DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పగలు, రాత్రి గోమాత రక్షణ కోసం ఛేజింగ్ యోధా రాజాసింగ్ 

*మంగళవారం తెల్లవారుఝామున హైవే పై రాజాసింగ్ ఛేజింగ్.* 

*45 గోవుల అక్రమరవాణా ను అడ్డుకున్న టైగర్ సింగ్* 

*మాకు కనిపించే అక్రమరవాణా సీపీకి కనపడడం లేదా?*

*పార్టీ కంటే గో రక్షణే ప్రాధాన్యం: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

 

*హైద్రాబాద్ / విశాఖపట్నం, డిసెంబర్ 22, 2020  (డి ఎన్ ఎస్):* టైగర్ రాజాసింగ్, రాత్రనక, పగలనక ఏ సమయమైనా గోమాత ఆపదలో ఉందని తెలిస్తే చాలు, తక్షణం ఆఘమేఘాలపై రంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉండే ఏకైక యోధుడు. 
మహారాష్ట్ర నుంచి హైద్రాబాద్ మీదుగా TS 06 U8 3923 నెంబరు కల్గిన పెద్ద ట్రక్ లో సుమారు 45 చిన్న గోవులు అక్రమంగా

తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో, మంగళవారం తెల్లవారుఝామునే రాజాసింగ్ హైద్రాబాద్ హైవే లో మాటు వేసి, లారీని ఏప్ ప్రయత్నం చేసారు. డ్రైవర్ ఆపకపోవడంతో తన వాహనంలో ఛేజింగ్ ప్రారంభించి, కొంతదూరం లోనే లారీని అడ్డుకుని, డ్రైవర్ ని నిలదీశారు. ట్రక్ డోర్ తియ్యగానే అమాయక గోవులు 45 కనిపించాయి. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు

అప్పగించారు. 
ఈ సందర్బంగా రాజాసింగ్ హైద్రాబాద్ నగర పోలీస్ కమిషనర్, పోలీస్ అధికారుల తీరుపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. 
సాధారణ కార్యకర్తలం మాకు కనిపించే ఈ గోమాతల అక్రమ రవాణా మీకు కనపడడం లేదా, లేదా తెలిసి ఉండికూడా నిద్రపోతున్నారా అని మండిపడ్డారు. 

పార్టీకంటే గోరక్షణే ప్రధానం: . .

తనకు

పార్టీ కంటే గోరక్షణే ప్రధానమని, ముందు తానూ భారతీయ హిందువుని అని, తర్వాత రాజకీయ పార్టీ ప్రజా ప్రతినిధి ని అన్నారు. ప్రతి భారతీయుడు, పార్టీలకు అతీతంగా గోమాతను రక్షించాలని పిలుపునిచ్చారు. దీనికోసం ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి రావాలన్నారు. 

హిందూ ధర్మం, గోరక్షణ కోసం ఎంత వరకైనా వెళ్తానని, పార్టీనైనా పదవినైనా

గోరక్షణ కోసం కాళ్ళకింద తొక్కేస్తానంటూ ఉద్వేగానికి గురయ్యారని అన్నారు. అయితే పదవులు తనకు లెక్క కాదని, ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ప్రతి రోజు తెలంగాణ లో జరుగుతున్నా గోమాత అక్రమ రవాణాలను నిరంతరం అడ్డుకుంటూనే ఉన్నారు. గత వారం రోజులుగా మూడు ప్రాంతాల్లో అక్రమ గో రవాణాను అడ్డుకుని

సుమారు 150 గోవుల వరకూ రక్షించి, అక్రమరవాణా వాహనాలను స్థానిక పోలీసులకు అప్పగించారు. 

గోరక్షణ ధర్నా లో. .. 
గో రక్షణ కోసం  జరుగుతున్నా నిరసనల్లో సైతం సోమవారం పాల్గొని, తన గళం వినిపించారు. రాష్ట్రంలో అక్రమంగా గో హత్యలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

పాతబస్తీలో అక్రమంగా స్లాటర్ హౌజ్ లు నడుస్తున్నాయని ఆరోపించారు.ఎంఐఎంకి సపోర్ట్ చేసే సీఎం గోహత్యాలను పట్టించుకోవడం లేదన్నారు.  గో హత్యలను నివారించకుంటే పోలీస్ కమిషనర్ ఆఫీసు ముందు, సీఎం ఫాంహౌజ్ ముందు గోమాతలతో ధర్నా చేస్తామని చెప్పారు రాజాసింగ్. చౌటుప్పల్ నుంచి 33 ఆవు దూడలను హైదరాబాద్ బహదూర్ పురాలోని కబేలాకు

అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆవు దూడలను తరలిస్తున్న వారిని పట్టుకుని చౌటుప్పల్ పోలీసులకు అప్పగించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam