DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మానవ హక్కులకు అధిక ప్రాధాన్యం: డిజిపి గౌతమ్ సవాంగ్

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 10, 2020  (డి ఎన్ ఎస్):*  నేషనల్ హ్యూమన్ రైట్స్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ అన్ని జిల్లాల ఎస్పీలతో డీఐజీ లతో క్లౌడ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అంతర్జాతీయ మానవ హక్కుల

దినోత్సవము పురస్కరించుకుని  గోడ పత్రికను విడుదల చే సినారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి మానవ హక్కుల పరిరక్షణ కొరకు పాటుపడుతున్న ఎన్జీవోలతో విద్యావేత్తలతో వారి యొక్క అనుభవాన్ని,  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచుకున్నారు

మానవ హక్కుల పరిరక్షణ కొరకు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చెందిన, చట్టపరమైన అంశాల్లో,

సాంస్కృతిక వ్యవహారాల్లో వేర్వేరు నేపథ్యాలున్న ప్రతినిధులు కలసి రెండు సంవత్సరాలు ఈ మానవ హక్కులు రూపొందించారు. ప్రపంచంలో అన్ని మతాల వారు స్వేచ్ఛగా సమానత్వము గా జీవనాన్ని సాగించడం కొరకు రూపొందించబడిన, ఈ మానవహక్కుల ద్వారా ప్రజలకు హక్కులు కల్పించబడినవి

ప్రపంచంలోనే మానవ అక్రమ రవాణా ద్వారా 100 బిలియన్

డాలర్ల వ్యాపారం జరుగుతున్నట్లు, సదరు మానవ అక్రమ రవాణా అరికట్టే నిమిత్తము గా డిజిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకములైన చర్యలు తీసుకొని,  అవగాహన సదస్సులను నిర్వహిస్తూ,  మానవ అక్రమ రవాణా ను అరికట్టి వివిధముగా  చర్యలు తీసుకున్నట్లు, మానవ అక్రమ రవాణాకు గురైన టువంటి వారి యొక్క సమాచారాన్ని తెలుసుకొని

దేశములో  వివిధ ప్రాంతాలలో  ఉన్నటువంటి వారిని రక్షించే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గారు తీసుకున్న చొరవని ఈ కార్యక్రమంలో వక్తలు ప్రశంసించారు

మహిళల పట్ల, మైనర్ బాలికల పట్ల మానవ హక్కుల అతిక్రమణలు జరుగుతున్న నేపథ్యంలో మానవ హక్కులను కాపాడవలసిన ప్రధమ  బాధ్యత పోలీస్ అధికారులపై ఉన్నదని,

ప్రమాదకరమైన ఎటువంటి కర్మాగారాలలో పనిచేసే  14 సంవత్సరాల లోపు ఉన్న బాల, బాలికలు రక్షణ కల్పించాలని, బాల్య వివాహాలను అరికట్టాలని, మానవ అక్రమ రవాణా లు జరగకుండా పోలీసు అధికారులు గట్టి నిఘా ఉంచాలని, మానవ హక్కుల పరిరక్షణ కొరకు ప్రతి పోలీస్ అధికారి తన ప్రథమ కర్తవ్యంగా భావించాలి అని, ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి గారు

తెలియజేసినారు

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏలూరు రేంజ్ డీఐజీ కెవి మోహన్ రావు హాజరైనారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కొరకు ఏలూరు రేంజ్  పరిధిలో చర్యలు తీసుకుంటున్నట్లు, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వారి యొక్క ఆదేశాలపై ప్రతి  పోలీస్ స్టేషన్ లలో సీ.సీ. కెమెరాలను ఏర్పాటు

చేసినట్లు,నిందితులను అరెస్టు చేసిన సమయంలో సదరు అరెస్టు సంబంధించిన సమాచారాన్ని వారి యొక్క రక్త బంధువులకు సమాచారం అందిస్తూ వారికి న్యాయపరమైన సహాయ సహకారాలు కూడా అందుకునేలా గా చర్యలు తీసుకున్నట్లు, మానవ హక్కుల పరిరక్షణ కొరకు ప్రతి  పోలీస్ అధికారి కి అవగాహన కలిగి ఉండి, మానవ హక్కుల గురించి ప్రతి గ్రామంలో ప్రజలకు

అవగాహన సదస్సులు ద్వారా తెలియజేస్తున్నట్లు గా డిఐజి తెలియజేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam