DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్ఎస్ఎస్ స్టిక్కర్ ఉన్న కార్ ను నిరోధించిన అలిపిరి టోల్గేట్ సిబ్బంది

*టిటిడి దృష్టిలో హిందూ సంస్థలే అన్యమతాలుగా మారిపోయాయా?*

*హిందూ స్టిక్కర్లు ఉన్న వాహనాలకు తిరుమల కు అనుమతి లేదా?*

*అసలు ఏ సంస్థలు ఏ మతానివో కూడా తెలియని వాళ్ళు టిటిడిలో ఉన్నారా?*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 21, 2020  (డి ఎన్ ఎస్):*

తిరుమల కొండపైకి అన్యమత సంస్థలకు చెందిన వాహనాలను అనుమతించరాదు అనే నిబంధనలకు అనుగుణంగా అలిపిరి టోల్గేట్ వద్ద ఒక కారు వెనుక అడ్డం పై రాష్ట్రీయ స్వయం సేవక్  సంఘ్ ( ఆర్ ఎస్ ఎస్) అక్షరాలు రాసి ఉండడంతో ఆ  కారును నిలుపుదల చేశారు. ఒక్కసారిగా కార్ లో ప్రయాణిస్తున్న దొండపాటి రాము విస్తుపోయారు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక హిందూ

ధార్మిక సంస్థ అని చెప్పినా, పొలిసు సిబ్బంది కారును కదలనివ్వలేదు. ఆఖరికి ఒక ఆర్ అనే అక్షరం తొలగిస్తే తప్ప ససేమిరా అనడం గమనార్హం. 

అసలు ఏ సంస్థలు ఏ మతానివో కూడా టిటిడి కి తెలియదు:. . .

తిరుమలలో కేవలం హిందూ ధార్మిక సంబంధ వాహనాలకు మాత్రమే అనుమతి ఉండగా, ఏ సంస్థ ఏ మతసంబంధానికి చెందిందో తెలుసుకోవాల్సిన

భాద్యత టిటిడి సిబ్బందికి, అలిపిరి వద్ద ఉన్న పోలీస్ సిబ్బంది కి కచ్చితంగా తెలియాల్సి ఉంది. అయితే ఆర్ ఎస్ ఎస్ సంస్థ వివరాలు తెలియకపోవడం గమనార్హం. క్రైస్తవ మతప్రచారం స్టిక్కర్లు ఉన్న వాహనాలను యధేచ్చగా అలిపిరి నుంచి తిరుమలకు వాహనాలు వెళ్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. 

ఘటన జరిగిన వివరాల్లోకి

వెళితే. . 

*TS08ES 6745 నెంబర్ ఉన్న కార్ లో ( తెలంగాణ రిజిస్ట్రేషన్ వాహనం ) దొండపాటి రాము ఇటీవలే తిరుమలకు వెళ్లారు. ఈ వాహనం వెనుక అద్దంపై RSS (ఆంగ్ల అక్షరాలు) రాసి ఉండడంతో తిరుమల రక్షణవిభాగం అధికారులు అలిపిరి టోల్గేట్ వద్ద నిలిపి వేశారు. ఈ అక్షరాలను తొలగిస్తేనే ఈ వాహనాన్ని కొండపైకి వెళ్లేందుకు అనుమతి ఇస్తామంటూ హుకుం

జారీ చేశారు. దీంతో కొంతసమయం వారికి నచ్చచెప్పేందుకు రాము చేసిన ప్రయత్నం పూర్తిగా వృధా కావడంతో తప్పని సరి పరిస్థితుల్లో R అక్షరాన్ని తొలగించడం జరిగింది. దీనిపై ఆవేదన చెందారు.

ఇదేమైనా క్రైస్తవ వాహనంపై? ముస్లిం వాహనమా?:

టిటిడి సెక్యూరిటీ సిబ్బంది అసంబద్ధ వైఖరికి ఆవేదన చెందిన రాము, తీర్వస్థాయిలో

మండిపడ్డారు. ఆర్ ఎస్ ఎస్ అనేది హిందూ ధార్మిక సంస్థ లేక క్రైస్తవ, ముస్లిం సంస్థలకు చెందినదో చెప్పాలని డిమాండ్ చేసారు. అందరికి తెలిసినప్పటికీ వీళ్ళు అన్యమత పాలకుల ఆదేశాలకు అనుగుణంగా సాగుతున్నట్టు తెలుస్తోందని ఆవేదన చెందారు. 

రెండు రోజుల క్రితం ఇదే సిబ్బంది ఘోరమైన నిర్లక్ష్యం కారణంగా క్రైస్తవమత

ప్రచారానికి చెందిన వాహనం నేరుగా తిరుమల కొండపైనే దర్శన మివ్వడం వివాదం కావడం గమనార్హం. దీంతో ఈ సిబ్బంది హిందూ వాహనాలను అడ్డుకునే పనిలో పడ్డట్టు ఉన్నారు. 

టిటిడి సిబ్బంది వైఖరి పై సోషల్ మీడియా లో హిందూ ధార్మిక ప్రతినిధులు తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నారు. మరికొందరు నేరుగా టిటిడి పాలక మండలి సభ్యులకు,

ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేయడం జరిగింది.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam