DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళలకు రక్షణ కొరకు ప్రత్యేకమైన చర్యలు: డిజిపి సవాంగ్

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 14, 2020  (డి ఎన్ ఎస్):*  రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు రక్షణ కొరకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ అన్ని జిల్లాల  ఎస్పీలతో, కమిషనర్ల తో, డి. ఐ.జి

లతో మరియు అదనపు ఎస్పి అడ్మిన్ లతో  మరియు సబ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్టర్లు డీఎస్పీల తో వెబ్ నార్ ను నిర్వహించినారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దేశంలోనే మొట్ట మొదటిసారిగా మహిళల రక్షణ కొరకు దిశ చట్టం రూపకల్పన చేసినట్లు తెలిపారు. 
ఈ వెబ్ నారు లో డిఐజి పాలరాజు మాట్లాడుతూ ఆపద సమయంలో మహిళా లు మైనర్ బాలికల  రక్షణ

కొరకు దిశ యాప్ ను, పోలీస్ శాఖ మొబైల్ యాప్ ను వినియోగములోకి తీసుకొని వచ్చినట్లు వివరించారు. మహిళలు, మైనర్ బాలికలకు రక్షణ  ఆంధ్రప్రదేశ్ పోలీసు వారి యొక్క ప్రథమ కర్తవ్యమని, ప్రజలకు, ముఖ్యంగా  మహిళల భద్రత కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు కొన్ని కాల్ సెంటర్లు, దిశ పోలీస్ సేవ మొబైల్ యాప్స్ తీసుకొచ్చాయన్నారు. వాటిని

వినియోగించుకుంటే మహిళా లకు మైనర్ బాలికల కు రక్షణ లభిస్తుంది అని, ఇది చిన్న విషయమే కదా అని, ప్రతిదానికి పక్కవారిని అనుమానించకూడదన్నారు. ఇదేం పెద్ద విషయం కాదులే నేను చూసుకుంటా . . . పోలీసులకు ఫోన్ చేస్తే ఏమనుకుంటారో అనే మొహమాటం పడకూడదన్నారు. 

డయల్ 100. ఇది అందరికీ తెలిసిందే. ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే మీ

దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు కాల్ వెళ్తుంది. డయల్ 112. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. భద్రతా పరంగా ఎలాంటి సమస్య వచ్చినా ఈ నెంబర్‌కు డయల్ చేయవచ్చును  అని తెలియచేసినారు.

ఈ వెబ్ నార్ లో ఏలూరు రేంజ్ డిఐజి కెవి మోహన్ రావు, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి కె నారాయణ్ నాయక్, పశ్చిమ గోదావరి జిల్లా అదనపు ఎస్పి

అడ్మిన్ ఏవి సుబ్బరాజు, డిఎస్పీ సుభ కర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విజయ కుమారి, డిసిఆర్బి సిఐ బిఎన్ నాయక్, డిసిఆర్బి ఎస్ ఐ బి మోహన్ రావు, శివ ప్రసాద్, దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామ కోటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ సూర్య చక్రవేణి పోలీస్ ప్రధాన కార్యాలయం

సిబ్బంది హాజరయ్యారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam