DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పగో జిల్లా నేర దర్యాప్తు లో జాగ్రత్తలపై డిఐజి అవగాహన 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 10, 2020  (డి ఎన్ ఎస్):* ఆధునిక సమాజంలో జరుగుతున్న నేరాలపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న పోలీసు వ్యవస్థలో మెరుగైన వృత్తి నైపుణ్య అభివృద్ధి కొరకు పోలీసుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచుకునే నిమిత్తము గా

ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం అర్బన్, పశ్చిమగోదావరి జిల్లా మరియు కృష్ణా జిల్లాల యొక్క సిబ్బందితో ఏలూరు రేంజ్ డ్యూటీ మీట్ ను ఏలూరు రేంజ్ ఏలూరు డీఐజీ కెవి మోహన్ రావు మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ్ నాయక్ యొక్క ఆదేశాలపై పశ్చిమ గోదావరి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఏవి

సుబ్బరాజు గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నాలుగు జిల్లాల పోలీసు అధికారులతో డ్యూటీ మీట్ ను ప్రారంభించినారు. 
ఈ సందర్భంగా అదనపు ఎస్పి అడ్మిన్ గారు మాట్లాడుతూ డ్యూటీ మీటింగ్ నందు పోలీస్ సిబ్బంది కి కోవిడ్- 19 నియమ నిబంధనలు అమలు చేస్తూ సిబ్బంది అందరికీ కోవిడ్ టెస్ట్ లు

నిర్వహించినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది  తమ యొక్క వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించి మరియు దర్యాప్తు సమయాలలో వ్యవహరించవలసిన మెళుకువలను గురించి ఇటువంటి డ్యూటీ మీట్ ల వలన ఉపయోగపడదని, అలాగే జిల్లాల మధ్య ఉన్న సిబ్బందికి వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక ప్లాట్ఫాం గా ఉపయోగపడుతుందని వివరించారు. డ్యూటీ

మీట్ లో పోలీస్ సిబ్బందికి నేర దర్యాప్తు సమయంలో నిర్వహించే ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, లా అండ్ ఆర్డర్, ఇండియన్ పీనల్ కోడ్, సి ఆర్ పి సి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, స్పెషల్ అండ్ లోకల్ చట్టాల పైన, హ్యాండ్లింగ్, లిఫ్టింగ్ మరియు ప్యాకింగ్ అనే విషయాల పైన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విషయాలపై, బాంబు

డిస్పోజల్ స్క్వాడ్, పోలీస్ జాగిలాల యొక్క ఉత్తమ పనితీరును పరీక్షించుట కొరకు ఈ యొక్క డ్యూటీ మీట్ లో పోటీలు నిర్వహిస్తామని, ఈ పోటీలలో నైపుణ్యం ప్రదర్శించినటువంటి సిబ్బందికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ కు సిఫార్సు చేస్తామని, ఈ డ్యూటీ మీట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి సిబ్బందికి ప్రోత్సాహక బహుమతులను

మరియు సర్టిఫికెట్లు ఏలూరు రేంజ్ డీఐజీ గారి చేతులపై  అందజేస్తామని ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా అదనపు ఎస్పి అడ్మిన్ గారు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో  ఏ.అర్.అదనపు ఎస్పి ఎం మహేష్ కుమార్, డి.టి.సి డిఎస్పీ కె.ప్రభాకరరావు, సిసిఎస్ డిఎస్పి జి వి ఎస్ పైడే శ్వరారవు, మచిలీపట్నం దిశా డి.ఎస్.పి అబ్దుల్ అజీజ్,

రాజమహేంద్రవరం దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పి తిరుమల రావు,  డిఎస్పి కాకినాడ బి. అప్పారావు, ఏ.అర్ డిఎస్పీ కృష్ణంరాజు, తాడేపల్లి గూడెం రూరల్ సిఐ వి. రావి కుమార్ .అర్. ఐ లు కృష్ణంరాజు, మనోహర్, అనకంరావు, డి.సి.అర్.బి ఎస్ఐ  బి. మోహన రావు, శివ ప్రసాదు పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam