.
వీధి లైట్ల దగ్గర నుంచి అక్కడ ఏర్పాటు చేసే ప్రతి సదుపాయంపైనా దృష్టి పెట్టాలి: సీఎం
/> ప్రతి లే అవుట్‌లో నమూనా ఇంటిని (మోడల్‌ హౌజ్‌) నిర్మించాలని సూచించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam