DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర సేవలకు ఐఎఎస్‍ శ్రీలక్ష్మీ కి అనుమతి

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 11, 2020  (డి ఎన్ ఎస్):*     

ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రిగా వైఎస్‍.జగన్మోహనరెడ్డి బాధ్యతలు స్వీకరించాక.. రాష్ట్ర సర్వీసులోకి రావాలని గత సంవత్సరన్నర నుండి విశ్వ ప్రయత్నాలు చేసిన మహిళా ఐఎఎస్‍ అధికారి శ్రీలక్ష్మీకి ఎట్టకేలకు

ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఆమెను రిలీవ్‍ చేయటంతో.. ఆమె జిఎడిలో రిపోర్టు చేశారు. రేపో.. మాపో.. ఆమెకు ప్రభుత్వం పోస్టింగ్‍ ఇవ్వనుంది. శ్రీలక్ష్మీని ఏ పోస్టులో నియమిస్తారు అనే విషయం బయట పడటం లేదు. చిన్న వయసులో ఐఎఎస్‍ అధికారి అయిన శ్రీలక్ష్మీ దివంగత నేత వైఎస్సార్‍ హయాంలో అవకతవకలకు పాల్పడినట్లు

రుజువు కావటంతో.. ఆమె జైలుకు వెళ్లవలసి వచ్చింది. అనేక సంవత్సరాలు ఆమె కోర్టుల చుట్టూ తిరిగారు. జైలు జీవితం గడిపారు. ఆరోగ్యం దెబ్బతింది. తన వలన శ్రీలక్ష్మీ జైలుకు వెళ్లారు అన్న సానుభూతితో ఆమెను రాష్ట్ర సర్వీసులో నియమించుకునేందుకు జగన్‍ రెడ్డి ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోం అమిత్‍షాలను పదే పదే కలిశారు.

బ్రతిమాలుకున్నారు.

ఎట్టకేలకు శ్రీలక్ష్మీని ఏపి సర్వీసులకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జైలుకు వెళ్లిన శ్రీలక్ష్మీని రాష్ట్రంలో నియమించుకోవాలని జగన్‍ రెడ్డిచేస్తున్న ప్రయత్నాలపై రిటైర్డు ఐఎఎస్‍ అధికారులు, వివిధ రంగాల మేధావులు అనేక సందర్భాలతో పలు టివిలలో జరిగిన చర్చలలో అభ్యంతరం

వ్యక్తం చేశారు. ఎవరెవరు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. తన వలన జైలుకు వెళ్లిన శ్రీలక్ష్మీకి సహాయం చేయాలన్న పట్టుదలతో ఆమెను రాష్ట్ర సర్వీసులకు తీసుకు వచ్చారు జగన్‍. శ్రీలక్ష్మీని రాష్ట్ర సర్వీసులకు డిప్యూటేషన్‍పై తీసుకురావటం మెజార్టీ ఐఎఎస్‍ అధికారులకు మింగుడు పడటం లేదట. ఉన్న అధికారుల సేవలనే ప్రభుత్వం

సక్రమంగా వినియోగించుకోవటం లేదు. డిప్యూటేషన్‍పై శ్రీలక్ష్మీని తీసుకురావాల్సిన అవసరం ఏమిటి… అందులోనూ జైలుకు వెళ్లిన శ్రీలక్ష్మీని రాష్ట్ర సర్వీసులలో నియమించటం వలన జగన్‍కు అప్రతిష్ట రాదా అని కొందరు అధికారులు తమకు తెలిసిన వారితో చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఏది ఏమైనా గత సంవత్సరన్నర నుండి శ్రీలక్ష్మీ కొరకు చేసిన

ప్రయత్నాలు ఫలించాయి. ఆమెను రేపో.. మాపో ప్రాధాన్యతగల శాఖలో నియమించే అవకాశాలున్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam